ఇచ్చుటకు ఆసక్తి

దేవుడు సంతోషించునట్లు ఆయనకు కానుక ఇచ్చుట మనలోనుండి పుట్టును. దీనికి వేరే మార్గము లేదు. అది శరీర ప్రకారము కాకూడదు, శరీర కార్యముల వలనను మరియు మనము ఆశించు ఘనతవలన కాకూడదు. ప్రభువుకు ఇచ్చుట కేవలము ఆజ్ఞను బట్టి కాక, ఆయనయెడల అపారమైన ఆప్యాయతను కోరు ఆజ్ఞను బట్టి అని విశ్వాసులుగా మనము గ్రహించవలెను. ఆయన యెడల మన ప్రేమను, ఆయనతో మన అన్యోన్యత మరియు ఆయనయెడల కృతజ్ఞత ఆయనకు నిరాటంకముగా ఇచ్చుటకు కారణములు. ఆయనకు ఇచ్చు విషయమై మనుషులలో నిరాధారమైన ఉద్దేశములు మరియు భయములు ఉన్నవి. అయితే, అవన్నియు శరీరమువలనైన భావములే. కాని, నిజమైన ఉద్దేశముతో ప్రభువు కిచ్చుటను ఆచరించినపుడు, అది ఎవరి జ్ఞానముకైనను, ఆలోచనకైనను సంబంధము లేనిదై, మనలోనుండి వచ్చిన దృఢ నిశ్చయమగును. అట్టి నిశ్చయత ప్రభువు మనయెడల చేసినవాటిని బట్టి, మనకొరకు ఏర్పరచిన వాటిని బట్టి మాత్రమే కలుగును. దీనిని వుదాహరించు వాక్యమును చూచెదము. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వారి ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్టిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి” (నిర్గ. 35:21).

ప్రభువునకు మనమెంత ఇచ్చినను, అది ఆయనకు సరితూగదనిన సంగతి సత్యము. అయినను, తన ఆజ్ఞను తన పిల్లలు పాటించుట చూచినపుడు ఆయనకు సంతోషము, తృప్తి కలుగును; దానిని వారు ఆచరించుటయే గాక, వారినుండి ఆయన కోరిన లక్షణమును సాధనము చేయుదురు. సంతోషముగా ఇచునట్లు వారిని ఆజ్ఞ ప్రేరేపించి, వారి హృదయమును స్పందింపచేయవలెను. దానిని ఒకడు హత్తుకొను హృదయమును కలిగియున్నపుడే గాని లేక దానిని హత్తుకొనునట్లు రూపాంతరము పొందినపుడే, వాడు ఆచరించును. యదార్ధమైన ఉద్దేశముతో ఇచ్చుట పాపపు నీడలను కలిగియుండదు. అది ప్రభువు మనలను నడిపించిన పరిపూర్ణత నుండి కలుగునది. నిజముగా ఇయ్యదలచినవాడు తన సమస్తమును ప్రభువు చిత్తమునకు, ఆశకు లోబరచుకొనును.

ప్రభువునకు ఒకడు గొప్ప ఆసక్తితోనే ఇచ్చును గాని, మనుష్యుని యొక్క ప్రేరణవలన కాదు. అట్టి ఆసక్తి దీనినిబట్టి కొలువగలము. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు – కూషీతో కూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు – నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా” (2 సమూ. 18:22). గొప్ప ఆసక్తితో ఇచ్చునపుడు, అది ఎన్నడును దురాలోచనలనుండి కానిదై యుండును. మనము దేనిని తిరిగి పొంద నాశించము. అయితే, దానికి బహుమానము లుండును. కాని, వాటిని గూర్చి ఆలోచించుటకు ముందుగా హృదయపూర్వకముగా ఇచ్చుటకు కారణములను చూచెదము.

