ఇది మొదలుకొని

మన ప్రభువైన దేవుడు మనయొద్దకు వచ్చుటకు ఆలస్యము చేయడు. మన అవసరములను ఆశలను తీర్చుటకు ఆయన ఎదురుచూచును. ఆయన మనలను తృప్తిపరచుట ఎట్లో ఎరిగిన దేవుడు. మనకు అసాధారణమైన లేక ఆశ్చర్యముగా నుండు మార్గములలో ఆయన పనిచేయును. తన శక్తి హద్దులను మించినదని ఆయనకు తెలియును మరియు మనము కూడ ఈ సంగతిని తెలిసికొనవలెనని ఆయన ఆశించుచుండెను. కనిపెట్టుకొని యుండునట్లు ఆయన మనలను నడిపించునప్పటికీ, కొంత కాలము వరకే. తాను దయచేయువాటితో మనలను సిద్ధపరచుటకు మనలను నిరీక్షణలో ఉంచుట ఆయన జ్ఞానమై యున్నది. ఇంతకుముందుకంటె ఆయన మనకు దగ్గరగా ఉండెనని మనము తెలిసికొనునట్లు చేయును. నిరీక్షణ ఉన్నను, లేకపోయినను కాలము గతించిపోవును. కాని, నిరీక్షణయందు గడచు కాలము దేవునితో రహస్యమైన అన్యోన్యతకై యున్నది. ఇట్టిది లాభము మరియు ఆయన ఆశీర్వాదములు పొందుటకు మార్గము. ఆయన ఇందుకు సమర్ధుడని ఎరిగినను దానిని ఏలాగు జరిగించునని అనుకొందుము గాని, ఆయనకు మాత్రమే సాధ్యమైన విధానములో జరిగించును. కాబట్టి, మన ప్రభువు యొక్క అద్భుతమైన సామర్ధ్యమును గ్రహించుట మేలగును. రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను(మత్త. 14:25).

స్పష్టతతో ప్రధమముగా మనము గమనించు ఆశ్చర్యమేమనగా యేసు నీటిపై నడుచుట. అది మనకు బాగా తెలిసినదే. ఆయన అద్భుతత్వమును వర్ణించుటకు దానిగూర్చి అనేకమార్లు చెప్పుకొంటిమి. కాని, అది మన జీవితముకు ఎట్లు వర్తించును? యేసు నీటిపై నడిచినయెడల అది ఇప్పుడు మనకు ఎట్టి లాభము నిచ్చును? మన ప్రభువు సర్వశక్తిమంతుడని మనకు తెలియును గాని, సర్వశక్తిమంతుడైన ఈ ప్రభువు మన జీవితముపై ఎట్టి ప్రభావమును చూపగలడు? వారైతే అద్భుతమైన ప్రభావమును పొందిరి. ఎట్లనగా పేతురు సహితము సముద్రముపై నడిచెను. ఒకవేళ అతడు భయపడక, పూర్ణ విశ్వాసమును కలిగియున్నచో ప్రభువు నిలిచియున్న చోటుకు చేరియుండేవాడు. (మరియు, ఇతరులు అతనిని చూచి అతనివలె నడుచుటకు ధైర్యమును చూపియుండేవారేమో ఎవరికి తెలియును?). కాబట్టి, ప్రభువు అతని అల్పవిశ్వాసమును బయలుపెట్టెను. అయినను, యేసు చేసిన దానినిబట్టి వారాయనను దేవుని కుమారునిగా నమ్మిరి. మరియు, వారి జీవితములో సమస్తము మారిపోయెను. వారు శక్తిమంతుడైన మహోన్నతుడను నమ్మసాగిరి. వారు ప్రభువును నమ్ముట నేర్చుకొనుట ద్వారా విశ్వాస గుణమునుగూర్చి తెలిసికొనిరి.

