సాఫల్యము (సఫలత) అనునది ఒక్కసారి సంభవించునది కారాదు. ఒక్క విషయములో సాఫల్యమొందుట జీవితములో సఫలత పొందుట కాదు. నిజమైన సాఫల్యము జీవితాంతము ఉండునదై, ఒకని జీవితములోని అన్ని విషయములలో కనబడును. సాధారణముగా జనులు సాఫల్యమును స్పర్శనీయమైన వాటితో నిర్వచించి, వాటినిబట్టి దాని గ్రహింతురు. అవి కొంత సాఫల్యమును సూచించినను, అది మొత్తముగా సాఫల్యము కాదు. సాఫల్యమును సూచించుటకు జనులు పరిగణించు ఒక స్పర్శనీయమైన పదార్ధము ధనము. కాబట్టి, వారెవరైనప్పటికీ దానిని వెంటాడుదురు. లోకములో కలుగు వాటినిబట్టి మనుషులు సఫలత చెందుదురు గాని, వారి సాఫల్యము కొన్నివాటికే పరిమితమై యుండును గనుక, వారు అన్నిటిని జయించలేరు. ఈ లోకమునుబట్టి కలుగు సఫలత నిజమైన సాఫల్యము కానేరదు. ఏలయనగా లోకము యొక్క మార్గములు, పరిమాణములు శరీరసంబంధమైనవి మనమెరుగుదుము. నిజమైన సాఫల్యము భారమును సూచించని విడుదలను సంతోషమును దయచేయును. ఏదో సాధించవలెనని ఒకడు తనను బలవంతము చేసికొననపుడు అది సాధింపబడును. అంటే, మహోన్నతుడైన దేవుడు వారితో ఉన్నప్పుడు అది సాధింపబడును. ఆదికాండము 39:2 ఈలాగు చెప్పుచుండెను. “యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను.”
నిజమైన సాఫల్యము ఒకడు తనను దేవునికి పూర్ణముగా అప్పగించుకొనినపుడు కలుగును. క్రైస్తవులుగా మనము మరచిపోరాని సత్యమేమనగా, ప్రతివాని యెడల దేవునికి ఒక ఆలోచన, ఉద్దేశము కలదు. ఇది ఈలాగుండగా, ఆయనకు అప్పగించుకొనువాడు సఫలతను వెంటాడవలసిన అవసరములేదు. ప్రభువు తన ఆలోచనను, ఉద్దేశమును అతని ముందర బయలుపరచును, మరియు వాడు సఫలమొందును. యోసేపు కొరకు దేవుడు ఒక ఆలోచనను, ఉద్దేశమును కలిగియుండెను. యోసేపు విధేయతను యధార్ధతను కలిగిన జీవితమును జీవించెను గనుక, రాబోవు దినములలో ఆయన వాటిని అతనికి బయలుపరచెను. అతడు తన సహోదరుల కంటె నీతిగలవాడు. ఏలాగనగా, వారి చెడు క్రియలను తన తండ్రికి తెలియజేయుట ద్వారా వాటిని అసహ్యించుకొనెను. మరియు ఐగుప్తులో తన సహోదరులతో మరల కలసినపుడు, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెనని వారితో చెప్పెను. అతడు తన జీవితములో ప్రతి విషయమందు సఫలమును పొందెను. అది తన తండ్రి యింటిలోనైనను, పోతీఫరు ఇంటిలోనైనను, చెరసాలలో అధికారిగానైనను లేక ఐగుప్తు అంతటిలో ఫరో తరువాత ఫరో అంతటివాడిగానైనను, దేవునియెడల విధేయత కనుపరచి, సఫలుడయ్యెను. ఐశ్వర్యము అతనికి తోడగుటయే గాక, తిరుగులేని ఘనతయు, దేవుని ఆత్మ గలవానిగా ప్రసిద్ధియు అతని హత్తుకొనెను. దేవుడు అతని ప్రతి అడుగులో తోడైయుండెను, అది లోయలోనైనను, పర్వతముపైయైనను, ఆయన అతనితో నుండెను. కాబట్టి, సాఫల్యము యోసేపును వెంబడించెను.
