విశ్వాసమందు పరుగెత్తుట

విశ్వాసమందు నడుచునపుడు జీవితములో ఆటంకములను ఎదుర్కొందుము. అట్టి సమయములలో దేవుని యెడల మన విధేయతలో లోపములున్నవని కూడ తలంచెదము. కాని, తనయందు యధార్ధమైన నమ్మికనుబట్టి ప్రభువు తుదకు మనకు ఉపశమనమిచ్చును. ఆటంకములు చాల విధానములలో కలుగును. దేవునియందు భయముకు మరియు చిత్తముకు మనలను మనము సరిచేసికొందుము గనుక, లోకమునకును దాని అధికారికిని సాధారణముగానే శత్రువులౌదుము. మన ఎదుట ఆటంకమును నిలుపుటకు సాతాను నిత్యము మార్గములకై వెదకును. మనకు అత్యంత దగ్గరైనవారిని సహితము వారి బలహీనతలయందు చెరపట్టి మనకు దుఃఖము కలిగించును. అవిశ్వాసులను తిరుగుబాటు చేయువారిని అసాధారణ మార్గములలో మనకు వ్యతిరేకముగా వాడు ఉపయోగించును. కాలము గడిచినకొలది మనకు ఆటంకములు కలుగజేయు అనేక మార్గములు వాడికుండెనని తెలిసికొందుము. కాని, ప్రభువు వాటన్నిటిని ఎరిగియున్నాడు. మనము ఎదుర్కొనబోవు ఆటంకములను ఆయన ఎరిగియుండెను. మనము పరీక్షింపబడి, ఆయన బలమును ఎరుగునట్లును మరియు శత్రువు తోసివేయబడుటకును ఆయన వాటిని అనుమతించును. జీవితములో ఏ ఆటంకమునైనను జయించుటకు విశ్వాసములో పరుగెత్తుచు, మనయెడల ప్రభువు తన మంచితనమును జరిగించునని నమ్ముటయే మూలము. ఏలయనగా ఇందుకై ఆయన సమర్ధుడని చూచెదము. అతడు అక్కడనుండి వెళ్లి మరియొక బావి త్రవ్వించెనుదాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు – ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడు గనుక యీ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహెబోతు అను పేరు పెట్టెను (ఆది. 26:22).

ప్రభువునందు నడుచుచున్నామనుటకు ఆటంకములు సూచన. అవి ఆయన సహాయము బహు దగ్గరగా ఉండెనని తెలియపరచును. వాటిని ఎదుర్కొనుచు ఆయనతో నడచుటకు ఎంత పట్టుదలను కలిగియుందుమో, ఆయన సహాయము చేయునని అంత నిశ్చయతతో నుందుము. ఆయన దయచేయగా, ఆయన మార్గములు ఆశ్చర్యమైనవని, అసమానమైనవని తెలిసికొందుము. అది మన భుజములపైనుండి గొప్ప భారము తీసివేయబడినట్లుగా ఉండును; ఆయనను నమ్ముట ఊహించనివాటిని చూచుటను నేర్పించును. అనేకమార్లు విశ్వసించువారు ఆయన ఆశ్చర్య కార్యములను నష్టపోవుదురు. ఎందుకనగా, ఆయన తన కార్యమును చేయుటకు సన్నధమై యుండగా వారాయనను నమ్ముటనుండి తొలగిపోవుదురు; భయముచేతను లేక ఆందోళనచేతను వారు ఇతర మార్గములను ఎంచుకొందురు. విశ్వాసము యొక్క అతి గొప్ప లక్షణము దేవుడు దయచేయునని నమ్ముట. దానిని కలిగియుండుటవలన ఆటంకములకు అతీతముగా ఆయనతో నడిచెదము. దాని కలిగియునపుడు, సాతాను యుక్తిలో పడుటగాని, మనుషుల యొక్క మాటలలో చిక్కుకొనుట గాని జరుగదు. ఏలయనగా వీటికి అనువుగా ఉండుట చేతనే ప్రభువును నమ్ముటకు బలహీనులౌదుము; అప్పుడు మనము చెదరగొట్టబడితిమి.

