సరైన క్రమము

ఎవడును తన్నుతాను ప్రభువు ఎదుట యోగ్యునిగా ఎంచుకొనరాదు. ఏలయనగా మనయెడల ఆయన ఉపకారము మరియు సమస్త సత్యము ఊహించిన దానికంటెను పొందవలసిన దానికంటెను ఎక్కువగానే పొందితిమని తెలియజేయుచుండెను. మన క్రియలు ఆయన ఎదుట మనలను యోగ్యులుగా చేయవు గాని, ఆయన ఎదుట మనమెవరిమై యున్నామో అనిన గ్రహింపు మనలను యోగ్యులుగా పరిగణించుటకు ఆయనకు వీలుకల్పించును. తరచుగా సంఘమునకు వెళ్లువారు ఆయన కనికరమును పొందుటకు నానావిధములైన క్రియలను మార్గముగా ఎంచుదురు. ఇట్లు చేయుట సత్యముకు దూరమైనది. వారియెడల ఆయన చిత్తమును ఎరుగక వారు క్రియలు చేయునపుడు, స్వనీతిని కూర్చుకొనుచు, ఆయన యెదుట తమ్మునుతాము యోగ్యులుగా ఎంచుకొనునట్లు వారి అంతరంగ పురుషుని మోసపరచుకొందురు. కావున, వారు పాపము చేసినపుడు, మరియు నిర్లక్ష్యముగా పాపము చేసినపుడు, ఎటువంటి పరిణామములు లేకుండనే ఆయన అనివార్యముగా వారిని క్షమించునని అనుకొందురు. కనికరము క్రియలవలనైనయెడల ఎన్ని క్రియలు చేయవలెననిన ప్రశ్నకు సమాధానము ఉండకపోవును. వేషధారణతో కాక, ఆయన మనకు చేసినవాటన్నిటికి ఆయన ఎదుట మనలను అయోగ్యులుగా ఎంచుకొనుట సరైన క్రమము (పద్ధతి). ఇది నిజమైన తగ్గింపు. ఆయన యెదుట మనలను యోగ్యులుగా ఎంచుకొనుటకు మన బలహీనతలు, తప్పిదములు, పాపములు అనేకమైనవి. ఈ సంగతిని పరిశుద్ధతకై మనమాయన తట్టు తిరిగినపుడెల్లా మనలను క్షమించుటవలన ఆయన మనకు తెలియజేయును. 

దేవుని ఎదుట మనము అయోగ్యులమని గ్రహించుట మొదలుపెట్టినపుడే ఆయన మనలను అనేక విధములుగా ఆశీర్వదించును. ఆయన పట్ల మన భక్తి కన్న తన నిబంధనను నిలుపుకొనుటలో నున్న ఆయన కృప, విశ్వాస్యతలు చాలా ఉత్తమమైనవని చూచెదము. యాకోబు చూచెను గనుక, ఆశీర్వదింపబడెను. అప్పుడు, అతడు ఈలాగనెను. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని (ఆది. 32:10). అతడు పరిపూర్ణుడు కాడు; తప్పిదములు చేసినవాడే. దేవుడు అతనిని దీవించుటకు కారణమును కనుగొనెను. దేవుని ఉపకారమువలనను సత్యమువలనను (విశ్వాస్యత) తప్ప, తాను ఐశ్వర్యవంతుడగుటకు అతనిలో ఏమియు లేదని గ్రహించెను. ఇందుమూలముగా, విశ్వసించువారిగా దేవుని వాగ్దానమును లేక నిబంధనను కలిగియుండుట చాలా ముఖ్యము; ఏలయనగా దానిబట్టి ఆయన మనయెడల పనిచేయును. కనికరమందు దయ చూపించుటకు ఆయన వాగ్దానము నిచ్చును. కాబట్టి, ఆయననుండి ఆశీర్వాదములు ప్రవహించును. యాకోబు రెండు గుంపులయ్యెను.

