నీవు నిజక్రైస్తవుడవైన యెడల నిన్నుగూర్చి దేవునికి కచ్చితమైన తలంపులుండును. నిజక్రైస్తవులు సాధారణముగా దేవునికి విధేయులగుటకు చూచెదరు. వారు క్రీస్తులో రక్షింపబడుటకున్న విలువను ఎరిగినప్పటినుండి, అది వారి స్వభావమాయెను. రక్షింపబడుట అనునది ఒక వ్యక్తిని నిజక్రైస్తవునిగా చేయదు. అయితే, ఒకడు నిజక్రైస్తవుడైన యెడల వాడు దేవుడు చెప్పిన ప్రతిదానిని ఆచరించుచు, ఆయన తననుండి కోరినదానిని వెంటాడును. వాడు ఆచరించుచుండగా, దేవునికి సువాసనగా నుండి విలువను కలుగజేయును.
నిజక్రైస్తవులుగా అగుట సులభము కాదు గాని, అది అసాధ్యము కూడ కాదు. ఒకడు చేయవలసినదెల్లా తాను అత్యంత విలువుగా ఎంచినవాటిని విడిచి దేవునికి అప్పగించుకొనుట. పొరబడకుడి. మనకు సంబంధించిన వాటన్నిటికి మరియు మన బ్రదుకులో ముఖ్యమైన వాటన్నిటికి దేవుడు విలువిచ్చును. అవి ఏమిటో కూడ మనకు తెలియజేసి, వాటిని నిర్లక్ష్యము చేయనీయడు. అయినను, మనము తరచుగా విలువిచ్చునవి ఆయన చిత్తము లేనివియును వ్యర్ధమైనవియునై యుండి నిజక్రైస్తవులుగా ఉండుటకు ఆటంకముగా నిలుచును. వాటిని తెలిసికొని, విడిచిపెట్టుట మనలను నిజక్రైస్తవులుగా చేయును. మరియు, అట్టి వాటిని గ్రహించుటకు ఆయన ఉద్దేశములను తెలిసికొనుట ఆవశ్యకము. వాక్యములోనుండి వాటిని గమనించెదము.
- కొరింధీ క్రైస్తవులకు వ్రాయుచు పౌలు ఈలాగు చెప్పెను. “ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి (వెంటాడుడి). ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి“ (1 కొరి. 14:1). ప్రేమించువానిగా నిరంతరముండుట ఎంత ముఖ్యము! మొదటిగా, దేవుని అంతరంగ లక్షణము, అనగా పక్షపాతములేని గుణము మనదగును. మనము అందరిని భేషరతుగా ప్రేమింతుము. అంటే శత్రువులను చేసికొనము లేక ఇతరులతో శత్రుత్వము కలిగియుండము; అసూయను కలిగియుండము. మన హృదయములు నిత్యము పవిత్రమైనవై దేవునికి యోగ్యమైన ఫలములను ఫలించును. ప్రేమను వెంటాడుట ప్రతివానిని దేవుని దృష్టితో చూచుటకు సహాయము చేయును. అది మనుష్యులు దేవుని సమీపులగుటకు మనలను వారికి దగ్గర చేయును. ఇట్టి పరిపూర్ణ లక్షణమును అది కలిగియుండెను గనుక, అది సంబంధములను కట్టుచు, వాటిని నిలబెట్టును. పౌలు చెప్పినట్లుగా, “వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి“ (కొలొ. 3:14). మరల, పౌలు ఆత్మవరములను ఆశించుట గూర్చి, మరిముఖ్యముగా ప్రవచనవరము గూర్చి మాటలాడెను. ఏ ఆత్మవరమైనను మనలను వృద్ధి చేయుచు, దేవునికి మహిమ తెచ్చునట్లు మనలను సన్నద్ధులుగా చేయును. వాటిని బహుగా ఆశించుమని చెప్పినపుడు, అవి మానవులకై దేవుని ప్రణాళికలో ముఖ్యమైన పాత్ర పోషించువై యున్నవి. ఒక్కసారి దేవునికి చెందినవాటిని బాగుగా ఆశించుట మొదలుపెట్టినపుడు, నిజక్రైస్తవులనుండి మనలను దూరముగా ఉంచువాటిని త్వరగాను సులువుగాను గ్రహించెదము. మరియు, దేవుడు మననోట ఉంచినదానిని ప్రవచించునపుడు, వ్యర్ధమైన వాటిని విడిచిపెట్టితిమని సూచించును.
- హెబ్రీ గ్రంధకర్త తన చదువరులను హెచ్చరించుచు ఈలాగు చెప్పెను. “కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను“ (2:1). నిజక్రైస్తవునిగా ఉండలేకపోవుటకు ప్రాధమిక కారణము దేవుని గూర్చి, క్రీస్తును గూర్చి మరియు మనయెడల వారి కోరికను గూర్చి వినినవాటినుండి తప్పిపోవుటయే. క్రీస్తు బోధలను వినిన కొలది వాటికై మన హృదయములలో స్థానమును కల్పించవలెను. దానిని ఎక్కువగా చేయుకొలది ఆత్మ కూడ ఎక్కువగా ఆలాగు చేయుటకు మనకు సహాయము చేయును. “మరి విశేష జాగ్రత్త” అను మాటలు లోతైన అర్ధము కలిగియున్నవి. అదేమనగా, మనము వినినవాటి పట్ల ఇదివరకు కలిగియున్న శ్రద్ధ కంటె బహు శ్రద్ధ చూపించవలసినవారమై యున్నాము. ఇక్కడున్న ఆలోచన మనము నష్టపోవుచున్న దేవునివి నష్టపోకూడదు. దేవుడు మనకు తెలియజేయువాటిని, లోతైన విషయములను సహితము పూర్ణముగా అర్ధము చేసికొనవలెనని ఆశించును. ఆలాగు చేయుటలో విఫలమైనపుడు, మనలను నిష్ఫలమైన క్రైస్తవులుగా చేయు పనికిరానివాటిని విడిచిపెట్టుటలో విఫలమౌదుము.