ఇస్సాకు పాటించిన సూత్రము ఇంకను మనకు అద్భుతములు చేయును. ఇస్సాకు ప్రభువును నమ్మెను, మనుషులపై ప్రతిదాడి చేయక, ప్రభువు దయచేయునని తెలిసికొని, సరైన దిశలో పయనించెను. కావున, యెహోవా మనకు ఎడము కలుగజేసియున్నాడని పలికెను. ఇట్టి సంతోషము యొక్క ఫలితము ఫలవంతమైన జీవితమునకు నమ్మకమిచ్చును. జీవితములోని ప్రతి స్థితియందును విషయమందును జయమును చూచెదము. సత్యమేమనగా, జీవితములో ఫలవంతముగా ఉండదలచినయెడల ప్రభువు మనకు ఎడము కలుగజేయవలెను. మన వృత్తి ఏదైనప్పటికీ, ఈ సత్యము వర్తించును. ప్రతి విజయముతోను దేవుడు మనకెంత దగ్గరగా ఉండెనో గ్రహింతుము; మనకైన ఆయన ఆశను ఉద్దేశమును గ్రహింతుము. ఆయనకు ఘనతను కలుగజేయుదుము. మన చుట్టునున్నవారిని ఆశ్చర్యపరచుటకై మనము పిలువబడి, ఎన్నికచేయబడితిమి. కాబట్టి, ప్రభువును నమ్ముటకు ఇష్టులైనవారిగా ఫలవంతమైన జీవితము కొరకు చేయరానివాటిని మరియు చేయదగినవాటిని చూచెదము. మొదటిగా, చేయరానివాటిని చూచెదము.

  1. పూర్వకాలమందున్న వారివలె ప్రవర్తిచరాదు. ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు” (సంఖ్యా. 32:4). రూబేనీయులు గాదీయులు యొర్దాను ప్రదేశమును బట్టి ఆశ్చర్యపడునట్లుగా తమ్మును తాము మలచుకొనిరి. ఇందువలన దేవుని వాగ్దాన దేశమును వారు అసంగతమైనదిగా ఎంచిరి. ఆ దేశమును స్వతంత్రించుకొను విషయమై మిగిలిన ఇశ్రాయేలుకు వారు నిరాశగా మారిరి. నలువది సంవత్సరముల ప్రయాణము పిమ్మట ప్రభువు ఆశ్చర్య కార్యమును పొందబోవు సమయమున ఆయనను నమ్ముటలో వెనుదిరిగిరి. వాగ్దానము చేత వారిని పిలిచెను గనుక, ప్రభువు వారితో నుండెను గాని, ఆయన ఉత్తమమైన ఆశీర్వాదములను వారెన్నటికిని కనుగొనకపోయిరి. కొన్నిమార్లు దేవుని రాజ్యములోనుండి సామాన్యమైనవాటిని గ్రహించుటలో విఫలమౌదుము. ఈలాగు చేయుటవలన ఇతరులకు కూడ అశాంతిని కలిగింతుము. ఇట్టి ప్రవర్తనను జయింపవలెననిన విశ్వాసము దాని సరైన పనిని మనలో జరిగింపనియ్యవలెను. దేవుడే మనకొరకు నిర్ణయములు చేసి, మన విషయముల పట్ల బాధ్యత తీసుకోనిత్తము.
  2. దేవునికి బాధ కలిగించువారము కారాదు. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు (2 సమూ. 23:6). మన క్రియలు, మాటలు పరిశుద్ధముగా ఉండవలెను గనుక, మన హృదయము ప్రభువు హృదయమువైపు మొగ్గుచూపవలెను. ఇశ్రాయేలు రాజైన సౌలు దేవుని అభిషిక్తుడు. అయినను, అతడు ముండ్లవలె మారెను. అతడు పాపము వెంట పాపము చేసెను. మొదటిగా, సమూయేలు కొరకు కనిపెట్టుట మాని దహన బలి అర్పించెను. ఇందు నిమిత్తమై తన రాజ్యమును వేరొకరికి కోల్పోవు శాపమును పొందెను. ఇది ఇంకను తన జ్ఞానమును కోల్పోవునట్లుగా చేసినందున అమాలేకీయులను విడిచిపెట్టి, దోపుడుసొమ్మును చేజిక్కించుకొని, తరువాత కర్ణపిశాచము గల స్త్రీని ఆశ్రయించెను. ప్రభువు అతనితో నీతిగా వ్యవహరించవలసివచ్చి నందున, అతని శిక్షించెను. సౌలు జీవితములో ఓటమిని పొంది, తన రాజ్యమును వేరొకరికి నష్టపోయెను.

