Telugu Page

[collapse id=”collapse_94″][button size=”normal” type=”info” value=”Library” href=”https://onepurpose.in/category/telugu-library/”]


[citem title=”ఈ వారం: అడ్డగించు శక్తి” id=”citem_11″ parent=”collapse_94″]

ప్రభువైన దేవుడు తన సేవకుల మొఱ్ఱ వినును. ఆయన వారిని ఇందు నిమిత్తము సిద్ధము చేయును. ఆయన వారిని నడిపించిన ప్రజల కొరకు వారు మధ్యవర్తిత్వము చేయుదురు. ప్రజల పాపమును, అవిధేయతను ఎరుగునట్లు తన మార్గములలో వారిని పెంచి వారిని సంపూర్ణముగా నాశనము చేయకుండు నిమిత్తము తనను అడ్డగించునట్లు చేయును. తనకొరకు ఒక జనాంగమును ఏర్పరచుకొనిన దినమునుండి వారికొరకు మధ్యవర్తిత్వము చేయు సేవకులను ఆయన నియమించెను. ఏలయనగా పాపములో నున్న జనములపై ఆయన కోపము ఆయనను వేడుకొనుటవలన మాత్రమే తీసివేయబడును. మరియు ధూళివంటివారైన తన ప్రజల పట్ల కనికరమును చూపుమని వేడుకొనిన మోషే, దావీదు, ప్రవక్తల వంటివారిని చూచుచున్నాము. నేలను మొలిచిన పచ్చికయంతయు మిడుతలు తినివేసినప్పుడుప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగలవాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా(ఆమో. 7:2).

తన ప్రజల కొరకు మనవి చేయువారిని దేవుడు నియమించనియెడల ఆయన ఉగ్రత నిలువదు. ఈ దినమున సంఘముల విషయములోను ఇది సత్యము. వారి ఆత్మల కొరకు మొఱ్ఱపెట్టువారు వారియందు ఉండవలెను. లేనియెడల, దేవుని ఉగ్రత వారిని మ్రింగివేయుట కొనసాగించును. వారు కృప మరియు ఆత్మసంబంధమైన ఆశీర్వాదములను, అనగా పరలోక స్థలమును రూఢిపరచు వరములు లేకుందురు. ఇంకను, వారి జీవితము శ్రమభరితమగును; తుదకు వారి చుట్టునున్న లోకముకు హేళనగా మిగిలిపోవుదురు. యాకోబు కొరకు ఆమోసు ప్రార్ధించువరకు వారియెడల దేవుడు ఇదే జరిగించుచుండెను. అతని స్థితినిగూర్చి ఆయనకు జ్ఞాపకము చేయనిచో ఆయన వానిని (ఇశ్రాయేలును) పూర్ణముగా నాశనము చేసియుండేవాడు. అనేక సంఘములు ఆయన ఉగ్రతను పొందుచున్నవి గాని, అది వారియెడల ఆయన కార్యముగా వారు ఆలోచన చేయుటలేదు. ఇందుకు ముఖ్యకారణము వారు తప్పిదములో నున్నారని తెలిసికొనునట్లు తమ్మునుతాము పరీక్ష చేసికొనకపోవుటయే. కాబట్టి, దేవుడు నిజముగా వారికి వ్యతిరేకముగా పనిచేయుచున్నాడని వారు ఎంచుటలేదు. కాని, వారికొరకు విన్నపము చేయుటకు దేవునిచేత నియమింపబడినవాడు ఒకడు ఉండినయెడల దీనంతటిని తప్పించువచ్చును. అట్టివానివి నీవే. ఎందుకనగా, నిన్ను విశ్వాసమునుబట్టి నీతిమంతునిగా చేసి తనను సేవించుమని దేవుడు పిలిచెను.