కాబట్టి, దేవునిచేత ఆశీర్వదింపబడుట క్రియలు మూలముగా కానియెడల, ఆయన ఎదుట మనము అయోగ్యులమని యెట్లు తెలిసికొందుము? దేవుని వాక్యము చక్కని సూత్రము లిచ్చుచుండెను మరియు వాటిని అంగీకరించి, గైకొనినపుడు దానిని తెలిసికొందుము.

  1. దేవుని మనస్సును తెలిసికొనుట. ఇది అనేకులు విడిచిపెట్టు ప్రప్రధమ సూత్రము. దీనికి బదులుగా ఆయన దయను పొందుటకు క్రియలను ముఖ్యముగా ఎంపిక చేసికొందురు. కొంతకాలము వరకు వారి విధానమునుబట్టి వారు ఆశీర్వదింపబడుచున్నారని అగపడును. కాని, వారి క్రియలు దేవుని ఆశీర్వాదమును కలిగియుండకపోవుటవలన రాబోవు కాలములో వారి నిజత్వము వెలుగుచూచును. వారు తరచుగా వైఫల్యములను కోయుదురు మరియు ఇందుకై వారు పలుకు సాకులను బట్టి వారు బయటపడుదురు. అన్ని క్రియలు అనావశ్యకము కావు; ఏలయనగా దేవుని చిత్తమువలన మనము చేయవలసిన క్రియలుండును మరియు ఆయనయందు విశ్వాసము వాటిని నిర్ధారించును. దానిని కలిగియునపుడు ఆయన మనస్సును తెలిసికొనుటకు నిశ్చయముగా ఆసక్తిని కనుపరచెదము. అప్పుడు వారు – మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలిసికొనునట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా (న్యాయా. 18:5). ఆయన ఉత్తరమువలన కలుగు మంచి పరిణామమునుబట్టి ఆయన యెదుట మన యోగ్యతను గ్రహించెదము.
  2. పాపములను వదిలిపెట్టుట. దేవుని చేత ఆశీర్వదింప గోరువారు ఈ సూత్రమును వెంటనే అనుసరించెదరు. ఎజ్రా, నెహెమ్యా దినములలో ఇశ్రాయేలులో అనేకులు దీనిని చేసిరి. ఆయన దృష్టిలో న్యాయముకాని బంధములను వారు విడిచిపెట్టి. వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు (ఎజ్రా 10:44). వారు క్షమాపణ పొంది, దేవుని చేత ఘనతకై అంగీకరింపబడినపుడు, ఆయన ఎదుట వారెంత అయోగ్యులో తెలిసికొనిరి. మనము కూడ మనలో నున్న పాపమును, ఒకవేళ అది దేవుని దృష్టికి అసహ్యమైన బంధమైనను, దానిని విడిచిపెట్టవలెను. పాపమును విడిచిపెట్టుటవలన కలుగు పరిణామములు ఆయన యెదుట మన యోగ్యతను తెలియజేయును.
  3. దేవునికి కృతజ్ఞులై యుండుట. ప్రభువు దయను పొందుటకు ఎంత యోగ్యులమై యున్నామో తెలిసికొనుటకున్న ఒక ఉత్తమమైన మార్గము ఆయన చేసిన మేలుకై మరల, మరల ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఎంత తరచుగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదమో అంత తరచుగా ఆయన ఎదుట దీనమనస్కులై యుందుము. దీన మనస్సు గలవారముగా ఉండుటకే ఆయన ఎదుట మనలను మనము అయోగ్యులుగా ఎంచుకొనుటకు కారణము, అనగా మన స్థితిని ఎరిగి, కృతజ్ఞతలు కలిగియుండుట. ఆయన చేసినవన్నియు ఒకవేళ చేసియుండనియెడల, బదులుగా అనేకమైన ఇతర సంఘటనలు మనయెడల జరిగియుండును. పొందిన దయనుబట్టి కీర్తనకారుడు వాటిని ఊహించగలిగి, ఈలాగు పలికెను. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును (కీర్త. 136:26). ఒక్కసారి దేవుడు మనలను ఎన్నుకొనిన పిమ్మట మనయెడల ఆయన కృపాకనికరములను పరిత్యజించడు. ఒకవేళ మనము సరిచేయబడవలసిన యెడల, ఆయన తన మార్గములను ఉపయోగించి, కృపాకనికరములను చూపించును.
