తన రాజ్యాభివృద్ధికై పిలువబడినవారికి దేవుడు కృపతో సహాయము చేయును. వారాయన పిలుపును అంగీకరించిన తరుణమే రాజ్యము యొక్క పరిచారకులుగా వారిని సిద్ధపరచు మార్గమున ఆయన నడిపించును. వారిలో విశ్వాస స్థిరత్వమునకు మాత్రమే గాక ఆ విశ్వాసము ఆయనకు మహిమ తెచ్చునట్లుగా ఉపయోగించునట్లు కూడ ఆయన వారిలో పనిచేయును. వారాయన పరిచారకుని పనిని సంపూర్ణపరచుచుండగా ఆయన నిస్సందేహముగా మహిమ పొందును; ఏలయనగా అది విశదమగును. ప్రయాశతో రక్షింపబడనివారిని రక్షణకు నడిపించుటకు ఆయన వారిని నడిపించును. ఒక్క విషయము నిశ్చయము: క్రీస్తు ద్వారా రక్షణ అందరికి సమానముగా కలుగునట్లు దేవుడు ఏర్పాటు చేసెను. ఇందునుబట్టి, తన పరిచారకులందరి కొరకు ఆయన సమముగా పరిచర్యచేసి వారిని వినువారిని రక్షించునని తేల్చిచెప్పుట న్యాయమే. ఆయన సమానత దీనివలన కనబడుచున్నది. “అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్ధ్యము కలుగజేసినవాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్ధ్యము కలుగజేసెనని“ (గల. 2:8).
లాభములను కలిగించుటలో దేవుని సాటి ఎవరునులేరు. ఆయన తన రాజ్యము యొక్క నేర్పరియైన శిల్పకారి. దూరముగాను, దగ్గరగాను ఉన్నవారి పరిశుద్ధతకై ఆయన తన కుమారుని అర్పించి తన పరిచారకులలో సమర్ధవంతముగా పనిచేయుటకు తనలోతాను నిశ్చయించుకొనెను. పేతురు మరియు పౌలును, వారి జీవిత విధానములను, చరిత్రను, అభ్యాసములను, స్థితులను మరియు మనుష్యులుగా వారు కలిగియున్న ఖ్యాతిని మనము పరిశీలన చేసినపుడు వారు బహు వ్యత్యాసమును కనుపరచెదరు. వారి పిలుపు కూడ గొప్ప భేదముతో ఉండెను. ఒకరు శరీరమందున్న క్రీస్తుచేత పిలువబడెను, మరొకరు ఆత్మలోనున్న క్రీస్తుచేత పిలువబడెను. అయినను, ఇద్దరూ దేవుని అద్భుత పరిచారకులుగా సమముగా రూపాంతరము పొందిరి. దేవుని పిలుపులో నున్న శక్తి అటువంటిది. తన పరిచారకులను తన ఆలోచనలకు సరిపోవునట్లు ఆయన రూపించును. ఆయన రాజ్య ప్రచారము మానవుని శక్తియందు ఉన్నచో పేతురు మరియు పౌలు యొక్క పరిచర్యలు బహు వ్యత్యాసముతో ఉండును. కాని, క్రీస్తులోనికి యూదులను చేర్చుటకు పేతురుకు ఇయ్యబడినదే పౌలునకు కూడ అన్యుల విషయమై ఇయ్యబడెను. ఫలితము – దేవుడు నష్టము పొందలేదు. సువార్త నమ్మువారికి రక్షణ కలుగజేయుటకు శక్తిగాను, నమ్మనివారికి శిక్ష నిచ్చునదిగాను ఉండెనని రుజువయ్యెను.
దేవుని రాజ్యము కొరకు పనిచేయుట ఒక మనుష్యునిలోనుండి కలుగునది కాదు. అది దేవునివలన కలుగునది. తన పరిచారకులలో ఆసక్తిని నింపువాడు ఆయనే. తన శక్తిని వారికి కిరీటముగా ఉంచును. వారికి పనిని దయచేయువాడు ఆయనే. ఆయన వారిని ఒక ఉద్దేశముతో పిలిచెను మరియు దానిని వారికి తెలియుజేయును. కాబట్టి, నిన్ను ఆయన తన పరిచర్యకై పిలిచినయెడల నీకు సామర్ధ్యమును కలుగజేయు బాధ్యతను కూడ ఆయన కలిగియున్నాడు. నీవు నానాస్థలములకు సంచరించ నవసరములేదు. ఇంకను, తన రాజ్యాభివృద్ధికై నిన్ను అల్పబుద్ధితో తిరుగనియ్యడు. కాని, ఆయన శక్తి నీకు అవసరమైనవన్నిటిని దయచేయును. అంటే, నీవు అక్షయమైన, ఓటమిలేని దేవుని ఐశ్వర్యమును కలిగియుందువు. అవి గొప్ప ఫలకరమైన మరియు బహుమానముకు యోగ్యమైన కార్యమును నీనుండి పుట్టించును. కాబట్టి, “దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు“ (హెబ్రీ. 9:8).