ఇది అనేకులకు అంగీకారయోగ్యముగా నుండదు. ఎందుకనగా, వారు ఇట్టి కార్యము ఆవశ్యకమా అని, తన మనస్సు మార్చుకొనునని ఆయన ఎరిగినయెడల ఒకడు తనకు మనవి చేయవలెనని ఆయన కోరునా అని, లేక తన ఉగ్రతను పంపకుండ దానిని నిలుపు శక్తి ఆయనకు ఉన్నయెడల దాని అడ్డగించుటకు ఒకని నియమించుట ఏలా అని ప్రశ్నింతురు. మొదటిగా, వేడుకొనుటను తన సేవకులకు నేర్పించువాడు ఆయనే. కాబట్టి, అట్టి కార్యము ఆవశ్యకమే. రెండు, పరిశుద్ధుడును, పాపమును సహించనివాడునై యున్న ఆయన తనకు మొఱ్ఱపెట్టుటవలననే మానవులను కనికరించు మార్గములను సిద్ధము చేయును. ఇందువలన, యేసు నిత్యము ఇశ్రాయేలు రక్షణకై ప్రార్ధించెను. శిష్యులు మరియు వారి వెనుక వచ్చినవారు సహితము ఆలాగు చేసిరి. తాను ఎంత ఎడతెగక వారి విశ్వాస స్థిరత్వముకై ప్రార్ధించుచున్నాడో పౌలు తన పత్రికల ద్వారా సంఘములకు తెలియజేసెను. సంఘములు కూడ ఒకరి పాపముల కొరకు ఒకరు ప్రార్ధించవలెనని ఉపదేశము పొందిరి. వాస్తవముగా, పాపిని తన మార్గములనుండి తప్పించువాడు అతని ఆత్మను మరణమునుండి కాపాడునని ఆత్మ ఒకచోట చెప్పెను. తన పిలుపు, క్షమాపణ, కృప మరియు నీతి విషయమై సంఘములు దేవునికి అవిధేయులై యున్నంత కాలము వారాయన గొప్ప ఉగ్రత క్రింద ఉండియున్నారు. వారి రక్షణకై మనము ఆయనకు విన్నపించుట ఒక్కటే వారిని కాపాడును. దీనివలన ఆయన కనికరమును చూపి మన ద్వారా తన వాక్యమును వారు వినునట్లు మార్గమును ఏర్పరచును. దేవునిగూర్చి ఒక్క సంగతి మనము మరువరాదు: ఆయన బహు ప్రేమామయుడును కనికరపరుడునై యున్నాడు. తన ప్రేమ సముద్రము లోతులకంటె విస్తారమైనది. దానిని సంఘములపై కుమ్మరించునట్లు చేయునది వారికొరకు మనము చేయు విన్నపమే. కాబట్టి, దేవుడు యేసును మనయొద్దకు పంపెను. అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము (అపొ. 3:21).

తన ప్రేమను పొంది మన సమస్త చెడు మార్గములనుండి తిరుగవలెనని ఇతరులు మొఱ్ఱపెట్టుట ద్వారా దేవుడు ఈ యేసును మన యొద్దకు పంపెను; అనగా, యేసును నా ద్వారా మీ యొద్దకు, నా యొద్దకు నాకు ముందుగా వచ్చినవారి ద్వారాను మరియు ఆ ప్రకారముగాను పంపెను. మరియు ఆయన ప్రేమను పొందినవారమై మనవలె ఇంకను అగువలసిన వారికొరకు ప్రార్ధించ బద్దులమై యున్నాము. ఆయనను సేవించు వారందరిలో అవిరామముగా జరుగునది ఇదియే. అది అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునట్లు పనిచేయును. దేవుడు దానికొరకు సమయమును విధించెను. ఆయనకు మాత్రమే దానిగూర్చిన జ్ఞానము కలదు. మరియు తాను ఆశించినవాటిని పూర్వస్థితికి తెచ్చుటకు నిర్ణయించిన సమయమును సంపూర్ణము చేయుటకు మానవులను తనను సేవించుమని పిలుచును. యేసునందు అన్నిటిని పూర్వస్థితికి తెచ్చునట్లు దేవుడు సంఘములనుండి కోరుచున్న కార్యము ఇదే – పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు. అది ధర్మశాస్త్రమునకు ముందుగా దేవుడు స్థాపించిన నీతి, కృప, సమాధానము, సంతోషము, ఆశీర్వాదములను మరియు వాగ్దానములను దయచేయును. అయితే, అట్టి పూర్వస్థితి (కుదురుబాటు కాలము) సంఘముల కొరకు దేవునికి మనము మొఱ్ఱపెట్టుటవలననే కలుగును. కాబట్టి, తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని యున్నాడు (ఎఫె. 1:5).

