దేవుని సంకల్పమునకు కట్టుబడియుండుట

సువార్తను ఆలకించుటవలన గొప్ప మార్పులు చోటుచేసికొనును. దేవుని వర్తమానముపై దృష్టిపెట్టుట ద్వారా మేలుకై మార్పులు చేయు నిమిత్తము మన అంతరంగ పురుషుడు ఆత్మతో సంయుక్తమై యుండును. సువార్త రక్షణ గూర్చిన వర్తమానము. అది బోధలను, ఉపదేశములను, హెచ్చరికలను మరియు బహుమానములను కలిగియుండును. వీటికి అంటిపెట్టుకొనుటవలన మనకు సరిపడు మార్పును జీవితములోనికి తెచ్చును. మనుష్యులు తమ జీవితములో మార్పుకై తరచుగా వెదకుదురు. వారు జీవించుచున్న జీవిత విధానమును తప్పించుకొనవలెనని నిశ్చయముగా ఆశపడుదురు గనుక, దానిని వెదకుదురు. వారంతగా కోరుకొనుటకు కారణము వారు జీవింపవలెనని ఎంచుకొనిన జీవిత విధానమే. జీవితములో విజయులైయుండు ఉద్దేశముతో మనుష్యులు భేదముగల జీవిత విధానములను ఎంచుకొందురు. అది సఫలము కానపుడు నిరాశ చెందినవారై మార్పును కోరుదురు. ప్రభువు అంగీకారము లేకుండ వారి జీవిత విధానమును ఎన్నిమార్లు మార్చినను, అది వారికి మేలుచేయదు. వాస్తవముగా ప్రభువును ఆలకించుట లాభము చేకూర్చు జీవిత విధానమును అవలంభించుకొనుటకు దయచేయును. సువార్త ఆయనను ఆలకించుటకు వర్తమానము. ఎవడైనను దానిబట్టి నడిచినయెడల, వాడు ఎన్నటికిని మార్పు అవసరములేని జీవిత విధానమును పొందును. ప్రభువు దానికి సంపూర్ణత నిచ్చును. 

దేవుని వర్తమానము చాలవాటిని మన ఎదుట నిలుపును. మనము వాటిని తీసికొనినపుడు మార్పును కలిగించు నిమిత్తము మన జీవితము యొక్క అనేక స్థితులలో అవి పనిచేయును. ప్రతివాడు పూర్ణముగా తనకైన దేవుని సంకల్పమునకు కట్టుబడినపుడు సంపూర్ణత మనలను చుట్టుకొనును. కావున, సువార్త మనకు బోధించును, ఉపదేశించి, హెచ్చరించును. ఆదాము తోటలో పోగొట్టుకొనిన లక్షణమును మనము తిరిగి పొందుట మనయెడల దేవుని ఆశైయున్నది. దానిని పొందుట పాపమును అర్ధముచేసికొని, దానికి దూరముగా ఉండుటతో ప్రారంభమగును. సువార్త పాపమును గూర్చి మనకు ఉపదేశించును; అది దాని తత్వమును గూర్చి బోధించి, దానివలనైన ప్రమాదమును గూర్చి హెచ్చరించును. ఇందుకు ఉదాహరణ ఈ వాక్యము. యోనా పట్టణములో ఒక దినప్రయాణమంత దూరము సంచరించుచుఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా (యోనా. 3:4). ఆ దినమున జరిగినది ఒక అద్భుతమైన సంఘటన. అది జరుగునని యోనా సహితము ఎరిగెను మరియు అది జరుగుట ఇష్టములేనందున దానినుండి పారిపోవుటకు యత్నించెను. దేవుని వర్తమానములో నుండు శక్తిని గూర్చి, అది కలుగజేయు మార్పును గూర్చి అతనికి బాగా తెలియును; ఏలయనగా అతడు ఆయన ప్రవక్తై యుండెను. దానిని ఆలకించినవారిలో అది సఫలముగా పనిచేయునని అతడు ఎరిగియుండెను. అది ఆలాగు జరుగ ఇష్టములేక దానినుండి పారిపోవుటకు చూచెను.

