లేఖనములు పరిశోధించుము

దేవుడు తనకొరకు సంపాదించుకొనిన జనులు చేయు కార్యము ఒకటున్నది. దానిని ఆయన ఆశించును. దేవుని ఆశను ఎరుగుటకు అది వారి అవసరము, స్వభావము, మార్గము. వాస్తవముగా, వారు ఆ కార్యమును చేయునట్లు దేవుడే వారిని నడిపించును. ఈ కార్యము ద్వారా ఆయన తన నామమును ఘనపరచుకొనును. ఆయన తలంచినచో వారినుండి దానిని కోరకుండును. కాని, వారు ఘనతను మరియు తన రాజ్యము మహిమ పొందుటకై దాని నెరవేర్చునట్లు వారిని ఎన్నుకొనెను. అది లేకుండ లేక దానిని జరిగించువారు లేకుండ ఆయన రాజ్యమును కట్టడు. ఒకవేళ దానిని జరిగించుటకు ఎవరును లేనియెడల జరిగించువారిని ఆయన పుట్టించును. దానికొరకు వారిని కడిగి, పవిత్రపరచును; ఆయన రాజ్యము విస్తరించును. ఈ కార్యమును ఆయన ఎంతో కాలముగా చేయుచున్నాడు; ఎన్నడును దానిని విరమించలేదు. శరీరమందున్న మనుష్యుల గ్రహింపును మించి ఆయన ఉద్దేశముండెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను(యెహె. 36:37).

దేవునిచేత విశ్వాసము కొరకు పిలువబడి, కృపవలన రక్షింపబడినవారు తమవంటి వారిని అధికము చేయుమని దేవుని ప్రార్ధింతురు (విచారణ చేయుదురు). దేవుడు మనలను పిలిచినపుడు ప్రార్ధించు జనులుగా చేయుట ఆయన ఉద్దేశమాయెను; ఇది ఆయన రాజ్యమును విస్తరింపజేయును. లేక సాధారణముగా చెప్పినచో, గొర్రెలు విస్తరించునట్లుగా మనలను విస్తరింపజేయుమని తనకు మొర్రపెట్టుటకు నడిపింపబడుదుమని ఎరిగి ఆయన మనలను పిలిచెను. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుచునో మరియు మానవులను తనయొద్దకు పిలుచుటలో ఆయన ఉద్దేశమేమయ్యెనో స్పష్టమాయెను. అందరు క్రైస్తవులు కారుగాని, ఆయన పిలిచినవారే క్రైస్తవులు. ఆయన విస్తారమైన మహిమ కొరకు మరియు ఆయన ఉద్దేశము యొక్క నెరవేర్పు కొరకు స్త్రీ, పురుషులు ప్రార్ధించని క్రైస్తవులుగా ఉండినయెడల వారు క్రైస్తవులు కారు; వారెన్నడును కృపను పొందలేదు. (ఏలయనగా ఒకడు దేవుని గాఢముగా ఇష్టపడుట కృప యొక్క పరిణామమై యుండెను). ఇందువలన, అనీతిలో నున్న సంఘములు అనేకముగా నున్నవవి చెప్పుచున్నాను. క్రైస్తవులుగా ఉండుటలో లేక క్రీస్తును పోలి ఉండుటలో నున్న నిజమైన సారము వారికి తెలియదు. వారు వాక్యమును చదువుదురు గాని, దాని ప్రకారముగా చేయుటను కనుగొనరు. అట్లు కనుగొను శక్తి వారియందు లేకపోయెను, ఎందుకనగా ఆ శక్తి నిచ్చువాడు దేవుడు. తమ సంఖ్యను విస్తరింపజేయుమని దేవుని వేడుకొనువారు వారి పిలుపును, ఉనికిని, ఆయన రాజ్యముకై వారి ప్రాముఖ్యతను గ్రహించినవారు.