దేవుని పిల్లలు లోకమువలె ఉండరాదు. లోకము సఫలతను బిగ్గరగా కోరును గనుక, దాని కొరకు మార్గములను ఏర్పరచుకొందురు. వారు వాటి నీతిని, వాటిలో నున్న జ్ఞానమును మరియు అవి కలుగజేయు పరిణామములను ఆలోచన చేయరు. దేవుని పిల్లలు దేవునికి అప్పగించుకొని ఆయన వారికి సఫలము దయచేయునని నమ్మవలెను. అయితే, అనివార్యముగా ఇందుకు కనిపెట్టవలెను గాని, ఆయన ఇచ్చు సఫలత జీవితములోని అన్ని విషయములకు వర్తించును. విధేయతగల క్రైస్తవుడు దేవుడు తనకు అప్పగించిన వాటన్నిటియందు సాఫల్యము పొందును. ఒకరు బిడ్డగాను, తల్లి లేక తండ్రిగాను, సోదరి లేక సోదరునిగాను, భార్య లేక భర్త గాను, బంధువు గాను, పనివానిగాను మరియు వారిని దేవుడు నడిపించు ఏ పనియందైనను వారు సఫలమగుదురు. మరియు వైఫల్యమును ఎవరైనను వారికి అనువర్తించిన యెడల, అది అనువర్తించినవాని వివేకములో లోపమువలననే.
అందరము సఫలము కావలెనని ఆశింతుము. ఇందువలన, మనమందరము దేవునికి విధేయత కనుపరచవలెను. అప్పుడు, దేవుడు మనకు అనుగ్రహించు సాఫల్యము జీవితాంతము నిలుచునదై యుండును. మనుషుడైనను, ఏ శక్తియైనను దానిని నాశనము చేయలేదు; మనపై చేయబడిన తప్పుడు ప్రచారము దానిని శూన్యము చేయలేదు. దేవుడు దయచేయు సఫలతకు ఎల్లప్పుడు మంచి పరిణామములు ఉండును మరియు అవి అర్ధముచేసికొనుటకు గాను మర్మములను కలిగియుండును. వాటిని అర్ధముచేసికొనుట ద్వారా సఫలతయందు కొనసాగుదము.
- అవిధేయత మనలను జయింపనియ్యరాదు. అప్పుడు, మన ప్రయాసలలో ఓటమిని చూడకుందుము; ఏలయనగా అవి దేవుని పరిమాణములను బట్టి ఉండును. మన సాఫల్యమును నాశనము చేయునట్లు ఉద్దేశపూర్వకముగా అవిధేయతకు శక్తి నియ్యకుండుటలోనుండి మన విధేయత పుట్టును. ఈలాగున యోసేపు పోతీఫరు ఇంటిలోను ఐగుప్తులో అధికారిగాను చేసెను. అదే విధముగా రాజుగా సౌలు చేయకపోయెను. “సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి“ (1 సమూ. 31:2). సౌలు దేవునికి విరోధముగా పాపము చేసెను; అలాగు చేసియుండనియెడల, చివరివరకు అతడు సాఫల్యముతో నుండియుండును. తన ఇల్లు కూడ తరతరములకు నిలిచియుండును. దేవుడు ఇచ్చిన సఫలతను పోగొట్టుకొనుటవలన కలుగు అవమానము ఎక్కువైనది.
