ప్రభువు వాగ్దానములు

ప్రభువు వాగ్దానములు నిర్దిష్టమైనవి. ఒక విషయమును గూర్చి తన మాటను మనకిచ్చినపుడు తన ఆత్మ ద్వారా మనలో పెట్టిన అర్ధము తప్ప దానికి వేరే అర్ధముండదు. మన మనస్సు యొక్క ఆలోచన విధానమువలన అనేక పరిణామములను దానిబట్టి ఊహింతుము; దానికొరకు వేచియుండుట ద్వారా దానియందు విశ్వాసమును కూడ తగ్గించుట మొదలుపెట్టుదుము. కాని, మనయెడల దాని గమనమును అది విడువదు. నీతివలన మనలను యోగ్యులుగా ఎంచెను గనుక, ఆయన దానిని మనకిచ్చెను. అయితే, ఆయన వాగ్దానములు పొందిన తరువాత కూడ వాటిని జరిగించు ఆయన సామర్ధ్యమును గూర్చి మాటలాడుట అనవసరము. కాని, వాటిని గట్టిగా పట్టుకొనుటలో నున్న ప్రాముఖ్యతను గూర్చి మాటలాడుట అగత్యము. దేవుని వాగ్దానములు మన సంతోషము కొరకును తనకు మహిమ నిచ్చు ఆయన ఉద్దేశము కొరకునై ఉండును. తన రెక్కల క్రింద మనలను నడిపించుటకు ఆయన వాటిని దయచేయును. ఆయన వాగ్దానములు నిర్దిష్టమైనవై యుండుటకు కారణము ఆయన ఏమి చేయదలచెనో ముందుగానే ఎరిగియుండెను. ఒక్కసారి వాటిని ఇచ్చిన తరువాత ఏదేమైనను అవి జరుగును; వాటిని గూర్చి ఆయన తన మనస్సును మార్చుకొనడు. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చిఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను” (ఆది. 15:4). 

అవసరమైతే ప్రభువు తన వాగ్దానములను మనకు నిర్ధారణ చేయును. వాటి నెరవేర్పుకై మన నిరీక్షణ మన అంతరంగమును బలహీనపరచినపుడు లేక వాటికి వేరుగా ఆలోచన చేయునట్లు పరిస్థితులు మనలను బలవంతము చేసినపుడు, ఆయన మరల తన వాక్యము నిచ్చి మనలను బలపరచును. ఆయనవలన బలమొందవలెనని మనము కూడ మనసు కలిగియుండవలెను. శరీరము ఆయన మాటను విడిచిపెట్టుమని చెప్పును. అట్టి సమయములలో ఆయనను ఆశ్రయించవలెను. అంతరంగమందు బలహీనమైనపుడు ఆయననుండి బలమును పొందు నిమిత్తము ఆయనను మొదటిసారి నమ్ముటకు మనలను నడిపించిన పరిస్థితులను చేతపట్టుకొనవలెను. అబ్రాహాము ఆలాగు చేసెను. తనను గొప్ప జనాంగముగా చేయుదునని ప్రభువు ఇదివరకు అతనికి వాగ్దానము చేసినప్పటికీ, దాని విషయమై అతడు మరల అభయము పొందెను. పరిణామముగా అతడు విశ్వాసమందు నిలిచెను. దేవుని వాగ్దానములు నిజమైనవియు నిర్దిష్టమైనవనియు అతడు యెంచగలిగెను. ప్రభువు చెప్పినట్టుగా అతడు కుమారుని పొందెను. దేవుని వాగ్దానములను గూర్చి ఎవరు ఏమి చెప్పినను, అవి మనకొరకు ఉన్నవి మరియు వాటిని మనము పొందినయెడల అవి నెరవేరును. కాబట్టి, ఆయన వాగ్దానము చేసినవాటిని, ఇంకను వాటికై మరల అభయమిచ్చి నందున, వాటిని గట్టిగా పట్టుకొనుటకు కొన్నిటిని ఆలోచన చేయుదము.

1. నీతిని అభ్యాసము చేయుట. దానికొరకు ఆసక్తి కలిగియున్న కొలది విశ్వాసమందు మరిఎక్కువ నిలకడగా ఉందుము మరియు ఆయన మాటను నమ్మునట్లుగా ఆయన శక్తి మనలో నిలిచియుండును. ఒకవేళ అంతరంగమందు బలహీనులమైతే, దేవుని వాగ్దానముల నుండి తొలగిపోనివారమై ఆయననుండి వాటికొరకు అభయము పొందునట్లు నీతి యొక్క ప్రభావము విశ్వాసము కొరకు మనలను బలవంతము చేయును. ఇది నీతి – ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను” (2 రాజు. 15:34).

2. లోకమును ఏలవలెను. దేవునిపై ఆధారపడుటవలన లోకముకు చెందిన వివరములను గ్రహించెదము. బోధకుడు ఈలాగు చెప్పుచుండెను. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు (ప్రసంగి 1:9). తన యందున్న వాటితోను, నియమములతోను, క్రియలతోను లోకము మనలను కదల్చనియెడల, సమయముతో నిమిత్తము లేకుండ దేవుని వాగ్దానముల నెరవేర్పుకు ఎదురుచూచెదము. మన జీవితములో క్రొత్తగా ఉండునవి దేవుడు తన మాటవలన కలుగజేసినవేఅగును. నీతిని అమితముగా అభ్యాసము చేయుటచేత ఆయనపై ఆధారపడు ఆశను పెంపొందించుకొందుము.

