ధర్మశాస్త్ర పరిచర్య మనుష్యని మనస్సాక్షికి కొంత మార్పు కలుగజేసెను గాని, సంపూర్ణ మార్పు కలుగజేయకుండెను. అది దేవుని చిత్తమునుబట్టి ఆత్మచేత కలిగెననుది తప్ప దానియందు జీవము లేకపోయెను. జీవమును దయచేసినవాడు దానిని తన రక్తముచేత ప్రభావితము చేయలేదు గనుక దానియందు జీవము లేకుండెను. ధర్మశాస్త్రమందు పరిశుద్ధాత్ముడు పనిచేయలేదు, ఎందుకనగా ధర్మశాస్త్రము శరీరమందు మనుష్యులచేత అక్షరానుసారముగా జరిగింపబడుటకు ఇయ్యబడెను. కావున, దానికి మహిమ ఉన్ననూ దాని తరువాత వచ్చిన పరిచర్య కంటే అది మహిమకరమైనది కాకపోయెను. కాబట్టి, ఆత్మయందు పౌలు ఇట్లు చెప్పెను. “ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై యుండును?” (2 కొరి. 3:8). ధర్మశాస్త్ర పరిచర్యలో కూడా రక్తముండెను గాని అది దేవునిది కాదు. అది ఒక్కటిగా మాత్రమే ఉన్నప్పుడు దానికి సాటి ఏదియును లేదు. అయినను, రాబోవు సమయముకొరకు నిరీక్షించుట ద్వారాను, దానంతట అదే ప్రస్తావించినవాని కొరకు ఎదురుచూచుట ద్వారాను దానికి పరిపూర్ణత అవసరమని నిత్యము కనుపరచుచుండెను. కాబట్టి, యేసు దయచేసి జీవముపై కట్టబడిన ఆత్మసంబంధమైన పరిచర్యను గూర్చి ఏమి నేర్చుకొందుము?
- ఆత్మసంబంధమైన పరిచర్యయే నూతన నిబంధన పరిచర్య
- అది పరిమితి జ్ఞానముగల పరిచర్య కాదు లేక పరిమిత జ్ఞానము చేతనిర్మింపబడినది కాదు. ఉదాహరణకు, ధర్మశాస్త్రము వంటిది కాదు.
- అది దేవుని మనస్సుకును ప్రభావముకును సంబంధించినధై ఆత్మచేత జరిగింపబడుచున్న పరిచర్య.
- అది ఎన్నటికిని విఫలము కాదు. ఎందుకనగా, అది ఎటువంటి పరిస్థితి కన్నా, సమయము కన్నా, భూసంబంధమైన జ్ఞానము కన్నా మిన్నయైనదని ఎప్పటికప్పుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనును.
- దాని మహిమ భూసంబంధమైనది కాదు; అంతేగాక, భూసంబంధమైనవాటివలన అది మహిమను కోరదు.
- సృష్టిపబడినవాటి ప్రకాశము కంటెను, మానవుల బలముచేత సృష్టింపబడుచున్నవాటిప్రకాశము కంటెను అధికమైన ప్రకాశముగల దేవుని మహిమకు అది చెందినది.
- నూతన నిబంధన పరిచర్యలో నడిపించువాడు ఆత్మయేగాని లిఖింపబడిన వాక్యములోని అక్షరములు కాదు.
- కాబట్టి, నూతన నిబంధనను అర్ధముచేసికొని ప్రకటించుటకు భూసంబంధమైన సామర్ధ్యములపై ఒకడు ఆధారపడరాదు, అతిశయపడరాదు.
- క్రొత్త నిబంధన గ్రంధములోని వ్రాయబడిన వాక్యమునుప్రకటించువానికి ఆత్మతో సమానమైన మనస్సు ఉన్నప్పుడే అది జీవమునిచ్చును. అంటే, వట్టి వాక్యమును పలుకుట ఆత్మ దయచేయు క్రీస్తు జీవమును కలిగియుండదు.
- ఆత్మసంబంధమైన పరిచర్య భూసంబంధమైన సామర్ధ్యములపై ఆధారపడదు గనుక దేవునివలన జన్మించిన వాడెవడైనను నూతన నిబంధనను ప్రకటించుటకు సరిపోవును.