ఒక ప్రత్యేకమైన వెలుగు

ప్రభువు నీకు చేసినవాటన్నిటిని బట్టి ఆయనయెడల నీ కృతజ్ఞత ఎంత గొప్పదై యున్నది? నీ పట్ల ఆయన చేసిన కార్యముల వివరములను నీ కుటుంబమునకు, స్నేహితులకు, బంధువులకు లేక పొరుగువారికి తెలియచేయుచున్నావా? ఆయన నిన్ను చీకటినుండి, శ్రమ మరియు దుఃఖము నుండి బయటకు రప్పించెనని హృదయపూర్వకముగా చెప్పగలవా? ఆయన కొరకు నీవు చేయునవి పై ప్రశ్నలకు జవాబు నిచ్చును. ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా ఆయన నీకు అప్పగించినవాటిని ఎడతెగక జరిగించుచున్నయెడల, వాటిని సంపూర్ణము చేయుటకు నీవు ఒక ప్రత్యేకమైన వెలుగును బయలుపరచెదవు. ఈ వెలుగు ఇతరులు నీవు జీవించుచున్న విధానము పట్ల దీర్ఘాసక్తి చూపించునట్లు వారిని పిలుచును. అది వారిలో తెలిసికోవలెననిన ఇచ్ఛను పుట్టించును. మోషే ఈ ప్రభువు ఆజ్ఞను ఇశ్రాయేలుతో పలికెను. ఇకమీదట నీ కుమారుడుఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచిబాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటకి రప్పించెను” (నిర్గ. 13:14). 

విశ్వాసులుగా మన తత్క్షణ బాధ్యత దేవుడు మనకిచ్చిన వారియెడలయై యున్నది. మనలో అనేకులకు అది కుటుంబమగును మరియు తరువాత ఇతరులకు అది వ్యాపించును. ప్రతి విశ్వాసి తాను వారి ఎదుట జీవించిన విధానముకై ప్రభువుకు లెక్క యొప్పచెప్పవలసి యున్నది. విశ్వాసులుగా మనము చేయు కార్యములే మనకు బహు దగ్గరగా ఉన్నవారిపై ప్రభావము చూపించును. ప్రభువు మనకు అప్పగించిన దానియెడల నమ్మకముగా లేనియెడల, ఆయన ఇతరుల కొరకు మనలను ఏర్పరచి, వారియెడల దయచేసిన బాధ్యతలో విఫలమౌదుము. సంఘమునకు పోవువారు ఈ సంగతిని తరచుగా నిర్లక్ష్యము చేయుదురు. కాని, సమస్తము మనతో ప్రారంభమగును. మనము ఉండవలసిన జనులుగా ఉండుటకును, దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించుటకును శరీరసంబంధమైన క్రమశిక్షణతో పాటు ఆత్మసంబంధమైన క్రమశిక్షణ కూడ అవసరము. ఇట్టి అనుభవము ఉండుటనగా, ఆయన బలమైన హస్తము అనుభవింతము. ఆయన హస్తమును బట్టి మన జీవితములో సమస్తము అర్ధము కలిగియుండును. మనలో ఎటువంటి వ్యర్ధమైనదియు అనవసరమైనదియు ఉండదు. దేవుని పిలుపులోను ఆయన మనకు అనుగ్రహించిన ఉద్దేశమందును ఉన్న పూర్ణ జ్ఞానమును కలిగియుందుము.

దేవుని బలమైన హస్తము మనతోపాటు పనిచేయగా కొండమీద కట్టబడిన పట్టణమువలె నిలిచియుందుము. ప్రజలను మేపవలెనని వారిని ఆయన మనకు అప్పగించును. ఇది ఒకరితో ఒకరికి భేదము కలదు. నీ విషయములో నీ కుటుంబముతో ఆయన మొదలుపెట్టవచ్చును మరియు ఇతరుల విషయములో వారి స్నేహితులతోను, బంధువులతోను లేక పరిచయము లేనివారితోను ఆయన ప్రారంభించును. ఇది ఆయన మనలను నిలిపిన స్థితినిబట్టి ఉండును. ఆయన బలమైన హస్తము ద్వారా నీవు పొందిన అనుభవములు వారికి ఆత్మసంబంధమైన ఆహారమగును. దీనియందు ఆయనయెడల నీ విధేయత, వాక్యము యొక్క శక్తి, ఆయన వాగ్దానముల నెరవేర్పు మరియు విశ్వాసము యొక్క విధానము అర్ధమగును. ప్రభువును ఆశీర్వదించుటకు (స్తుతించుటకు) నీకవకాశముండును.

గతకాలపు దినములయందు తాము ప్రభువు కొరకు చేసినవాటిని రాబోవు తరములకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి ఇశ్రాయేలీయునికి ఇయ్యబడెను. ఈ ఆఖరి దినములలో ప్రతి విశ్వాసి ఆయన వారికి అప్పగించినవారిని మేపు నిమిత్తము దేవునికి చెందినవాటిని సాధన చేయుట ఆవశ్యకముగా నిర్ణయించబడెను; ఏలయనగా క్రీస్తునందు కృప అందరికి నిష్పక్షపాతముగా దయచేయబడెను. మరియు దీనికై దేవుని బలమైన హస్తము అవశ్యము గనుక, నీవు చేయవలసినవి ఇవే:

  1. ఆయన ఆలోచనను నష్టపోరాదు. “యెహోవా యొద్ద (సౌలు) విచారణచేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను (1 సామూ. 28:6). నీ జీవితములో నీవు చేయువన్నియు ఆయన ఆలోచనవలనై యుండవలెను. ఇది ఆయన గూర్చి మనుష్యులకు సాక్ష్యమిచ్చుట కూడ కలిగియున్నది. ఆయన ఉపదేశములను నిర్లక్ష్యము చేసినపుడే నీవు ఆయన ఆలోచనను నష్టపోవుదవు. అట్టి సమయములో జ్ఞానము విషయమై నీవు రిక్తునివై యుందువు. ప్రభువు నీ విచారణకు సమాధానము దయచేయు నంతవరకు ఆయన బలమైన హస్తమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నీకు స్థిరత్వముండును.
  2. ఆయన ఆశ్చర్య కార్యములను ఆశించుము. మరియు నీ జనుల యెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడినేలను నడిచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి (నెహె. 9:11). ఇదివరకైనను, ఇప్పుడైనను, దేవుడు తాను నియమించుకొనిన వారియెడల ఆశ్చర్య కార్యములు చేయు విషయమై మారలేదు. ఒక సామాన్య క్రైస్తవునిగా నీవు ఆయన ఆశ్చర్య కార్యములను అనుభవించుదవు మరియు కనీసము నీ కుటుంబమునకు ఆయన సాక్షిగా నీ వుండవచ్చును. ప్రభువును నమ్మువారందరికి సాతాను శత్రువు. మరియు, నిన్ను వానినుండి, వాని పనివారినుండి కాపాడుమని ప్రభువును కోరినపుడు, నీవాయన ఆశ్చర్య కార్యములు చూచెదవు. వారి శత్రువును నాశనము చేయుటకై అద్భుతముగా సముద్రమును విభాగించినపుడు వారితో ఆయన ఏలాగు ఉండెనో నీతో కూడ ఆలాగుననే ఉండెనని అవి జ్ఞాపకము చేయును.
  3. ఆయన గుడారముగా ఉండుము. నీవు ఆయన గుడారముగా ఉన్నప్పుడు జరుగు ఉత్తమమైనది ఇదే – మహా ఘనుడను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించువాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారి యొద్దను దీనమనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను (యెష. 57:15). నిన్ను ఆయన గుడారముగా చేయు రెండు ముఖ్యాంశములు దీనమనస్సు, నలిగిన ప్రాణము. అవి ఆయన బలమైన హస్తము నీతో ఉండునట్లు చేయును. నీవు వినయము గలవాడవైయున్నకొలది, గొప్ప జ్ఞానము కొరకై ఆయన నిన్ను చైతన్యపరచును. మరియు, నిత్యము విరిగియున్న హృదయముతో ఉండుటనుబట్టి ఆయన నీ పాపమును తొలగించి, దాని ఫలితము పొందని స్థితికి నిన్ను తీసికొనివచ్చును.
  4. అపవిత్రమైన వాటిని, అపవిత్ర స్థలములను తప్పించుకొనుము. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు; మీరు లేచి వెళ్లిపోవుడి, మీకు నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి” (మీకా. 2:10). దేవుని బలమైన హస్తము నీతో నున్నదనుటకు సూచన ఆయన నీ జీవితములో నీకిచ్చు విశ్రాంతియే; ఆయన నిన్ను శ్రమనుండి, దుఃఖము నుండి బయటకు రప్పించెను. మరల అశాంతికి పోకుండునట్లు జాగ్రత్తపడుము. ఆయన ఇచ్చు విశ్రాంతి అనేక ఆశీర్వాదములతో నుండును గనుక, అది బాధను కలిగియుండదు. ఆయన నీకు అప్పగించినవారికి ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుటకు అవి సహాయము చేయును.
  5. పరిశుద్ధాత్మునిపై ఆధారపడుము. “గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువే గాని అది యెక్కడినుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను (యోహా. 3:8). నిజముగా నూతనజన్మ పొందినవానిగా నీవు పరిశుద్ధాత్ముడను కలిగియుందువు గనుక, ఆయన స్వరమును ఆలకించుము. వాక్యములోనుండి దేవుడు నీతో మాటలాడినవి ఆయన జ్ఞాపకము చేసినపుడు, వాటిని నిరాకరించవద్దు. ఆయనను వినిన కొలది నీకొరకైన దేవుని ఉద్దేశములను విందువు. ఆయన కేవలము నిన్ను సమస్త సత్యములోనికే నడిపించును. ఆయన స్వరము ఎల్లప్పుడు వాక్యముతో ఏకీభవించును. ఆయన సాధువైనవాడు. ఆయనవలన కొండమీద కట్టబడిన పట్టణముగా నుండుటకు నీవు జీవితమును పొందుదువు.
  6. నీ పిలుపుకు కట్టుబడుము. అయితే ప్రభవు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను (1 కొరి. 7:17). బయటనుండి నీవెన్ని ఒత్తిడులను ఎదుర్కొనినను, దేవుడు నీకిచ్చిన పిలుపును విడిచిపెట్టకుము. ఏలయనగా వాటిని ఎదుర్కొందువని దేవుడు ముందుగా ఎరిగే నిన్ను పిలుచుకొనెను; వాటిని జయించిన పిమ్మట నీవు అనుభవించునట్లు ఆయన ఒక పచ్చికగల చోటును సిద్ధపరచును. నీవు నీ పిలుపునకు కట్టుబడి యునపుడు నీవెదుర్కొనునవి దేవుని బలమైన హస్తము నీతో ఉండునట్లు చేయును. మరియు, నీవు ఆయన ఆశ్చర్య కార్యములను ఆశింతువు గనుక, నిన్ను దయచేసిన వారికి ఆత్మీయాహారముగా నుండు కార్యములు ఆయన నీకు చేయును.
Posted in Telugu Library.