సంతోషించువారు

మన ప్రాణము భావావేశములు గల జీవి. ఒక జీవిత కాలములో అది చాల భావావేశములను అనుభవించును. అవి సంతోషమైనవాటిని మరియు దుఃఖమైనవాటిని కలిగియుండును. సంతోషముగా నున్నప్పుడు మనము ధైర్యముగా నుందుము. మన వైఖరి కూడ నికరముగా నుండును. చేయవలసిన వాటన్నిటికై శక్తిని కనుపరచుదుము. మంచివాటిని చేయుటకు ఆసక్తి చూపుదుము. సంతోషమనునది మానవుడు ఆశపడు భావావేశము; అది లేకుండ వాడు ఉండలేడు. లోకము చేయునదంతయు మరియు చేయనాశించున దంతయు దానిని పొందుటకే. వారు దానికొరకు మార్గములను ఏర్పరచుకొందురు; దుఃఖమును తప్పించుకొనుటయే వారి ఆశ. అయినను, సంతోషము తరచుగా వారిని తప్పించుకొనును. అది మనలను సహితము అనేక సందర్భములలో తప్పించుకొనుట చూచెదము. ఇందుకుగల కారణములలో ఒకరిని నుండి ఒకరికి వ్యత్యాస మున్నప్పటికీ, దుఃఖమును ఈ జీవితమందు నిత్యము తప్పించుకొనలేము. అది అనారోగ్యమువలనైనను, నష్టము, విరిగిన బంధము, పాపము, ఇతరుల క్రియలు లేక శ్రమవలనైనను కలుగును. దానిని ప్రతివాడు, వాడు ఎవడైనప్పటికీ అనుభవించితీరును. అది ఏదెను తోటలో సాతానుని క్రియవలన మానవ జీవితములో భాగమైపోయెను. మానవునిలో పరిపూర్ణత తొలగిపోయినపుడు వాడు దుఃఖమునకు అనువుగా నుండెను. 

దుఃఖపడుటకు ఎవడును ఇష్టపడడు. కాని, ఒకడు దుఃఖపడినపుడు నిశ్చయముగా దానినుండి విడిపింపబడవలెనని ఆశించును. మనుష్యులు తమ జీవితములో ఎదుర్కొను కొన్ని దుఃఖములు వినుటకు సహితము దుర్భరముగా నుండును. క్రీస్తునందు విశ్వసించువారిగా మనము కూడ విపరీతమైన దుఃఖమును అనుభవించునట్లు శ్రమను నానావిధములైన పరిమాణములలో పొందుదుము. ఉదాహరణకు, మనకు అత్యంత ప్రియులైనవారి మరణము సామాన్యమైన బాధ కాదు. అయినను, దానిని అనుభవింపవలెను. అది జీవితములో భాగమైనది. మనము ఇప్పటికే దుఃఖమును అనుభవించితిమని తెలియజేయు అనేక సందర్భములుండును, మరియు ఇంకను దానిని అనుభవింపవచ్చును. కాలము దుఃఖమును స్వస్థపరచునని సాధారణముగా చెప్పబడిన సంగతి. ఇది సత్యమునకు విరుద్ధమైనది. ఒకడు బ్రదుకులో ముందుకు పోవలెను గనుక, కాలము కేవలము వాడిని దుఃఖము పట్ల కఠినునిగా చేయును. మరియు, దుఃఖము యొక్క జ్ఞాపకము వానిపై  పడినపుడు వాడు మరల ఆత్మలో ఆందోళన చెందును. మరల, దీర్ఘకాలపు దుఃఖము మరియు పునరావృత్తమగు దుఃఖము అనేకులను మానసిక రోగులుగా చేసెను. కాని, దుఃఖముకు నిజమైన స్వస్థత ఉన్నది. ఎలాగనగా, అది ఒక్కసారి తీసివేయబడిన పిమ్మట అది మరల మనలను ఆందోళనకు గురిచేయలేదు; ఆ దుఃఖమును జ్ఞప్తి చేసికొందుము, గాని దానికి బానిసలము కాకుందుము. విశ్వసించువారిగా దానిని కలిగియుండుట మన ఆధిక్యత. మరియు లేఖనము ఈలాగు బయలుపరచుచుండెను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్ధమైనది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును” (కీర్త. 19:7).