దేవునిచేత రక్షింపబడినవారు ఆయన దయచేయు వరమును ఎరిగినవారు. అది ఆయనకు మొర్రపెట్టు అధికారము. దానికొరకు వారిని సమర్ధులుగా చేయువాడు ఆయనేనని వారు ఎరిగిరి. తన ఆలోచనలు వారికి దయచేయుట ద్వారా, వాక్యములోనుండి మార్గములను చూపించుట ద్వారా మరియు తనను వెదకుటకు అంగీకరించుట ద్వారా ఆయన దానిని జరిగించును. నశించిపోయినవారి మధ్య తన నామమును నాటునట్లు తన హృదయమును వారిలోనికి ప్రవహింపజేయును. అనేక సంఘములు దేవుని ఆనుకొనిలేరు. ఎందుకనగా, వారు వాక్యమును మాత్రమే ఉపయోగింతురు. దీనిలోనున్న లోపమేమనగా, వారు చేయు పనికై ప్రార్ధించుట ద్వారా కలుగు దేవుని మధ్యవర్తిత్వమును విడిచిపెట్టిరి. ఆయన జోక్యము లేనియెడల వారు న్యాయమైన దానిని చేయరు; ఏలయనగా వారు వాక్యమును సరిగా అర్ధముచేసికొనరు; వారాయన ఉద్దేశములను కోల్పోవుదురు. తమకొరకు మాటలాడుచు, పనిచేయుదురు గాని, ఆయన కొరకు ఎంత మాత్రము పనిచేయరు. వారు వాక్యమును ప్రమాణముగా ఎంచెదరు గాని, దానిని శరీరమందు గ్రహించెదరు. తనకు ప్రార్ధించునట్లుగా దేవుడు వారిలో నివసించుట లేదు. యేసు అట్టివారినిగూర్చి యిట్లు చెప్పెను – లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి (యోహా. 5:39).

యేసు మాటలు వారిని సరిగా వివరించెను. వారు వాక్యమును నిరాకరించరు; దానిగూర్చి తక్కువగా కూడ మాటలాడరు. అయితే, అది ఎవరినిగూర్చి చెప్పుచున్నదో వారు ఆలోచన చేయరు. వాక్యము యొక్క ఉద్దేశమేమి? నిశ్చయముగా దానిగూర్చి మనకున్న లోతైన జ్ఞానమును బయలుపరచుటకు కాదు గాని, తనయొద్దకు మానవులను పిలుచు దేవుని కలిగియుండుటకై యుండెను. మనము దానిని చదువు ప్రతిసారి దేవుని తెలియజేయును; ఇదే దాని ఉద్దేశము. తండ్రి, కుమారుడు ఒక్కటేనని మనకు తెలియజేయును; వారు వాస్తవముగా దేవుడని తెలియజేయును. తన రాజ్యమును కట్టుటకై ఏర్పరచిన క్రియలనుగూర్చి, ఆయన మనస్సునుగూర్చి తెలియజేయును. గొర్రెలవలె వారిని విస్తరింపజేయుమని అడుగునట్లు దేవుడు తన జనులను నడిపించునని అది చెప్పినప్పుడు ఆయన నిర్ణయమును తెలియజేయుచుండెను. మనమాయనకు మొర్రపెట్టునట్లుగా చేయును, ఎందుకనగా తన రూపమైన ఆత్మను మనయందు ఉంచెను. మరియు, మనము ఆయన భారమును మోయుదుము. కావున, యేసు కూడ ఆయన మందిరము అనేక జనములకు ప్రార్ధనామందిరమనబడునని చెప్పెను. కాని, అనేక సంఘములు దొంగల గుహగా ఉన్నవి; వారిక్రింద ఇంకను అనేకులను బంధించుచుండిరి. తన రాజ్యము విస్తరించవలెనని వేడుకొనునట్లు దేవుడు వారిని నడిపించనిదే వారాయన పక్షముగా నున్నవారు కారని గ్రహింపకపోవుట ఎంత బుద్ధిహీనత! తుట్టతుదకు ఆ రాజ్యము ఆయనది, మరియు ఈ సంగతిని వారు ఆలోచన చేయరు. ఇట్టివారు లేఖనములను, అనగా వాక్యమును పరిశోధించినప్పుడు వారు రక్షణ లేనివారును, ఇతరులలో దానిని కలిగించలేనివారునై యున్నారు. వారు కేవలము రుజువు కోరని వాటికి రుజువులను చూపింతురు. వారు కనుగొనినది సత్యమని చెప్పుటకు పరిశుద్ధ గ్రంథములోనుండి అనేక వాక్యములను సమకూర్చెదరు. అయినను, ఇది దేవుని ఇష్టమందు లేకపోయెను; వారు క్రీస్తును పోలియుండలేదు. క్రీస్తువలె నున్నవారినిగూర్చి ఆత్మ ఇచ్చు వివరణ చూడుము. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము (రోమా. 6:5).