- దేవుని స్తుతించుట. సాఫల్యమును వెంటాడుట కంటె దేవుని స్తుతించి, ఆయనను భక్తితో ఆరాధించుటను ఎంచుకొనవలెను. సాఫల్యమును వెంటాడుట దేవునికి విధేయత చూపుటనుండి మన దృష్టిని తొలగించును. కాని, మనమున్న స్థితికి మనలను చేర్చుటకు ఆయన చేసినవాటిని జ్ఞాపకము చేసికొనుట ద్వారా మనలో అవిధేయతకున్న ఎటువంటి సూచననైనను తీసివేయుదుము. తమ చేతులెత్తి ఆయనను ఆరాధించిన జనులుగా మనముండవలెను. “ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి – ఆమెన్ ఆమెన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి“ (నెహె. 8:6).
- పాపుల మార్గముకు భయపడుట. దేవునికి విధేయులగుటవలన కలుగు పరిణామములను చూచినవారమై, మన స్వంత మార్గములను ఎంచుటకు ఉండు ఫలితమును గ్రహించెదము. అట్టి గ్రహింపునందు మన ప్రవర్తన ఉండవలెను. దేవుడు దయచేయు సాఫల్యము పాపుల మార్గము పట్ల మనకున్న భయమునుబట్టి కలిగి, దానివలన మనతో నిలిచిపోవును. వారి మార్గమును గూర్చి మన మనస్సులో నుండు భావము నిజమైనది. ఏలయనగా యూదా పాపుల మార్గమును ఎంచుకొనినపుడు దేవుడు ఈలాగు చేసెను. “అప్పుడు యూదానుండి ఆయన ముసుకు (కావలి) తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్యగృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి“ (యెష. 22:8).
- దేవునికి అప్రియులు కారాదు. ఆయన స్వరమును వినువారము గాను లేక ఆయన బోధను అంగీకరించువారము గాను మనముండవలెను. మన సమస్త నమ్మిక ఆయనపై ఉంచవలెను. ఎందుకనగా, దాని ఫలితము మనకు ఎరుకే. మన గురి ఒక్కటే, అది ఆయనకు దగ్గరగుట. అప్పుడు, ఆయన ఉపదేశమును నిరాకరించునట్లు నడిపించు దుష్టత్వము మనలో కొలువుండదు. యెరూషలేము ఆయనకు అప్రియమై నందున ఆయన ఈలాగు పలుకునట్లు ప్రేరేపించెను. “ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ” (జెఫ. 3:1). విపర్యయముగా, ఆయనకు దగ్గరగా చేరుట మరింత సాఫల్యమును జీవితములో తెచ్చిపెట్టును. ప్రస్తుతము మనకున్న సమాధానకరమైన వాతావరణము విస్తరించుటకు ఆయన ద్వారములను తెరచును.
- క్రీస్తు సూత్రములను గైకొనుట. పై చెప్పబడిన నాలుగు అంశములుకు ఇది పునాది. “అందుకాయన – ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను“ (లూకా. 20:25). దేశ నియమములను యధార్ధముగా గైకొనుటయే గాక, సత్యమును, కనికరమును, దయను, సమాధానమును, ఇచ్చుటను మరియు మననుండి ఆయన ఆశించు సమస్త పరలోక లక్షణములను కనుపరచు సూత్రములను గైకొనవలెను. దేవుని ఎదుటను మనుష్యుల ఎదుటను యధార్ధతను సంపాదించుకొనవలెను. విధేయత మనలో శాశ్వతమైన గుణము కావలెను.
- ప్రభువు ఇష్టమును వెంటాడుట. అన్ని విషయములకై ఆయన చిత్తము ఉండునట్లు చూచుకొనవలెను. ఆయన మనలను సఫలము చేయు విధానము సమస్తమును ఆయన దృష్టితో గ్రహించునట్లు మనకు బోధించవలెను. కావున, పౌలు ఈలాగు అనెను. “దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసరమే లక్ష్యపెట్టుచున్నాడు; తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసరమే తినుచున్నాడు; తినినవాడు ప్రభువు కోసరము తినుట మాని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు“ (రోమా. 14:6).