ఇప్పుడు, చేయదగినవాటిని చూచెదము.

  1. విశ్వాసమును సాధనము చేయుట. కీర్తనకారుడు దీని విషయమై బహు ఆసక్తి గలవాడై, ఒక శ్రేష్టమైన కార్యమును అవలంబించెను. నీవు నాకు ఎత్తయిన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమునుగూర్చి నేను కీర్తించెదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసెదను (కీర్త. 59:16). దేవుని లక్షణములపై దృష్టిపెట్టుటను అవలంబించి, ఆయన ఆశ్చర్యములను జ్ఞాపకము చేసికొనుట సాతాను యుక్తిని, మనుషుల తెలివిని తప్పించుకొనుటకు సహాయము చేయును. మన హృదయము ప్రభువువైపు మొగ్గుచూపుచున్నయెడల, అవి మనలను నడిపించదలచిన దిశను వెంటనే గ్రహించి, వాటిపై పైచెయ్యిని సంపాదింతుము. అప్పుడు, ఆటంకము ఎట్టిదైనను, మనలను కాపాడుటకై దేవుడు తన శక్తిని కృపాకనికరమును కనుపరచుట చూచెదము.
  2. దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసికొనుట. నానావిధములైన ఆటంకములను ఎదుర్కొనుచునపుడు ఆయన వాగ్దానములను జ్ఞాపకము చేసికొనుటకై త్వరపడవలెను. అవి మనకు నూతన ధైర్యము నిచ్చును. అవి మనయెడల ఆయన కనికరము చూపించిన సమయమును జ్ఞాపకము చేసి, ఆయనను నమ్మునట్లు బలపరచును. తన తండ్రి ద్వారా కలిగిన వాగ్దానముకు అతీతముగా ఇస్సాకు జీవించినయెడల, తనకును తన ఇంటివారికిని ఆయన ఎడము కలుగజేయుట చూడకపోవును. తన జనులు వాగ్దానములు జ్ఞాపకము చేసికొని, వాటి నెరవేర్పును పొందుటకు బ్రతికి, వాటివలన ప్రోత్సాహము పొందవలెనని ఆయన వాటిని దయచేయును. ఇట్టి ఉద్దేశము గలవాడై ఆయన ఈలాగు పలికెను. రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము (యిర్మి. 30:3).
  3. లోకము యెడల ఆసక్తి లేకుండుట. దానిబట్టి ఆశ్చర్యపడకుడి; అది వేశ్య వంటిది. అది బహు త్వరగా జనులపై నాశనము రప్పించును. దానివలన పట్టబడినయెడల, దేవునితో మనకున్న పవిత్రమైన సంబంధమును అది పాడుచేయును. దేవుని ఉద్దేశముకు వ్యతిరేకముగా అది కలిగించు సమస్తమును మనము ముట్టరాదు. దానితో సంబంధము కలిగియుండుటవలన ప్రభువు నుండి అనేక చెడు పరిణామములు కలుగును. చక్కనిదానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానముగలదానవై జారత్వము చేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా (నహూ. 3:4).
  4. దేవుని కుమారునికి ప్రియమైనవానిగా ఉండుము. ఇది దేవునికి మనలను బహు దగ్గరగా నిలుపును. మరియు అపూర్వమైన, నిష్కల్మషమైన, జీవమిచ్చువాటిని ప్రభువు మనకు బయలుపరచును. వాటివలన మన జీవితము ఫలవంతముగా ఉండును. మరియు యేసు ఈలాగు చెప్పెను. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింపబడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను (లూకా 10:22).
Posted in Telugu Library.