ఇదే క్రైస్తవుల యొక్క కూర్పు. క్రీస్తు మరణము యొక్క సాదృశ్యమందు ఐక్యమగుట అనగా శరీరవిధానముల విషయమై మరణించుట. అంటే, దేవుని వెదకి, అర్ధముచేసికొని, మహిమపరచు విషయములలో మన విధానములకు మరణించుట. అప్పుడు ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగా ఉండుట ఎంత సహజమగును! అట్టి ఐక్యమనగా ఆశ్చర్యమైన మార్పు. శరీరాశలకు, ఉద్దేశములకు పూర్ణ విరోధులుగా ఉండెదము. మన మనస్సు దేవుని ఆశల కొరకు పనిచేయును. ఆయన యొద్దకు పోవలెనని అది నిరంతరము మనలను బలవంతము చేయును. తన రాజ్యము కొరకు మనలను ఆయన సాధనములుగా చేయును; ఆయన మనలను నడిపించవలెనని ఆశపడుదుము. మరియు, ప్రతిపనిలో, మాటలో పునరుత్థానుడైన క్రీస్తును పోలియుందుము. శరీరమును, దానికి చెందిన వాటన్నిటిని ఆయన జయించి దేవునికి మహిమగా నిలిచెను. క్రీస్తుతో ఇట్టి పోలిక కలిగియుండుట మనలను సమస్త అపవిత్రతనుండి కాపాడును. దేవునినుండి ఘనత పొందుచునే అతిశయముకు నడిపించు వేషధారణనుండి అది మనలను కాపాడును. మనుష్యులు మనలను గుర్తించెదరు మరియు వారి దయను పొందెదము. ఇది ఏమి చెప్పుచున్నది? ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు; పరదేశియని సిధియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు (కొలొ. 3:11) అనిన నవీన స్వభావమును పొందియున్నాము.

క్రీస్తును కలిగియున్న మనము అందరికి అన్నియునై యుందుము. మనము కలిసినవారిలో క్రీస్తు ముద్రింపబడవలెనని ఆయన స్వభావమును బయలుపరచెదము. మనము పునరుత్థానుడైన క్రీస్తు పోలిక చోప్పునున్న నవీన స్వభావమును పొందితిమి. దానియందు ఎటువంటి పక్షపాతమైనను, భేధమైనను లేదు. క్రీస్తు మనలో ఉన్నయెడల మనమెక్కడికి వెళ్లినను, ఎవరితో మాటలాడినను శరీరమును, దానికి చెందినవాటిని జయించినవానిని ప్రకాశించెదము. దేవుని మధ్యవర్తిత్వము ద్వారా మనము కలిగియున్న ప్రత్యేక జీవితమును వారు చూడునట్లు అవకాశము కలుగజేసెదము. దేవునికి మహిమ కలుగును. ఈ జీవితము క్రైస్తవులందరినుండి కోరబడుచున్నది: మనుష్యుల యెదుట దేవుని బయలుపరచుట. అప్పుడు, తమవంటివారిని అధికము చేయుమని ప్రార్ధించునట్లు ఆయన వారిని నడిపించును. వారినిగూర్చి సాక్ష్యమిచ్చి వారి విన్నపమును నెరవేర్చును. యేసుతో ఆయన ఈలాగుననే చేసెను. మరియు ఆయనను పోలియుండునట్లు కృప ద్వారా మనలను రక్షించెను. కాబట్టి, తన దాసుని ద్వారా క్రైస్తవులకు ఈలాగు చెప్పుచున్నాడు – యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది (యూదా. 1:1).