దేవుని పరిచారకునిగా ఉండుటవలన పరిణామము అతిపరిశుద్ధ స్థలమునకు ప్రవేశము. ఇందువలన, పేతురు, పౌలు ఆయననుండి సమముగా పొందిరి. క్రీస్తు పిలుపునుబట్టి వారు తమ మొదటి గుడారమును విడిచిపెట్టిరి. వారిద్దరు బహు వ్యత్యాసముతో ఉనప్పటికీ, నిజముగా అవసరమైనది మరియు వారియందు ఒక్కటిగా ఉండినది వారి శరీరము వారి పిలుపును నిర్దేశించునట్లు అంగీకరించకపోవుటయే. ఇది దేవుడు వారిని సమానులుగా ఎంచునట్లు చేసెను. ఎవరును తన శరీరసంబంధమైనవి (మొదటి గుడారము) నిలిచియుండగా ఆయనను సేవించలేరు. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించునట్లు వారి ఆలోచనలు, క్రియలు అదృశ్యమగువలెను. (కృప ద్వారా రక్షింపబడుటయే దీనిని సాధ్యపరచును). ఆయన సన్నిధిలో తన పరిచారకులు జ్ఞానమును, బోధను, బలమును, నెమ్మదిని కనుగొందురు. ఆయన సన్నిధిలోనుండే వారిలోనికి శక్తి ప్రవహించును, మరియు ఆయన రాజ్యము అభివృద్ధి చెందును. కాని, అనేక సంఘములు అతిపరిశుద్ధ స్థలమునకు మార్గము లేకయే నడిపింపబడుచున్నవి. వారు సత్యముగాను, న్యాయముగాను యోచించిన వాటిచేత దేవుని సేవించుటను సులువగా చేసికొనియున్నారు. దీనికి ఫలితముగా అనేకమంది సంఘములలో ఉండిరి గాని, దేవుని సామర్ధ్యమువలన కాకపోయెను. క్రీస్తు ఈలాగు చెప్పుచుండగా వారి మొదటి గుడార మింకను నిలిచియున్నది. “ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు“ (ప్రక. 16:16).
నిజమే, ఆయన అలంకారముగానే మాటలాడుచున్నాడు. కాని, దానిలో లోతైన వర్తమానముండెను. అది పరిచారులకును సంఘములకును ఇయ్యబడెను మరియు అది సులువగా గ్రహించబడునది. కాని, ఒకడు దానిని హృదయములో చేర్చుకొననిచో అది కంటికి కనబడదు. ఇందు నిమిత్తము ప్రతివాడు తన మొదటి గుడారమును విడిచి దేవుని యొద్దకు రావలెను; ఆయన వారికొరకు సమర్ధవంతముగా పనిచేయును. ఆయన కార్యము ద్వారా అనేకులు మెలకువగానుండి తమ వస్త్రమును కాపాడుకొనుటకు, అనగా అన్ని సమయములలో జాగ్రత్తగా ఉండవలెననిన జ్ఞానమును పొందెదరు. తన పరిచారకుల కొరకు దేవుని ఫలకరమైన పనిలోనున్న జ్ఞానమును గ్రహించితివి గనుక ఆయన వాక్యము పట్ల బహు జాగ్రత్త వహించు వ్యక్తిగా నీవగుటకు అవకాశమున్నది. దేవుని యొక్క నానావిధములైన పరిచర్యలనుగూర్చి ఇప్పుడు జ్ఞాపకము చేయుట అనావశ్యకము. మరియు మనకు ఏ పరిచర్యనైతే ఆయన నియమించునో దానిలో మనలను నిలుపుటకు ఆయన శక్తిమంతుడు. తన పరిచారకులుగా మనలను నియమించుట ద్వారా శిక్షావిధినుండి మానవులను తప్పించుమని మననుండి ముఖ్యముగా కోరుచున్నాడు. వారాయన కృపను ఘనపరచవలెనని కోరుచున్నాడు. ఆయన కోరికను సూచించునది దీనినిబట్టి గ్రహించెదము – “ఆమె – లేదు ప్రభువా అనెను. అందుకు యేసు – నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను“ (యోహా. 8:11).