దుఃఖములేని జీవితము అవాస్తవమైనది మరియు దుఃఖముకు ఉపచారమైన కార్యమున్నది. అది దేవుని నిబంధనవలన (ధర్మశాస్త్రము) జరిగింపబడును. అది సంతోషమునకు తిరిగి రప్పించుట. ఇందుకు కారణము సరళముగానునది – ఆయన నిబంధన యధార్ధమైనది. అంటే, మనము తిరిగి దేవుని దృక్పధముకు రప్పింపబడునట్లు మన భావావేశములకు సమాధానము నిచ్చుటకు అది సమస్తమును కలిగియుండును. దుఃఖమును కలిగించిన సంధర్భములు చెరిపివేయబడలేనపుడు ఆయన వాక్యము మన దుఃఖమును ధైర్యముతోను, బలముతోను మరియు బ్రదుకుటకు ప్రోత్సాహముతోను భర్తీచేయును. నెమ్మదికి మనలను పునరుద్ధరించుటకు అది గొప్ప న్యాయవాది. మరల, మనము పాపము చేసిన పిమ్మట ఆయనను దుఃఖపరచితిమని గ్రహించినపుడు, దుఃఖపడుదుము. చేసినదానిని చెరిపివేయలేము. అయినను, కలిగించిన దుఃఖము విషయమై ఆయనను క్షమాపణ కోరినపుడు తన నిబంధననుబట్టి ఆయన మనలను బాగుచేయును. మనము ఏకారణము చేతనైనను దుఃఖము పొందినపుడు, ఆయన నిబంధన తట్టు తిరిగినయెడల అది దానిని సంతోషముతో భర్తీచేయును. దుఃఖమునకు పూర్వము చూడనివాటిని అది మనకు చూపించును. ఉదాహరణకు, యధార్ధముగా శ్రమపడినపుడు గొప్పదైన భవిష్యత్తును చూచుటకై అది దోహదపడును. శ్రేష్ఠమైనవాటి యొక్క నిరీక్షణబట్టి మన హృదయము చెప్పనశక్యమైన ఆనందముతో నిండును.

అయితే, దుఃఖ సమయములలో అతి కష్టమైనది సంతోషము నిమిత్తము దేవుని నిబంధన తట్టు తిరుగుట; ఎందుకనగా భావావేశములవలనైన అస్థిరత్వము, భ్రమ మరియు మనపై నుండు భారము మనలను అణచివేయును. ఈ సాధారణ సూత్రములను ఇప్పుడు పాటించుట ఆ కష్టమును జయించుటకు నిశ్చయముగా సహాయపడును.

1. దేవునికి భయపడుటను అలవాటు చేసికొనుట. అతడు వారితో ఇట్లనెను – నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను (యోనా. 1:9). దేవునియెడల యోనా భయము అతనిని రక్షించెను. ఈ సంగతిలో నున్న మధురమేమనగా, అతడు దానినుండి వేరుగా జీవింపలేకపోయెను. దుఃఖము యొక్క సంకెళ్ళనుండి విడిపింపబడునట్లు దేవునియెడల భయభక్తులను మన మనోభావముగా చేసికొనగలము. ఆయనయెడల భయభక్తులను ఆయనను గౌరవించుట కొరకైనను లేక ఆయనకు భయపడుట కొరకైనను కలిగియునపుడు, అది మంచిది. ఏలయనగా ఆయనను లక్ష్యపెట్టవలెనని మరియు ఆయనకు అవిధేయులు కారాదని గ్రహించితిమి. ఇట్టిది ఎటువంటి సందర్భమందైనను సంతోషముతో నిండియుండుటకు ప్రధమము.

2. హెచ్చించుకొనరాదు. క్రీస్తు కొరకైన మన జీవితము విషయమై మనమెన్నడును అతిశయపడరాదు. ఎందుకనగా రేపటి దినము లేక రాబోవు సమయము ఏమి తెచ్చిపెట్టునో మనకు తెలియదు. పేతురు ఒకసారి అతిశయపడెను మరియు యేసు అతనితో ఈలాగు పలుకవలసివచ్చెను. – ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (మత్త. 26:34). మనము అతిశయించి పడిపోయినపుడు మరల నెమ్మదిని తిరిగి సంపాదించుట చాలా కష్టమగును. కాబట్టి, దేవుడు తన చిత్తమునుబట్టి మనకిచ్చిన క్షణమందు జీవించుటకు ప్రయాసపడవలెను.