నీవు దేవునివలన ప్రేమింపబడి, యేసుక్రీస్తు కొరకు భద్రము చేయబడినవాడవని ఎన్నడును మరువకుము; దానిని స్వల్పముగా ఎంచకుము. ఎందుకనగా పాపములో నున్నవారినుండి సువార్త సత్యమును కాపాడవలసిన గొప్ప అవసరమున్నది. వారు మన మధ్యలోనుండి దేవుని కృపను వ్యర్ధముగా ఎంచుచున్నారు. వారిని తీసివేయుట లేక వారిచేత బంధిపబడినవారిని కాపాడుట తగినదని దేవుడు ఎంచెను గనుక మనవంటివారిని, అనగా దేవుని రాజ్యమును విస్తరింపజేయుమని ప్రార్ధించునట్లు ఆయన మనలను పిలిచి, తన ఉద్దేశముతో నింపెను. మనము అడుగుచుండగా వారిని చేరునట్లు మరియు వారిని ప్రేమించు దేవునికి వారిని అప్పగించునట్లు మనకు మార్గము తెరచును. మనమాయనను అడుగునట్లుగా తీర్చిదిద్దుటకు కారణము ఆయనతో అన్యోన్యతను నష్టపోకుండ, ఆత్మలో చేసిన ప్రయాశ పట్ల జాగ్రత్త కలిగియుండుట కొరకే. ఈ విధానమునుబట్టి ఆయన చిత్తమును నెరవేర్చుటకు అడ్డుగానున్న శరీరసంబంధమైన ఆటంకములు తొలగింపబడును. మరియు యేసు ఈలాగు చెప్పెను – ధర్మశాస్త్రములో ఒక పోల్లయిన తప్పిపోవుటకంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము (లూకా. 16:17).

తన రాజ్యము కొరకు దేవుడు వాక్యములో బయలుపరచిన దేదియు విఫలముకాదు; ఆయన పరిచారకుల ద్వారా ప్రకటింపబడిన తన వర్తమానము కూడ విఫలముకాదు. మానవుల రక్షణకై చేసిన ఆలోచనను ఆయన ప్రకటించును. ఆయన ఎన్నుకొనిన జనములకు తన ఇష్టమును ముందుగా తెలియపరచినపుడు దానిని అడ్డుకొను వాడెవడును లేడు. దానికి వ్యతిరేకముగా కొందరు మాటలాడినపుడు వారి నాశనము నిమిత్తము మాటలాడుదురు. వారు దేవునితో నడువరు; ఆయనతో పరుగెత్తుటకు వారికి అవకాశమే లేదు. వారు ఆయనకు నచ్చినట్లుగా ప్రార్ధించు హృదయము లేనివారు. క్రీస్తు యొక్క భారము వారిపై ఉండదు. కాని నీవైతే సహోదరుడా, ఆయనకు నచ్చినట్లుగా నూతనపరచబడితివి. దేవుని అర్ధముచేసికొనుటకై వాక్యమును మార్గముగా కలిగియుండవలెననిన ఆలోచనతో ఉండుము. నీవు దానిని గ్రహించునట్లు ఆయన అనుమతించును. ఆయన చిత్తమిదే – పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నాతల్లియు ననెను (మత్త. 12:50).

Posted in Telugu Library.