దేవుని సంతోషపెట్టు లక్షణము

క్రైస్తవునిలో బహు ప్రీతికరమైన లక్షణము యధార్ధత (న్యాయప్రవర్తన). దేవుడు యధార్ధతవంతుని ప్రేమించును. యధార్ధత సత్యమును, దేవుని పట్ల విధేయతను, నీతిని, న్యాయమును మరియు ప్రభువునందు విశ్వాసమును ప్రతిబింబించును. దాని కలిగియున్నయెడల ఎవరును చూడని వేళలలో కూడ మనము దేవుని సంతోషపెట్టుదుము. అది ఆయనపై ఆధారపడును గనుక, రాబోవు కాలములో దేవునినుండి దానికి బహుమానముండును. అది దేవుని భయమును, దేవుని యెడల భయభక్తులను కనుపరచును. యధార్ధతను కలిగిన విశ్వాసి మనుషుల కొరకు బ్రతుకడు, జీవించడు గాని, దేవుని న్యాయవంతునిగా ఎరిగినవాడై ఆయన కొరకు జీవించును. ఏ పరిస్థితియైనను అతనిని యధార్ధతనుండి తప్పించలేదు. నీవు యధార్ధవంతుడవా? నీ యధార్ధత దేవుని ఎదుట యోగ్యమైనదా? అది పరలోక లక్షణములను ప్రతిబింబించునా? తాము యధార్ధవంతులమని అనేకులు చెప్పుదురు గాని, దానిని కనుపరచుటలో వారు విఫలమౌదురు. దానిని కలిగియుండకపోవుటవలన తరచుగా మనుషులు ఘనతను కోల్పోవుదురు. విపర్యయముగా, దానిని కలిగినవాడు నిందలేనివాడు. యాకోబు ఈలాగనెను. ఇకమీదట నాకు రావలసిన జీతమును గూర్చు నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయప్రవర్తనయే నాకు సాక్ష్యమగును; మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నియుగొఱ్ఱెపిల్లలలో నలుపు లేనివన్నియు నా యొద్దనున్నయెడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను (ఆది. 30:33).

మనుషుల ఎదుట మనలను మనము రుజువుపరచుకొనుటకు ప్రయాసపడుట కంటె దేవుని ఎదుట యధార్ధముగా ఉండుటకు ప్రయాసపడవలెను. వెనుకటి దానిని చేసినపుడు జీవితములో మరిఎక్కువ స్వేచ్ఛను పొందుదుము. అనేక పరలోక లక్షణములతోపాటు నీతి మనతో స్నేహము చేయును. మొదటి దాని చేయుట మనకు భారమును ఆందోళనను కలిగించును; దానినుండి కలవరము, భయము కలుగును. మన దృష్టి కూడ భూసంబంధమైన వాటిపై మరియు మనస్సు యొక్క ఆలోచనలపై ఉండును. దేవుని ఎదుట యధార్ధముగా ఉండుటవలన అన్ని విషయములను ఆయన తీర్పునకు విడిచిపెట్టగలము. అప్పుడు దేవుడు మన పక్షమున పనిచేయుట మొదలుపెట్టును. పరిశుద్ధ గ్రంధములోని అనేక తరములలో దేవుడు తాను ఎన్నుకొనినవారి పక్షముగా పనిచేయుటకు కారణము యధార్ధత. దేవుని సంతోషపెట్టు లక్షణములలో ఒకటైన యధార్ధత నిలిచియుండవలెను. మన ఇష్టములకై దానిని ఎప్పుడైనను విడిచిపెట్టు అవకాశమున్నది. దేవుడు దానిని మనపై బలవంతము చేయడు గాని, దాని కలిగియునపుడు తన మార్గములలోనికి ఆలోచనలలోనికి మనలను నడిపించును. దానికున్న ఒక్క గొప్పతనమేమనగా, అది దాని పేరును మనలో స్థాపించుకొనును; అది ఇతరమైన వనరులపై ఆధారపడదు. అది అందరికి కనబడునట్లుగా దేవుడు దానికి సారమును ఘనతను దయచేయును. యధార్ధత మనలో లక్షణమైనయెడల, అది వీటిని కలుగజేయును.

1. ధైర్యము. దావీదు – నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యముల కధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను (1 సమూ. 17:45). ప్రభువు నామమందు జీవితములోని ప్రతి విషయమును ఎదుర్కొనుటకు మనకు అంతరంగమందు బలముండును. బహు కష్టమైన పనులు మనకు సాధ్యమగును. కొన్నిటిని చేయుట ఇతరులకు కష్టముగా ఉండినపుడు సత్యము యొక్క సూత్రములను యధార్ధముగా అన్వయించుట ద్వారా వాటిని చేయుటకు ఉపాయములను గ్రహించెదము. యధార్ధతకై ధైర్యములేక తరచుగా మనుషులు మోసపూరితమైన మార్గములను ఎంచుకొందురు. కాని, యధార్ధత అట్టి మార్గములకు మనలను గ్రుడ్డివారిగా చేయును. కాబట్టి, జీవితములోని ప్రతి ఆటంకమును జయించెదము. మనము కలిగియుండు ధైర్యము యధార్ధతలో ఇమిడియుండు దేవుని అత్యున్నతమైన మార్గములవలనై యున్నది.