మనలను తన కుమారులనుగా స్వీకరించుటకు తనలోతాను నిర్ణయించుకొని యునప్పుడు తన చిత్తప్రకారమైన దయసంకల్పము మనయెడల నిశ్చయముగా ఉండును. అది తన చిత్తమును నెరవేర్చుటకై మనలను నడిపించుట; కేవలము తన కుమారుడైన యేసుక్రీస్తువలె మనలను రూపించుటయే గాక ఆయన అడుగుజాడలలో కూడ నడుచునట్లు మనకు సహాయము చేయుట. ఇది మనలను (మరియు నీతిమంతులుగా చేయబడిన వారులను) ఆయన సేవకులుగా చేయును. మనము సేవకులుగా కంటె ఎక్కువైన స్థితిలో ఆయనను సేవింతుము, అనగా స్వీకరించుట ద్వారా కుమారులవలె క్రీస్తు భారమును మోయుదము. అవిధేయులపై ఆయన ఉగ్రతను నిలుపుటకు మనమాయనను వేడుకొందుము. ఇందు నిమిత్తము దేవుడు అద్భుతముగా మనలో పనిచేసెను. క్రీస్తువలె మనము ఆయన సన్నిధిని పొందునట్లు క్రీస్తు ద్వారా మనలను స్వీకరించెను. ఇది కూడ ప్రవక్తల ద్వారా చెప్పిన అన్నిటికి కుదురుబాటు కాలములలో భాగమే. ఆయన సన్నిధిని వాడుకొనుచు సంఘముల కొరకు ప్రార్ధించుచుండగా ఆయన నెమ్మదించి, వారు ఆయనను వెదకుటకు సందర్భమును అనుగ్రహించును. వారిని మనయొద్దకు నడిపించును. మనము వారిని నిరుత్సాహపరచము. ఎందుకనగా, కుమారులనుగా మనలను స్వీకరించుట ద్వారా వారిని ఆయన యొద్దకు నడిపించుటకు అవసరమైన వన్నిటిని మనకు దయచేయును. ఏమిటి ఫలితము? దేవుడు మనకిచ్చిన వారికి జీవము దొరకును మరియు మనకు బహుమానము కలుగును; వారాయనను ఆయన కోరినట్లుగా తెలిసికొందురు. వారు కూడ అన్నిటిని కుమారులుగా క్రీస్తు ద్వారా పొందెదరు. ఇదే దేవుడు మననుండి ఆశించు జయము. మనుష్యులు దేవుడు అనుగ్రహించిన వాటిచేత పాపమును శరీరమును జయించెదరు. విశ్వాస బలము ఒకరినుండి ఒకరికి ప్రవహించుచు అన్నిటికి కుదురుబాటు కాలములను సూచించునట్లు అనేక కార్యములను జరిగించును.

అటువంటి అనేక కార్యములు దేవుడు మొదట యేసు ద్వారా చేసెను. ఏలయనగా లేఖనము ఈలాగు చెప్పుచున్నది. – పజలు తిరుగుబడునట్లు చేయుచున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శిపంగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు(లూకా. 23:14). ఆయన పాపము లేనివాడై ఇశ్రాయేలులో జీవమును కలుగజేసెను. అనేకులు దేవుని నమ్మిరి గనుక ఆయన యొద్దకు చేర్చబడిరి. కారణము: దేవుని సన్నిధి ఆయనతో ఎడతెగక ఉండెను. అది ఆయనకు దేవుని నీతిని మరియు దానినుండి కలుగు శక్తిని దయచేసెను. కావున, పిలాతైనను, అతని చట్టమైనను ఆయనపై నేరము మోపకుండెను. అయినను, మానవులలో నున్న పాపము ఆయనకు మరణమును కలుగజేసెను. అన్నిటికి కుదురుబాటు కాలము వచ్చుటకై దీనిని దేవుడు తన చిత్తమునుబట్టి అంగీకరించెను. వినుము: నీవు దేవునిచేత తన సేవకై పిలువబడినపుడు నీకు విరోధముగా ఏ నేరమైనను ఉండదు. ఎందుకనగా కుమారునిగా ఆయన నిన్ను స్వీకరించుటవలన క్రీస్తునందున్న నీతి నీకు అనుగ్రహింపబడును. అయితే, దీని అర్ధము నీవు ఆరోపణలనుండి స్వేఛ్చ పొందుదవని కాదు. ఏలయనగా దేవుని సేవించు కుమారులు అన్యాయముగా నిందింపబడుట సాధారణమే. నీవు ప్రతి దినము మరణించెదవు. కాని, దాని అర్ధము నీవు దేవుని మహిమకై జీవించుట కొనసాగించుచున్నావు. అయిననేమి? క్రీస్తు శక్తి నీలోనుండి మరిఎక్కువగా ప్రవహించుచు అనేకులను దేవునివైపు త్రిప్పును.