నిత్యజీవముకైన మన ప్రయాణము విషయమై విశ్వాసము అతి ప్రాముఖ్యమైన పాత్రను పోషించును మరియు దానిని కలిగియుండుట అన్నిటికన్నా బహు కష్టము. అది మొదటిగా ప్రభువువలన పొందినదై నిజస్వరూపమును కలిగియుండవలెను. అప్పుడు, మనలో నిలుచునట్లు అది దేవునిచేత నింపబడును. ఆయననుండి మనము పొందు సమస్తము దానిపై ఆధారపడును. అనేకులు ప్రభువును నమ్ముదురు గాని, ఆయనయందు నిరీక్షించలేరు. ఎందుకనగా, దేవుడు దయచేయువాటి విషయమై వారు సూక్ష్మబుద్ధిలేనివారు. కావున, ప్రభువునుబట్టి వారు అరుదుగా తృప్తి పొందెదరు. వారిని తృప్తిపరచు ప్రభువుపై ఆధారపడుట కంటె వారు ఆశించువాటిని పొందరేమోనని భయముతో ఉందురు. కాని, పేతురైతే అల్పవిశ్వాసమునుండి బహు గొప్ప విశ్వాసమునకు ఎంతగా ఎదిగెనో ఒకనికి పరిచయము చేయుట అనావశ్యకము. ప్రభువు చేసినవి మరియు చెప్పినవి ఐశ్వర్యములను మించిన ఐశ్వర్యములుగా తనయందు దాచుకొనెను గనుక, ఆయనతో తన సంబంధము తనకు నిర్దోషమైన విశ్వాసమును దయచేసెను. అవి విశ్వాసమును కొనసాగించుటకు మరియు దీవెనలు కొరకు సమస్త కారణములని అతను తెలిసికొనెను. అతడు సంపూర్ణ విశ్వాసమును సంపాదించెను. ఘనమైన ఆశీర్వాదములు సంపూర్ణ విశ్వాసమువలన కలుగును. ఎందుకనగా, యేసు – ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీడుడగునని వారితో చెప్పెను (లూకా. 22:69).

అల్పవిశ్వాసము యేసు మాటలలో నున్న అర్ధమును గ్రహించుటకు సహాయపడదు. సంపూర్ణ విశ్వాసమైతే నీటిపై నడిచిన మనుష్యకుమారుడు, శిష్యులతో నున్నవాడు మరియు వారు నిర్దోషమైన విశ్వాసమును కలిగియుండునట్లు సహాయపడినవాడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనవాడని గ్రహించునట్లు చేయును. దీని అర్ధమేమి? ఆయన శక్తిలో మార్పు ఉండదు; ఆయన అద్భుతత్వము నిలకడైనది; తన ప్రజలకు ఇంకను మనుష్యకుమారునిగా తెలియపరచుకొనవలెనని ఆశతో ఉన్నాడు. అయితే, శిష్యులవలె మనము ఎవరిని నమ్మితిమో ఎరిగినపుడు ఆయన అద్భుతత్వము మనకు అగుపడును. అనేకమార్లు ప్రజల యొద్దకు ప్రభువు రాకపోవుటకు కారణము సంపూర్ణ విశ్వాసముకై వారు పిరికివారగుటయే. అట్టి పిరికితనము విశ్వాసముకై వారిని బలహీనులుగా చేయునట్లు అపవాదికి గొప్ప అవకాశమిచ్చును. ఇందువలననే సంఘములలో అనేకులు ప్రభువు అద్భుతత్వమును చూడరు మరియు వారి స్వంత మార్గములలోను అల్పవిశ్వాసములోను నడిచెదరు. ఏదో సమయమున వారు భ్రష్టత్వమునకు పోవుదురు. యేసు నీటిపై మరల నడువగలుగునా? కచ్చితముగా! దానికి సమానమైనవాటిని మనకొరకు చేయునని మనము నమ్మవచ్చునా? ఆయన మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై యున్నాడు. అనగా, మనకు దయచేయుట ద్వారా దేవుడు తన అద్భుతత్వమును తెలియజేయును. అప్పుడు, మన విశ్వాసమును న్యాయముగా పోషింతుము మరియు ఆయన మనలను తృప్తిపరచును. ఇట్టి విశ్వాస ఫలితము పౌలును తన తోటివారును కనుగొనినట్లుగా మిక్కిలి వింతైనది. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి యున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి (అపొ. 16:10).