2. ఆనందము. ఎందుకనగా యెహోవా, నీ కార్యముచేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు (కీర్త. 92:4). దేవుని కార్యములు మనతో నిత్యముండును. మనలో ఎల్లప్పుడు సంతోషముండును. బలహీనమైన సమయములలో సహితము మన యధార్ధతకు ఆయన ఇచ్చిన ఉత్తరమును జ్ఞాపకము చేసికొనుట ద్వారా బలము పొందెదము. మరియు ఆయన మరల మన యొద్దకు తన కార్యములతో వచ్చును. ఆనందమనునది యధార్ధతను కోరు దేవునితో అన్యోన్యత యొక్క ఫలితము. దేవుని ఆశను సుస్థిరము చేయుటకు యధార్ధత మనస్సును నియంత్రించుకొనుమని వేడుకొనును. ఏ పరిస్థితికైనను దేవుని ఇష్టముండును. అది ఇద్దరు వ్యక్తుల మధ్య సామాన్య సంభాషణ కావచ్చును; దానియందు దేవుని ఇష్టముండును. యధార్ధత దాని స్థిరపరచును. ఇట్టి అలవాటు నిత్యము మనలో ఆనందము నిలుచునట్లుగా చేయును.

3. దేవునియెడల గౌరవము. తనను అవమానపరచకుండునట్లు దేవుడే మనకు నేర్పించును. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై” (మలా. 2:5). మనము నేర్చుకొనిన వాటినిబట్టి ఆయన ఉన్నతత్వమును గ్రహించుట విడిచిపెట్టము. ఆయన ఆజ్ఞలు, వాగ్దానములు మరియు మార్గములు బట్టల అంచుల కుచ్చుల మీద నీతి సూత్రములుగా మనకుండును. కావున, మన హృదయమును మరియు మన స్వంత మార్గములను వెంబడించు మనస్సును ఏర్పరచుకొనము. మనలను తనకు దగ్గరగా రప్పించుటకై దేవుడే మనతో నడుచును. భయమునందు లేనివారమై ఆనందించునట్లుగాను మనకు జీవమును విశ్రాంతి ఉండెనా? కచ్చితముగా ఉండును. అది యధార్ధతవలనై యున్నది; ఎందుకనగా దేవుడు మనయొద్దకు వచ్చును.

పై విషయములను చెప్పిన పిమ్మట యధార్ధత దాని ఫలమును మనలో కలిగించవలసినయెడల, అది పురోగతి చెందవలెను. ఈ సంగతులు దానికై మనకు బోధించును.

1. క్రీస్తుయెడల ఎడతెగని భక్తి. యేసును కాదను సమయము మన జీవితములో ఎన్నడును ఉండకూడదు. పరిస్థితులు ఆయన నడిపింపును లేక ఉపదేశమును వ్యతిరేకించునప్పటికీ, ఆయన ఎవరనిన జ్ఞానమును మనము విడిచిపెట్టరాదు. తరచుగా అనేకులు విశ్వాసమునకు మరియు ప్రభువుపై నమ్మిక యుంచుటకు అసహనమును కనుపరచుదురు. కొన్నిమార్లు మానవులుగా వారి ప్రయాసలన్నిటిలో విఫలమైన పిమ్మట ప్రభువు వారిని నడిపించునని, వారికి బయలుపరచి వారిని ఆశీర్వదించునని వారు మరిచెదరు. యధార్ధత ప్రభువు నడిపింపువలన పురోగతి చెందును. ఏలయనగా పరిస్థితులు ఏలాగు ఉన్నను, అది ఆయనను ఆలకించవలెనని నేర్పించును. సీమోను – ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను (లూకా. 5:5).

2. ప్రభువును మనుష్యునితో సమానముగా ఎంచకుండుట. యధార్ధతను అభివృద్ధి చేసికొనుటకు ఇది ఒక ప్రాముఖ్యమైన కారణము. సమస్తమును ఎరిగిన మహోన్నతుడైన దేవునిగా ప్రభువును అర్ధముచేసికొనుట ఆయన పట్ల భయమును మన హృదయములో కలిగించును. ఇది ఆయనయెడల భయభక్తులకు కారణమగును. మనుష్యుల ఎదుట మనలను నీతిమంతులుగా కనుపరచు యత్నము చేసినపుడు మనమాయనను మనుష్యునితో సమానముగా ఎంచుదుము. మన ఉద్దేశములు దాగియున్నవని తప్పుగా తలంచెదము. సాతాను మనలను జయించును మరియు పాపము యొక్క పరిణామములను పొందెదము. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను (అపొ. 5:1-2).

3. వెనుకకు తిరుగకుండుట. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు (1 కొరి. 7:18). శరీరము చాల బలహీనమైది గనుక దాని క్రియలకు లేక మోసపూరితమైన క్రియలవైపు మరల తిరిగి వెళ్లుట బహుగా సాధ్యము. రక్షణ కొరకును ప్రత్యేకమైన ఉద్దేశము కొరకును పిలువబడితిమని మనమెరిగినపుడు వేరే మార్గమును ఎంచుకొను ఆలోచనకు అవకాశమియ్యరాదు. ఆయన చిత్తమునకు విరుద్ధమైన ప్రతి ఆలోచన మనకైన ఆయన ఉద్దేశమువలన జయింపబడును. మనకైన ఆయన ఉద్దేశమందు నిలకడగా ఉన్నప్పుడు యధార్ధత వృద్ధి చెందును.

యధార్ధతకు ముడిపడియున్న దేదైనను మనలో ఉన్నయెడల, అనేక బహుమానములు దేవునిచేత మనకొరకు దయచేయబడును. ఆయన బహుమానములు సహితము మనమాయన పిల్లలమని చాటి చెప్పును మరియు చీకటిలో జీవించుచున్నవారికి మనలను వెలుగుగా చేయును.

Posted in Telugu Library.