3. దేవుని రాజ్యమును తరచుగా చూచుటకు ప్రయాసపడుట. విశ్వాసము ద్వారా కృపవలన మనము మరల జన్మించినపుడు, మరల పొందిన జన్మ యొక్క ఉద్దేశమందు మనము జీవించవలెను. అందుకు యేసు అతనితో – ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (యోహా. 3:3). మనమెంత తరచుగా దేవుని శక్తిని చూచి, ఆయన సన్నిధిని అనుభవించితే అంత ఇష్టపూర్వకముగాను సమర్ధతతోను ఆయన తట్టు దుఃఖ సమయములలో తిరుగుదము. ఆయన తట్టు తిరుగుటలో నుండు కష్టము కఠినత్వమువలన మాత్రమే కాక, శరీరము యొక్క అసమర్ధతవలన కూడ సంభవించును. దుఃఖములో ఆయన తట్టు తిరుగుటకు ఆయన మన జీవితములో పనిచేసిన జ్ఞప్తి గొప్ప బలముగా నుండును.

4. దేవుని మరియు క్రీస్తును గూర్చి నేర్చుకొనినవాటిని గట్టిగా పట్టుకొనుట. ఇది సులభము కాదు. దానికి గొప్ప క్రమశిక్షణ, అనగా ఉద్దేశపూర్వకముగా విశ్వాసమందు ఎదుగు క్రియ అవసరము. దాని ప్రతిబింబమును ఈ వాక్యములో చూచెదము. వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి (అపొ. 17:11). వాక్యమును చదువుట ద్వారా దేవుని జ్ఞానమందు వృద్ధి చెందుదుము.

5. శరీరముతో పోరాడుటకు విముఖత చూపవలెను. పౌలు ఈ సూత్రమును వెంటాడుటను ఎంచుకొనెను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరప్రకారము యుద్ధము చేయము(2 కొరి. 10:3). ఫలితములకై శరీరమందు పోరాడుటకును లేక వాదించుటకును కొన్నిమార్లు మన భావావేశములు మనలను మోసము చేయ యత్నించును; ఇది మరి చెడ్డదానికి కారణమగును. బహు త్వరగాను, ఎక్కువగాను దుఃఖమును మన జీవితములోనికి సఫలముగా రప్పించుటకు సాతానునికి అది పునాదియగును. శరీరమందు పోరాటము చేయుటకు మనము త్వరపెట్టబడుచున్నయెడల, అది దేవునినుండి వచ్చినది కాదు. ఏ పరిస్థితికైనను అంతమును కలిగించుటకు దేవుడు ఎన్నడును మనలను తొందరపెట్టడు.

6. దేవుడు మనకు నిజముగా దయచేసినదానిని మనస్సునందు నిలుపుకొనుట. మన జీవితములో దుఃఖమును ఆయన కోరుకొనడు. ఇట్లుకానియెడల మన ప్రాణమును తెప్పరిల్లజేయుటకు ఆయన తన నిబంధనను మనకు అనుగ్రహించుటకు సిద్ధముగా నుండడు. మరి ముఖ్యముగా, తన కుమారుని మనకనుగ్రహించి, పాపము మరియు శరీరమువలన కలుగు దుఃఖమును తీసివేయుటకు ఆయనను అర్పింపకపోవును. ఈ సంగతిని గూర్చి పౌలు బహు శ్రద్ధ గలిగినవాడు. విశ్వసించినవారికి ఈలాగు చెప్పి దానిని జ్ఞాపకము చేసెను. మన ప్రభువైన యేసు క్రీస్తును, మనలను ప్రేమించి, కృపచేత నిత్యము ఆదరణయు, శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రియైన దేవుడును, మీ హృదయములను ఆదరించి … మిమ్మును స్థిరపరచును గాక ” (2 థెస్స. 2:16). కృపచేత శుభ నిరీక్షణయు, నిత్య ఆదరణను మనకనుగ్రహించుట ద్వారా ప్రతి దుఃఖమందు సంతోషముకు మార్గము ఎల్లప్పుడు ఉండెనని దేవుడు మనకు బయలుపరచెను. మనలను ప్రేమించెను గనుక, ఆయన మార్గమును సిద్ధపరచును. మనము గ్రహించినను గ్రహింపకపోయినను, మనమెల్లప్పుడు నెమ్మదియందు బ్రదికి, కృప ద్వారా రాబోవువాటికై శుభ నిరీక్షణను పొందుట ఆయన చిత్తమై యున్నది. దీనిని గ్రహించినయెడల మనము స్వతంత్రులము.

Posted in Telugu Library.