సందేహములేదు, అందరు పాపము చేసిరి. కాని, ప్రభువుకు తప్ప ఎవరికిని శిక్ష విధించుటకు అధికారములేదు. ఇందు నిమిత్తము ఆయన శరీరములో వచ్చెను. ఆయన సమక్షమునకు వచ్చినవారిని కాపాడుటకు ఆయన ఎంచినయెడల వారు మరణమునుండి తప్పింపబడిరి. దీని అర్ధమేమి? వారు రక్షింపబడిరి మరియు ఇకమీదట పాపము చేయరాదు. ఈ వర్తమానము ఆయన మార్గములేని ప్రజలకు చేరవలెనని దేవుడు మనుష్యులను పిలుచును. ప్రజలకు జీవము నిచ్చు వార్తను వారు ప్రకటించవలెనని ఆయన కోరును. ఆ వార్త సమస్త భయములను, అపాయములను తొలగించును. క్రీస్తు మనుష్యులకు శిక్ష విధించనపుడు వారికి వస్త్రమును దయచేయును. అది ఆయన నీతి మరియు మనుష్యులు వారి దిసమొలను (అవమానమును) చూడకుందురు. దేవుని కొరకు వారి జీవితము ఘనమైన క్రియలతో నిండియుండును; వారి భాష కృప కలిగినదై ఆయన కనికరములను గూర్చి ప్రకటన చేయును. క్రీస్తు బోధించిన ఈ బోధలో నిలకడగా ఉందురు. “మీరు లోకమునకు ఉప్పయి యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు“ (మత్త. 5:13).
పాపము ఉప్పులేనివారిని సంఘములలోనికి తీసికొనివచ్చెను. వారు మొదటి గుడారముతో క్రీస్తు శరీరమును బయలుపరచుచున్నారు. ఫలితము: అనేకులు వారి వేషధారణలో పాలుపంచుకొని తమ్మునుతాము దేవుని పిల్లలమని చెప్పుకొనుచున్నారు. వారివలన దేవుని నామము అవమాన మొందుచున్నదని ఆలోచన చేయు మనస్సు వారికి లేకపోయెను. కాని, వారు లోకమునకు ఉప్పుగా ఉండవలసినవారు. వారు ఈలాగు ఉండవలెననిన అది నీ ద్వారా, అనగా దేవుని పరిచారకుడవైన నీ ద్వారా జరుగును. తన రాజ్యము అభివృద్ధి పొందవలెనని దేవుడు సమర్ధవంతముగా నీయందు పనిచేయుటకు సంతోషించును. క్రీస్తుచేత విశ్వాసము ద్వారా నీవు వస్త్రముతో కప్పబడితివి మరియు మనుష్యులు నీ వస్త్రమును ఎడతెగక చూచెదరు. అతిపరిశుద్ధ స్థలమునకు మార్గము నీకు తెలియజేయబడును. ఆయన నీకు ఘనతగల క్రియలను దయచేయును. నీద్వారా అనేకులు దేవుని నీతిలోనికి ప్రవేశించెదరు. ఎందుకనగా, వారిని మరణముకు నడిపించు పాపమును క్రీస్తు రక్తము జయించును. ఈ సంగతిని నీవు దేవుడు నీకొరకు పనిచేయు విధానమునుబట్టి ఎరుగుదువు. “కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక“ (అపొ. 26:19) అని పౌలు ధైర్యముగా పలికెను.
ఇట్టి ధైర్యముకు దేవుడు నిన్ను నడిపించును. నిన్ను తన రాజ్యాభివృద్ధికై నడిపించినపుడు ఆయన పిలుపుకు నీవెన్నడును అవిధేయుడవు కావు. పేతురుకువలె తనకొరకు కూడ దేవుడు పరిచర్య చేసినందున పౌలు తననుగూర్చి చెప్పుకొనుట దేవుడు జ్ఞానముగా ఎంచెను. నిస్పక్షపాతముగా తన పరిచారకుల కొరకు పనిచేసి నిస్పక్షపాతముగా అందరికి రక్షణ దయచేయవలెనని దేవుడు తన కుమారుని పంపెను. తనకు పరిచర్య చేయుటకు దేవుడు నీకిచ్చిన పిలుపును సందేహింపకుము. ఏలయనగా నీవు సందేహించినపుడు దేవునికి కలుగు మహిమ, నీకు కలుగబోవు బహుమానము కొట్టివేయబడునట్లు సాతానునికి అవకాశమిచ్చెదవు. అది ఏ పరిచర్యయైనను నమ్ముము మరియు దానిని ఆయన నీకు నీతిగా ఎంచును. అది క్రీస్తు పలికిన మాటలకు సరిపోవును. “కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను“ (మార్కు. 1:15).