  4. దేవుని తీర్మానమును గట్టిగాపట్టుకొనుట. ఆయన తీర్మానమిదే. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు (యెహె. 39:29). విశ్వాసులందరు ఈ తీర్మానమును హత్తుకొనినయెడల, అనేక విశ్వాసములు ఉండకుండును. దేవుని ఎదుట మన యోగ్యతను గ్రహించుటకు మనలో నుండు పరిశుద్ధాత్ముడు మూలము. మనయెడల దేవుని ఔదార్యమును గ్రహించుట తప్ప, వేరే అవకాశములేని మార్గములలో ఆయన మనలను నడిపించును. ఆయన మనకు దేవుని గూర్చి, మనయెడల ఆయన ఎన్నికను గూర్చి బోధించును. మన విశ్వాసము యొక్క లోతునుబట్టి ఆయన ఉద్దేశమును ఈయన మనకు చూపించును. ఇట్టివాటిని ఆయన చేయనిచో, మనచుట్టునున్న లోకమువలె అపవాది యొక్క ఉగ్రతను నిశ్చయముగా పొందెదము. ఒక్కసారి తన ఆత్మను మనపై కుమ్మరించు తీర్మానమును దేవుడు చేయగా, ఏ పరిస్థితియందైనను ఆయన దానిని మార్చడు; ఏలయనగా ఆయన మనస్సును మార్చగల పరిస్థితి లేనేలేదు. మనము చేయుచున్నది సరైనదని ఎరుగునట్లు ఆయన ఆత్మ మనలను విశ్వాస సంతానముగా చేయును.
  5. విస్తార మార్గమందు నడుచుట. ఇది యేసు మాటలలో తెలియవచ్చుచున్నది. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును (లూకా. 16:10). దేవుడు మనకు అనేకమైనవాటిని నియమించుట మొదలుపెట్టునపుడు ఆయన ఎదుట మనలను ఎంత యోగ్యులుగా చేసెనో గ్రహింతుము. అనేకమైనవి అనేక ఆశీర్వాదములను దయచేయును. మరల, కొందరు వారికి అప్పగించిన కొంచెము వాటిని సహితము నష్టపోవుట చూచినపుడు ఆయన ఎదుట యోగ్యులుగా నుండుటలో నున్న కష్టము అర్ధమగును. మొత్తముగా, ఆయన నియమించిన దానిపట్ల నమ్మకముగా ఉండుటవలన ఒక అయోగ్యుడు ఆయన ఎదుట యోగ్యునిగా చేయబడునని తెలిసికొందుము; ఎందుకనగా, సహనమందు ఆయన కొంచెముతో ప్రారంభించును.
  6. దేవుని వాక్యము ఆలకించుట. ఆయన ఉపదేశించు వాటికై ఎంత ఉత్సాహమును కనుపరచుదమో అంత దయను పొందెదము. ఆయన పలుకు వాటిపట్ల అనేకులు విముఖత చూపుదురు. ఎందుకనగా, వారు వాటిని అనావశ్యముగా ఎంచుదురు లేక వారికి అవి కష్టముగా అగపడును. అయితే, అవి ఆయన ఎదుట యధార్ధముగా నడుచుటకును ఆయననుండి విస్తారముగా పొందుటకును వనరులై యున్నవి. వారు పొందనపుడు ఆయనను సంతోషపెట్టు చున్నామనుకొనుచు వారి స్వంత మార్గములలో క్రియలు చేయుట మొదలుపెట్టుదురు. అట్టివారిని దేవుడు నడిపించుట మానివేయును మరియు హృదయపూర్వకముగా వినువారివైపు తిరుగును. దీని సారము పౌలు మాటలలో చూచెదము. కాబట్టి దేవునివలనైన యీ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక, వారు దాని విందురు (అపొ. 28:28).
Posted in Telugu Library.