3. ప్రభువు ఆత్మకు అసహనము కలిగించరాదు. అంటే, ఆయనను పరీక్షించరాదు. దేవుని వాగ్దానములు సత్యమైనవి మరియు మనలో ఆయన పెట్టు అర్ధము కూడ సత్యమే. అభయము పొందిన తరువాత ఆయన ఇచ్చిన అర్ధమును నిరాకరించినపుడు అనీతిని జరిగించు ప్రమాదములో పడుదుము. మరల, బలముకై దేవుని ఆశ్రయించుటకును, దురుద్దేశములతో ఆయనను వెదకుటకును మధ్య భేదమును మనము కలిగియుండవలెను. వెనుకటిది ఆయన మాట నెరవేర్పును తొందరపెట్టవలెననిన ఉద్దేశముతో చేయుట జరుగును, అనగా ఆయన మాట యొక్క నెరవేర్పును పొందితిమని చెప్పుటకు స్వంత మార్గములను ఏర్పరచుకొనుట. ఇట్టివాటిని చేయుట మనపై అధికారము చేయుటకు సాతానునికి అవకాశమిచ్చును. అప్పుడు, మనము పాపములోను, దేవుని చిత్తముకు విరోధముగాను నడుచుట ప్రారంభించెదము. వాగ్దానములను కోల్పోవుముగాని, మన అనీతివలన పరిణామములు పొందుదుము గనుక, గొప్ప సమయమును వృధా చేయుదుము. ప్రభువు చెప్పుచున్నది ఆలకించుము – యాకోబు సంతతివారని పేరు పెట్టబడినవారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయెనా? యీ క్రియలు ఆయనచేత జరిగెనా? యధార్ధముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమసాధనములు కావా? (మీకా 2:7).

4. మనకైన ఆయన ఉద్దేశమును కొనసాగించుటఎట్టి పరిస్థితిలోను ఆయన ఉద్దేశమునుండి తొలగిపోరాదు. విశ్వాసులుగాను, సువార్తికులుగాను, బోధకులు గాను లేక తల్లిదండ్రులు గాను ఈ లోకములో బ్రదుకుటకు అది మనకు జీవనాధారము. దానిని చేయుచున్ననంతకాలము నీతిని జరిగించుటకు, లోకమును ఏలుటకు మరియు ఆత్మతో ఏకీభవించుటకు కారణము ఉండును. అప్పుడు, అపవిత్రములను ప్రభువు మార్గముపై నిలుపము గనుక, ఆయన మార్గమును క్రమముగా కొనసాగించెదము. మరియు, ఆయన ఉద్దేశమును గైకొనుటవలన మనము కలిగియున్న అపవిత్రములను తీసివేయుదుము. ఈ మాటలు మనలో నిత్యము ప్రతిధ్వనించవలెను – అందుకతడు – ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను (యోహా. 1:23).

5. దేవుడు ఫలితము లిచ్చును. నానావిధములైన కార్యములు గలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే” (1 కొరి. 12:6). దేవుడు ఒక్కడే గాని, తన కొలతనుబట్టి ప్రతివానికి ఆయన వాగ్దానము నిచ్చును; ఏలయనగా ఆయన యొద్ద అనేక వాగ్దానములున్నవి. కనుకనే పౌలు కూడ ఒకచోట ఆత్మయందు దేవునియందు వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవని అనెను. మనలో ప్రతివారిని దేవుడు ఒక ప్రత్యేక కారణముకై ఎన్నుకొనెను. దానిని మనకు చేసిన వాగ్దానములకు ఫలితము లిచ్చుట ద్వారా మనలోనుండి బయలుపెట్టును. నానావిధములైన వాగ్దానములను ఆయన చేయ సమర్ధుడు గనుక, తన ఆత్మ ద్వారా నానావిధములైన ఫలితములను కలిగించును. కావున, మనలో ప్రతివానియెడల ఆయన వాగ్దానములలో భేదము ఉండగా, అవన్నియు అందరి ప్రయోజనము కొరకు పనిచేయును.

6. చివరిగా, మన ప్రధాన బాధ్యతను ఎరిగియుండుట. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము(తీతు. 2:1). నాలుక యొక్క శక్తి నిస్సందేహముగా మనకు తెలియును. గొప్ప అడవిని అది తగులబెట్టునని యాకోబు చెప్పెను. అది సహవాసమును, బంధములను, తుదకు దేవునితో అన్యోన్యతను పాడుచేయగలదు. మన నాలుకను నియంత్రించుకొనినయెడల, దేవుని ఘనపర్చు నిమిత్తము వాస్తవముగా మనము అనేక ఆలోచనలను నియంత్రించుచున్నాము. కాపరులమైనను, సామాన్య విశ్వాసులమైనను మనము పలుకు సమస్తము హితబోధకు అనుకూలముగా ఉండవలెను. హితబోధకు అనుకూలమైనవాటిని పలుకుచు కూడ పొంగిపొర్లుచున్న జీవితమును కలిగియుందుము. ఏలయనగా ఇప్పుడైనను మరియు రాబోవు దినములలోనైనను దేవుడు వాగ్దానములు చేయుచు వాటిని నెరవేర్చుట మానడు.

By: Nathan Kedarisetti

Posted in Telugu Library.