వర్తమానమును యోనా పలుకగా నీనెవె వెంటనే దేవునివైపు తిరిగెను. మారుమనస్సు పొందుటకై వారు ప్రతి ప్రయాసను కనుపరచిరి. ఆ దినమున వారి జీవిత విధానములో పూర్తి మార్పు జరిగినది. వారిని మంచి స్థానములో నిలుపు ఉత్తమమైన జీవిత విధానమును ఎంచుకొనగలిగిరి. మనము సువార్తను ఆలకించినపుడు మొదటిగా సంభవించు ఆశ్చర్యము దేవుడు మనయెడల కనికరపడుట. ఇది జరిగినపుడు భయంకరమైన, చేదైన పరిణామములు మనపై పడకుండును. రెండవదిగా కలుగునది ఆయన ఆశీర్వాదములు. ఒకడు రక్షింపబడినప్పటికీ, ఒకటి లేక రెండు విషయములలో వాడు మార్పు నొందవలసి యుండును. మరియు, సువార్త వాటినిగూర్చి మనస్సుకు తెలియజేయగా వాడు ఆలకించినపుడు, దేవుడు కనికరపడును. మనము ఊహించు దానికంటె దేవునికి ఎక్కువ సహనముండును. దానిని మనము దుర్వినియోగము చేయునపుడే ఆయనకు కోపము రప్పింతుము. మనము మంచి చెడులను వివేచించు స్థితిలో ఉన్నామో లేదో ఆయన ఎరుగును. అనగా, కొన్నిమార్లు మనము మార్పు నొందవలసిన అవసరము లేదని తలంచెదము. దేవుడు తన వర్తమానము ద్వారా మార్పు పొందు నవసరమును బయలుపరచును. మన క్రియలకు చేదైన పరిణామములను ఎదుర్కొనకుండ ఆయన మనకు సహాయము నందించును. వర్తమానము మన చెవిని పడువరకు ఆయన మనలను కాపాడును. అప్పుడు, మన ప్రత్యుత్తరమునుబట్టి ఆయన స్పందించును.

ప్రభువు వర్తమానము వినిన పిమ్మట మార్పు నొందుటను నీనెవె పట్టణము యోచించనియెడల ఫలితము నిశ్చయముగా వేరై యుండును. యోనా కూడ అసంతృప్తిని, కోపమును వ్యక్తపరచకపోవును. ప్రభువు పరిచారకుడు తన బాధ్యతను నిర్వర్తింపవలెను మరియు వినువారు అతని వర్తమానమును ఆలకించుటను ఎంచుకొనవలెను. అప్పుడు, ఫలితము ఎల్లప్పుడు అద్భుతముగా ఉండును. అది జీవిత విధానములో మార్పుకు మూలకారణమైన నీతి సంబంధమైన జీవితము. సువార్త యొక్క పని ఈ వాక్యమందు సంక్షిప్తముగా ఉన్నది. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును” (మార్కు 1:2). వర్తమానమును పలుకువాడు ఉండెను మరియు వానిని ఆలకించువారు ఉండిరి. ప్రజలను ప్రభువు నొద్దకు నడిపించుటయే వర్తమానము యొక్క ఉద్దేశము. వర్తమానము మరియు దానిని ప్రకటించువాడు ప్రభువు కార్యములు. ఆ రెండింటిలో ఈలోకసంబంధమైన పధార్ధమైనను, మనుష్యుల యొక్క క్రియైననుఉండదు. కావున, నీనెవెలో కార్యము జరిగెను.