  1. పాపము క్షమించబడుట. నీ ప్రజల దోషమును హరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు” (కీర్త. 85:2). ఒకనియందు పాపము నిలిచియున్నంత కాలము వాడు దేవునికి ఇచ్చుట అయోగ్యమగును; దానికి విలువుండదు. అంతేగాక, పాపముతో ఇచ్చునపుడు ప్రభువు మన యొద్దకు బహుమానములతో వచ్చుట జరుగదు; దానికి ఆయన ఆశీర్వాదములు ఉండవు. బదులుగా, అనాలోచనతో ఇచ్చినందుకు పరిణామము లుండును. పాపము తీసివేయబడినపుడు నూతనపరచబడిన మన హృదయము మన ఆత్మ ప్రేరణ పొందునట్లు జ్ఞానము నిచ్చును – దేవుని కొరకైన ఆసక్తి శరరమువలనైన ఆసక్తిని జయించును. [పాపము నుండి విడుదల పొందినవారై యుండుడి మరియు దేవుని కిచ్చునట్లు మీ హృదయము మిమ్మును ప్రేరేపించినపుడు, అది దీవించబడును].
    • దేవునికి సంబంధించిన వాటన్నిటికి మనుష్యులను అవివేకులునుగా చేయు పాపము పరిణామములను కలిగించును. ప్రభువును సేవించునట్లు వాక్యము ప్రేరేపించనియెడల, ఇతరమైనవి మనలను ప్రేరేపించుచుండెను. గతకాలమందున్నవారు దాని ఫలితము చూచిరి. మరియు రాజదేహసంరక్షుకుల యధిపతియైన నెబూజరదాను ప్రజలలో కడుబీదలైన కొందరిని, పట్టణములో శేషించిన కొదువ ప్రజలను, బబులోనురాజు పక్షము చేరినవారిని, గట్టి పనివారిలో శేషించినవారిని చెరగొని పోయెను” (యిర్మి. 52:15)
  1. ప్రభువు సంరక్షణ. “గాని మీ తలవెండ్రుకలలో ఒకటైనను నశింపదు” (లూకా 21:18). వాగ్దానమును బట్టి ప్రభువు మనలను సంరక్షించుచుండెను. ఆయనకు మన నిమిత్తమున్న ఆశంతయు ఆయనయెడల ఆసక్తితో ఉండుట. మన విషయములో ఆయన బహుగా జోక్యము చేసికొనుట చూచిన మనము ఆయన మనకు బహు దగ్గరా ఉండెనని ఎరిగితిమి. ఆయనతో సంపాదించిన అన్యోన్యత ఆయనకు ఇచ్చుటకు ప్రేరేపించు సాధనముగా పనిచేయును. లోతైన ఆశతో ఆయనను సేవించునట్లు ప్రేరేపించు ఆజ్ఞకు లోబడవలెనని ఆయన మనకొరకు చేసిన కార్యములు జ్ఞాపకము చేయును.
  2. క్రీస్తు యొక్క సువాసన. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము” (2 కొరి. 2:15). ఈ స్థితికి విశ్వాసులందరు చేరవలెనని దేవుడు కోరుచుండెను. దేవుని సంతోషపెట్టునట్లు మనలో సంభవించిన ఆత్మసంబంధమైన రూపాంతరము సువాసనను కలుగజేయును. అప్పుడు, ఆయన కిచ్చుటకు స్పష్టమైన కారణమును చూచెదము. ప్రభువు నియమించిన వాటన్నిటికై ఇచ్చుటకు అది మన హృదయములను ఆత్మలను ప్రేరేపించును. మనము క్రీస్తు సువాసనగా కొనసాగునట్లు మనము ఇచ్చు దానిని సరైన క్రమములో ఆయన ఉపయోగించును.
  3. జీవమును గూర్చిన వాగ్దానము. సువార్త యెడల అపొస్తలుడైన పౌలు గొప్ప ఆసక్తి గలిగినవాడు. సువార్తను ఒకప్పుడు ద్వేషించినను, తరువాత దినములలో దానియెడల తన ప్రేమ తన ద్వేషము కంటె ఎక్కువై యుండెను. కారణము క్రీస్తునందు జీవమును గూర్చిన వాగ్దానము. మరియు అతడీలాగనెను. క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు” (2 తిమో. 1:1). క్రీస్తు నందున్న జీవమును గూర్చిన వాగ్దానము సువార్త పరిచర్య చేయుటకు అతనికి దేవుని చిత్తము నిచ్చెను. ఆలాగుననే, జీవమును గూర్చిన వాగ్దానమును పొందినవాడు దేవుని సేవించుటకు ఆయన చిత్తమును కలిగినవాడు. ఆయనకు సేవ చేయుటయందు ఆయనకు ఇయ్యవలెననిన నిశ్చయత ఉండును.

కాబట్టి, సరైన పునాది గలవారమై మనలను ప్రేరేపించు ప్రభువు ఆజ్ఞకొరకు నిత్యము హృదయమును మనస్సును సిద్ధపరచుకొనువారమై యుండగలము.

Posted in Telugu Library.