ఆశ్చర్యమైనవాటిని చేయుట మన దేవునియందే ఉన్నది. తన కుడిపార్శ్వమున ఆసీనుడైన ఆయన కుమారుడు అందుకు కారణము. ప్రభువును పూర్ణముగా నమ్మినపుడు దేవుడు తన ఉద్దేశమును మనకిచ్చును. ఆ ఉద్దేశము కొరకు మన నమ్మికకు దయచేయుచు దానికి తన ఆశీర్వాదములను జోడించును. కేవలము దేవుని ఉద్దేశమునుబట్టి పౌలును తన తోటివారును పొందిన దర్శనము యేసు నీటిపై నడిచినదానికంటె తక్కువైన ఆశ్చర్యము కాదు. క్రీస్తునందు దేవుడు తన్నుతాను వారికి బయలుపరచుకొనెను. యేసు నీటిపై నడుచుటైనను, దర్శనమైనను దేవుడు తన అద్భుతత్వమును తన ప్రజలకు బయలుపరచుటై యున్నది. ఒకటి ఆయనతో అన్యోన్యత కొరకైతే మరొకటి ఆయనతో అన్యోన్యతవలన కలిగినది. ఇది మనము వాక్యమునుండి గ్రహించుచున్నాము. మరియు, మనమాయన అద్భుతత్వమును చూడవలసినచో వాక్యములో నున్న శక్తిని నమ్మవలెను. వాక్యము దేవుడు చేసిన ప్రతి కార్యమునకు మనలను నడిపించి మనయెడల ఆయన చేయు ప్రతిదానికొరకు ఎదురుచూడునట్లు విశ్వాసము నిచ్చును. ఇది మనకు నిరీక్షణ నిచ్చును; ఆయన మనయొద్దకు వచ్చుట ఆలస్యము చేయడు. ఇందు నిమిత్తము ఆత్మ ఈలాగు చెప్పుచున్నాడు – కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే (1 కొరి. 12:4).

దేవుడు మీ విశ్వాసముకు ఏ విధముగా దయచేసి మిమ్మును తృప్తిపరచునా అని చింతించకుడి. కాని, ఆయనయొద్ద నానావిధములుగా వరము లుండెను గనుక ఆయనపై అధారపడుడి. తన అద్భుతత్వమును మీకు చూపించును. మన ప్రభువు నీటిపై నడిచెనని మీరు వింటిరి. ఇప్పుడు దానికి సమానమైనవాటిని చూచెదరు. ఇందుకు ఆయన సమర్ధుడు. ఇదే మీ విశ్వాసముకు ఆయన దయచేయునది; విశ్వసించువారితో మిమ్మును ఏకము చేయును. ఏలయనగా తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టిన తన కుమారుడను మీరు నమ్మిరి. ఆయన ద్వారా మీ అవసరములను ఆశలను తీర్చుటకు ఈయన నిశ్చయించుకొనెను. ఇట్లు చేయుటకు ఆయన ఆశతో ఉండెను గాని, మీరు మొదటిగా ఆయన వరములను పొందవలెనని కోరుచున్నాడు. ఆయన ఆశీర్వాదములను మీరు న్యాయముగా వాడుక చేయునట్లు ఆయన వరములు మీకు ధైర్యమును, శక్తిని మరియు నమ్మికను దయచేయును. ఇందువలన, మీరు చేయు సమస్తమునుబట్టి ఆయన నిర్భయముగా ఉండును. ఏలయనగా మీరు సమస్తమును తన మహిమకొరకు చేయుదురని ఆయన నమ్మును. ఇది అన్నియు మీకు అనుగ్రహింపబడునట్లు ఆయన నీతిని రాజ్యమును పొందుట.