మానవులను తన రాజ్యములోనికి తిరిగి చేర్చుకొనుటకు దేవుడు నిన్ను పిలిచినపుడు క్రీస్తు నీకిచ్చిన అధికారమును చూడుము. వారికొరకు విజ్ఞాపన చేయుటకు ఆయన నిన్ను ఎన్నుకొనెను గనుక దానిని నీకిచ్చును. పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను (మత్త. 16:19). ఆయన నీకు పైనుండి శక్తిని అనుగ్రహించును. దేవుడు బంధించదలచిన దానిని బంధించుటకు, విప్పదలచిన దానిని విప్పుటకు (విడిచిపెట్టుటకు) నీకు జ్ఞానము, అధికారము ఉండును. నీతిమంతులకు, అనీతిమంతులకు భేదము చూపెదవు. దేవునికి మహిమ కలుగునట్లు న్యాయమైన క్రియలను చేయుదువు. నీవు క్రీస్తు సమాధానమును మనుష్యులలో నాటినపుడు అది పరలోకమందు నిరతరముగా బంధింపబడును. నీ సువార్తను వెర్రితనముగా ఎంచినవారిని నీవు విడిచిపెట్టినచో దేవుడు కూడ వారిని విడిచిపెట్టును. నీవలె ఉండవలెనని ఆశించినవారిని బంధించుటకు దేవుడు నీకు అనుమతి నిచ్చును. వారికొరకు నీవు విజ్ఞాపన చేయగా రక్షణ కొరకు వారిని ఆయన బంధించును. వారికొరకు నియమించబడిన క్రీస్తును వారు పొందు నిమిత్తము ఆయన నీ ఆశయందు తన నీతితో పనిచేయును.

తన రాజ్యము కొరకు పౌలును దేవుడు బహు బలముగా ఏలాగు వాడుకొనెనో నీకు తెలియునా? అది సంఘముల కొరకు అతనిలో లోతైన ఆసక్తిని నింపుటవలనై యుండెను. క్రీస్తునందు అతడు కట్టిన సంఘములు చివరివరకు నిలువవలెనని ఆయన ఆశించెను. వారికొరకు విజ్ఞాపన చేయు కొలతను అతనికి దయచేసెను. వారిని బలపరచి, వారికి బోధించుటకు అతనిచేత ప్రయాణములు చేయించెను. రాజ్యమునుగూర్చి వారికి తెలియజేయుటకు అతనిచేత పత్రికలను వ్రాయించెను. ఇంకను అన్యుల మరియు తన స్వజనుల రక్షణ కొరకు దేవుని ప్రార్ధించునట్లు అతనికి మనస్సును ఇచ్చెను. విశ్వాస బలము క్రైస్తవులలోనికి చొచ్చుకొనిపోవునట్లు ఒక స్థలమునుండి మరో స్థలముకు వెళ్లుటకు ఆయన శక్తి అతనికి గొప్పగా సహాయము చేసెను. మనుష్యులను వెదకుటకు అతని నడిపించి ఆయన ఎంచిన వాటికి వారిని నడిపించెను. అతనికి శ్రమలు కలుగునని ఆయన ఎరిగియుండెను గాని, వాటిని జయించుటకు అతనిని బలముతో నింపెను. తన రాజ్యము యొక్క తాళపుచెవులు అతనికి ఇచ్చెను. మరియు, పౌలు ఎక్కడైతే బంధించి, విడిచిపెట్టెనో పరలోకమందు ఆలాగు జరిగెను. దేవుడు అతనిని పూర్ణముగా వాడుకొనెను. ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి – ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్షమియ్యవలసియున్నదని చెప్పెను (అపొ. 23:11).

పూర్వస్థితికి రావలసిన ఆవశ్యకత ఉన్న సంఘములకు సువార్త ప్రకటించుట ప్రత్యేకమైన పని. అది పూర్ణముగా దేవుని సంకల్పములోనే జరుగును. నేను ఈలాగు చెప్పుటకు కారణము కొన్నిమార్లు సువార్త కొరకు ఆయన పిలుపును నెరవేర్చుటకు ఒకడు ప్రయాణములు చేయవలసిన అవసరము ఉండదు. కొన్ని సందర్భములలో దేవుడు చూపిన చోట్లకు వెళ్లవలసి ఉండును. మనుష్యులపై ఆయన ఉగ్రతను అడ్డగించుటకు ఆయనను వేడుకొను నిమిత్తము మనలను ఎన్నిక చేయుటపై ఆయన కొరకు మనము చేయు సేవ ఆధారపడి యుండును. తాను రక్షించదలచిన ప్రజల కొరకు మనలను నియమించువాడు ఆయనే. అది మన ప్రజల కొరకైనను, ఆయన మనకు ఏర్పరచినవారి కొరకైనను లేక అందరి కొరకైనను ఉండును. అది ఆయన కారణములపై ఆధారపడును. ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను (ఎఫె. 5:26).

By: Nathan Kedarisetti [/citem]

[/collapse]

 Telugubible1
“నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను”
(కీర్త. 31:5)
 fellowship1
ఇతరులతో మన సహవాసము
మన సహవాసము ద్వారా ఇతరులనేకమందికి మేలు…
 what drives2
విశ్వాసము యొక్క మహోన్నత 
 nithya1
మూడు సంగతులను గూర్చి నిశ్చయతగలిగి యుండగలము