దేవుని చిత్తానుసారమైన సువార్త సఫలమగును. దానితో సంబంధమున్న వారందరిలోను మరియు అందరి కొరకును అది ఫలితములు దయచేయును. అది దయచేయు శ్రేష్టమైన ప్రమాణములనుబట్టి వారిని ఎత్తైన స్థలమునకు నడిపించును. ఈ సంగతిని ఎరిగినవాడు దానిని బహు గట్టిగా పట్టుకొనును. ఏలయనగా దానిలో అపారమైన సంరక్షణ దయచేయబడును. యేసు దానిని బయలుపరచెను. మూడవసారి ఆయన – యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి – ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు – నా గొఱ్ఱెలను మేపుము (యోహా. 21:17). తన గొఱ్ఱెలను మేపుమని యేసు పేతురుతో చెప్పినపుడు, అది ప్రభువు సేవకుని యొక్క బాధ్యతను సూచించుటయే  కాక, విశ్వాసుల కొరకు సువార్త వర్తమానమును కూడ సూచించుచున్నది. “మేపుము” అనిన పదము ఒక విశ్వాసి జీవితములో ప్రతి సందర్భమునకు వర్తించుటకై ఉద్దేశించబడెను. ఎక్కడైతే అవసరము లేక లోటు ఉన్నదో ప్రభువు సేవకుని వర్తమానము దానిని సంబోధించును. అవసరమును యెరిగిన ప్రభువు వర్తమానమును దయచేయును. కాబట్టి, సువార్త ఫలకరమైన ఫలితములను ఫలించును. అయితే, నీవు ఆ వర్తమానమును ఆలకించుచున్నయెడల, అది అద్భుతమైన జీవిత విధానముకు ఫలితములను దయచేయుచుండెను. కాని మొదటిగా, నీవు మూడు విషయములను ఆలోచన చేయవలెను.

1. వర్తమానము క్రీస్తు సంబంధమైనదా? ఆత్మ ఈలాగు చెప్పుచున్నాడు. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే(1 కొరి. 3:11). సువార్త వర్తమానము క్రీస్తును కేంద్రముగా కలిగియుండవలెను. అది దేవుని ఉద్దేశములను, లక్ష్యములను, ఆలోచనలను దయచేయవలెను. అది మానవ సంబంధముగాను, స్వకీయ సంబంధముగాను ఉండరాదు. అది ఆత్మలో ప్రభువు సన్నిధిని దయచేయవలెను.

2. వర్తమానము నిన్ను కట్టుచున్నదా? ఈ సంగతి మనస్సున కలిగి పౌలు ఈలాగు చెప్పెను. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేతన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి” (ఫిలి. 3:2). నీ అంతరంగ పురుషుడు లాభము పొందనపుడు నీవు ఆ వర్తమానము నుండి దూరముగా ఉండవలెను. వర్తమానము క్రీస్తు యొక్క సమాధానమును, నెమ్మదిని, సంతోషమును దయచేయనపుడు, అది దేవునివలనైనది కాదు. అద్భుతమైన జీవిత విధానముకు నడిపించు నీతి జీవితమును నీలో కలిగించుటకై అది ఎన్నడును నీలో పనిచేయదు. యేసుతో అన్యోన్య సంబంధము కొరకు అది నిన్ను ఉత్సాహపరచనియెడల, అది నిశ్చయముగా నిన్ను నాశనము చేయుచుండెను. నిజమే, కుక్కలు గొప్ప పెంపుడు జీవులు కావచ్చును, గాని వాటి సహజగుణము నాశనము చేయుటయే. ఆరీతిగానే దుష్టులైన పనివారును హృదయ సంబంధముకాని ఛేతనయు ఉన్నవి.

3. వాక్యము హెచ్చరించుచున్న దినములతో వ్యవహరించునట్లు వర్తమానము నీకు సహాయపడు-చున్నదా? అంటే, విశ్వాసములో నిలకడగా ఉండుటకును ప్రస్తుత దినములను జయించుటకును అది నిన్ను సిద్ధపరచుచున్నదా? ఎందుకంటే, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము (2 తిమో. 3:1). క్రీస్తుకు చెందిన దేవుడను సమస్తముకు సమాధానముగా అది నీకు బయలుపరచనియెడల, వాస్తవముగా అది నిన్ను ఆయనకు విరోధముగా నడిపించు-చుండెను.

     నిజమైన సువార్త ఎల్లప్పుడు పరీక్షను జయించును. కావున, దానిని ఆలకించువారు కూడ అద్భుతమైన జీవిత విధానమును సంపాదింతురు. ఏలయనగా వర్తమానమందు పనిచేయు దేవుడు నిశ్చయముగా దానిని ఆలకించువారిలో కూడ పనిచేయును. కాబట్టి, పేతురు సంతోషముగా ఈలాగు చెప్పెను. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన మీకు సువార్త ప్రకటించినవారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన యీ సంగతుల విషయమై, తమకొరకు కాదు గాని మీకొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు(1 పేతు. 1:12).

Posted in Telugu Library.