మరియు ఆత్మ చెప్పుచున్నాడు, కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి” (1 పేతు. 1:13). యేసుక్రీస్తు ప్రత్యక్షమైనపుడు వచ్చు కృపపై మీ నిరీక్షణ పూర్ణముగా ఉండినయెడల మీ విశ్వాసము సంపూర్ణమైనది. అది మీయందు ఆయన నీతి, రాజ్యము ఉండెనని సూచించును. అపవాది క్రియలకు విరోధముగా మీరు వెంటనే పనిచేయునట్లు మీ విశ్వాసము మీ మనస్సును బలపరచును. మీ ఆలోచనలు, ఉద్దేశములు ఆత్మద్వారా దేవుడు ఇచ్చిన వరములనుబట్టి ఉండుటకు అది మీ అంతరంగమును క్రీస్తు కొరకు పవిత్రముగా ఉంచును. ఆయన వరము మీ నీతిని కాపాడును మరియు మీపై పరిశుద్ధాత్ముని ముద్రను సూచించును. దేవునిచేత బలపరచబడనిదే అపవాదితో, లోకసంబంధమైన చెడు ఆలోచనలతో పోరాడుటకు క్రైస్తవుడు తన్నుతాను సిద్ధపరచుకొనలేడు. దేవుని వరములను మనము కలిగియుండుట చిన్న విషయము కాదు; అవి సమస్త దుర్నీతిని దుష్టత్వమును నిలుపుటకు మాత్రమే సాధనములు కాక మేలు చేయుటకు కూడ సాధనములు. అనేకులు వాటిని అలక్ష్యము చేసి, తమ స్వంత వాటిని ఏర్పరచుకొని ఆయనకు విరోధముగా పని చేయుచున్నారు. దేవుని సువార్తకు విరోధముగా పనిచేయుటకు వారు తమ ఆత్మలను అపవాది పాత్రతో మత్తుగా చేసికొనియున్నారు. క్రీస్తు వచ్చినపుడు ప్రత్యక్షమగు కృప వారిని తప్పించుకొనును. కాని, దేవుడు దయచేయువాటికొరకు సూక్ష్మబుద్ధిగల విశ్వాసముతో నున్న మిగిలినవారికి ఆశీర్వాదము నిలిచియుండును. అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని – ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును (ప్రక. 19:1).

సహోదరులారా, దేవునికి చెందినవాటినిగూర్చి మీరు తెలిసికొనిరి గనుక ఆయన ఉద్దేశమును నెరవేర్చు నిమిత్తము మీ విశ్వాసముకు ఆయన దయచేయునని తెలిసికొనుడి. ఇదే మీయెడల ఆయన అద్భుతత్వము. ఇప్పుడు, ఆయన నామము నిరంతరము మహిమ పొందునట్లు మీ అవసరము లన్నిటిని, ఆశలను ఆయన తృప్తి పరచును. మనుష్యులు ఆలోచనలమీద గాని, దేవుని వరములను అలక్ష్యము చేయువారి జ్ఞానముమీద గాని ఆధారపడకుడి. లేనియెడల, మన ప్రభువు యొక్కయు, దేవుని యొక్కయు అద్భుతత్వమును తెలిసికొనవలెననిన మీ నిశ్చయము ఆవిరైపోవును. బహు జనులతోపాటు జీవించుటకు నిరీక్షణను కోల్పోవుదురు. పరలోకమందు దేవుని స్తుతించువారు ఆయన రక్షణను, మహిమను మరియు శక్తిని భూమిపై ఎరిగి, చూచినవారు; వారాయన నీతిని, రాజ్యమును వెదకిరి. ఇందువలన, క్రీస్తు భూమిమీదకు దిగివచ్చి దేవుని రాజ్యమునుగూర్చి వివరించెను. మరియు, జనసమూహములో కొందరు ఈ మాటవిని – నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి (యోహా. 7:40).

Posted in Telugu Library.