- నిజక్రైస్తవులు యొక్క స్వభావమును ఈ వాక్యములో పౌలు పలికెను. “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము“ (2 కొరి. 5:6) వెలి చూపుతో నడుచుచున్నవారమైతే, దేవునికి విలువలేనివాటిని నిస్సందేహముగా విలువిచ్చుచున్నాము. విశ్వాసమునుబట్టి జీవించుటనగా దేవుడు మనకు నిర్ణయించిన వాటినిబట్టి జీవించుట. దేవుడు వాటిని మనకు బయలుపరచును. వాటి నెరవేర్పును మనము ఇంకను చూడకపోవచ్చును. కాని, రాబోవు దినములలో చూచెదము. ఆ సమయమువరకు అవి జరుగుననిన నమ్మకముతో ఉందుము. అట్టి విశ్వాసమును కలిగియునపుడు వ్యర్ధమైన వాటికి విలువియ్యకుందుము. మరియు తప్పిపోవునట్లు లోకము గాని, సాతాను గాని, మనలను మోసము చేయుటకు ప్రయత్నించినను, లొంగకుందుము. విశ్వాసమునుబట్టి నడుచుటకు ప్రోత్సాహముగా దేవుడు మనకొరకు నిర్ణయించి, నెరవేర్చినవాటిని జ్ఞాపకము చేసికొందుము. ఇది ఆయన చేసినవాటినిబట్టి సంతోషించుటకు సహాయపడును గనుక, ఆయన నిశ్చయముగా దయచేయునని ధైర్యము గలవారమై యుందుము. జీవితమునకు సంబంధించిన ప్రతి విషయములోను నిజక్రైస్తవుడు విశ్వాసమునుబట్టి జీవించవలెను. ఏలయనగా దేవుడు అతనియెడల, అతని కొరకు మరియు అతని ద్వారాను కలిగియున్న ఆలోచనలు శరీరమువలనైనవి కావు.
- తన దృష్టితో చూడవలెనని దేవుడు మనలను కోరుచున్నాడు. తుట్టతుదకు మనలను తనయొద్దకు పిలుచుటకు ఇదే కారణము. తన దృష్టితో అపొస్తలుడైన పేతురు చూడవలసివచ్చినపుడు, ఆయన ఈలాగు చెప్పెను. “రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి – దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను“ (అపొ. 11:9). ఆయన మనకిచ్చిన ఉద్దేశముకున్న తన ఆలోచనను అర్ధము చేసికొని తనను సేవించుమని దేవుడు మనలో ప్రతివారిని పిలిచెను. ఆయన ఒక పరిచర్యను మనకిచ్చినయెడల, దానిని నెరవేర్చుటకు మనకు ప్రాధాన్యతలు ఉండరాదు. యూదునిగా దేవుని చిత్తమును నెరవేర్చుటకు పేతురుకు అభయము అవసరమాయెను. ఆలాగుననే, మనకు కూడ ఆయననుండి అభయములు అవసరము. ఆయన వాటిని దయచేసినపుడు పూర్ణహృదయముతో వాటిని స్వీకరించవలెను. అప్పుడు సమస్త ఆటంకములు ఆయన తీసివేసి, మనము విలువిచ్చు సమస్త వ్యర్ధమైనవాటిని విడిచిపెట్టుటకు బలవంతులుగా చేయును. ఆయనను సేవించుటకు మన హృదయములు బహు విశాలమగును.
- ఎల్లప్పుడు క్షమించు హృదయమును కలిగియుండుటకై పిలువబడితిమి. ప్రేమను వెంటాడుట దీనిని సంపూర్ణము చేయును. అప్పుడు, యేసు మననుండి కోరువాటిని చేసెదము. “అతడు ఒక దినమున ఏడుమారులు నీయెడల తప్పిదము చేసి యేడు మారులు నీ వైపుతిరిగి – మరుమనస్సు పొందితిననిన యెడల అతని క్షమింపవలెననెను“ (లూకా. 17:4). మననుండి క్షమాపణను కోరువారిని క్షమించినపుడు పూర్ణ హృదయమును సంపాదింతుము. ఏదియు మనకు అసాధ్యముగా నుండదు. ఒక వ్యక్తికి బహు కష్టమైనదేమనగా, యధార్ధముగా తన పొరుగువాని క్షమించుట. కాని, క్రీస్తువలె ఉండుటనగా బహు కష్టమైనదానిని జయించుట. లాభమేమనగా, ఇదివరకటి కంటె దేవుడు మనలను అధికముగా ప్రేమించును. ఇట్టి స్వభావమును కలిగియుంటిమి గనుక, ఆయన మనయందు ఉత్సహించును మరియు జీవితములో ఏదియు మనకు కష్టముగా నుండదు.
అయితే,నిజక్రైస్తవులుగా ఉండుటకు మన హృదయములను సిద్ధపరచుకొననియెడల లేక మనకు బహు విలువైనవిగా ఉన్నవాటిని విడిచిపెట్టనియెడల, మనపై చెప్పనశక్యమైన ఘనతను కుమ్మరించు దేవుని స్థిరమైన సన్నిధిని నిరాకరించితిమి. మరియు, యేసు ఈలాగనెను – “అప్పుడతడు – పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు“ (మత్త. 22:8).