ఒక ముఖ్యమైన అంశం

ప్రార్ధన అనేది క్రైస్తవుని జీవితములో ముఖ్యమైన అంశములలో ఒకటి. అది లేకుండ జీవితము ముందుకు కొనసాగలేదు. దేవునితో సంబంధమును ఏర్పరచుకొనుటకు అది ఒక క్రియ. అది ఆయనను వాక్యములో -నుండి అర్ధముచేసికొనుటకు సహాయము చేయును. ఆయనతో మన సంబంధము మన ప్రార్ధనలలోని యధార్ధతను నిర్ధారణ చేయగా, మన ప్రార్ధనలలోని యధార్ధత వాటి సాఫల్యమును నిర్ధారణ చేయును. ప్రార్ధనలో చాల అంశములు ఉన్నను, వాటిలో ప్రాముఖ్యమైనది మరియు బహు సంతృప్తి నిచ్చునది ప్రభువును అడుగుట. ప్రభువును అడుగుట లేక విన్నపించుట అనునది మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత. దానిలో వాగ్దానమున్నది. అదేమనగా, ఆయన చిత్తప్రకారము అడిగినపుడు ఆయన ఉత్తరమిచ్చును. ఆయన నిజముగాను, యధార్ధముగాను, కచ్చితముగాను మన విన్నపమును నెరవేర్చును. ఇదే ఆయనతో యధార్ధమైన సంబంధమువలన కలుగు ధైర్యము. ఆయనను అడుగుట ఆయన మహోన్నత్వముకు సాక్ష్యమై యుండును. కావున, ఆయన అనుగ్రహించును. ఏలయనగా ఆయనే ఈలాగు చెప్పెను – కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును (జెక. 10:1). 

అడుగువలెనని మనకు చెప్పబడెను. దానిని నిర్లక్ష్యము చేయరాదు. దానిని నిర్లక్ష్యము చేయువారు తప్పు మార్గములోనికి పోవువారు. వారు అవివేకమైన ఎంపికలు చేయుదురు, పరిచయములేని మార్గములు వెదకుదురు మరియు హాని కలుగజేయు నిర్ణయములు తరచుగా తీసికొందురు. మనము ప్రభువును అడిగినపుడు ఆయన ఆజ్ఞను జరిగించుచున్నాము. పొందు నిమిత్తము అడుగవలెనని యేసు మనకు చెప్పెను. ఆయన మాటలకు లోతైన అర్ధమున్నది. అదేమనగా, నీతిలో అడుగుట. ఆయన ఎవరో మనము గ్రహించినపుడు, అంటే ఆయన పరిశుద్ధుడును నీతిమంతుడని అర్ధముచేసికొనినపుడు, అడుగుట ఆయన స్వరూపము ప్రకారముగా ఉండవలెనని ఎరుగుట వివేకము. కాబట్టి, దురుద్దేశముతోను విరోధ భావముతోను లేక చంచలత్వముతోను అడుగుట బుద్ధిహీనతగును.

కడవరి వర్షపుకాలమున వర్షము వచ్చునని ఊహించుట సాధారణమైనట్టుగా మనకు అవసరము కలిగినపుడు ప్రభువు దయచేయునని ఊహించుట కూడ సాధారణమే. అయినను, తనను అడుగవలెనని దేవుడు ఆశించును. సాతాను మనలను ఆటంకపరచుటవలన ఆలస్యము కలుగకుండునట్లు లేక మన పాపము ఆయనకు కోపము పుట్టించుటవలన ఆలస్యము కలుగకుండునట్లు ఆయన ఇట్లు ఆశించును. ఇంకను, అవసరము ఉన్నప్పుడు ఆయనను అడుగుట మన దృష్టి ఆయనపై ఉండెనని తెలియజేయును. అడుగుట ఆయన మార్గము స్థిరమగుటకు ఆయన సర్వశక్తిత్వముపై ఆధారపడుట. ఈలాగు చేయుటవలన మనము మరల ఆధిక్యత పొందుదుము. ఏదైనా ఒక విషయము చేయుటను విరమించుమని అడిగినపుడు గాని, ఒక సంగతిని ఆలస్యము చేయుమని అడిగినపుడు గాని, ఆయన ఆలకించును. ఏలీయా అను ఒక వ్యక్తి మనకు జ్ఞాపకము వచ్చును. మరల, కేవలము ప్రభువును అడుగుటవలననే నెరవేరు అవసరములు మన బ్రతుకులో ఉండును. అవి ఆయనపై ఆధారపడవలెననిన మన సంకల్పమును పరీక్షించును. ఆయనపై ఆధారపడినపుడు మనలను నిరుత్సాహపరచి, మనకు విసుగు పుట్టించగల ఆలస్యమును తప్పించుకొందుము. ఇది ఆయనతో మన సంబంధముకు ఒక శక్తివంతమైన రుజువు. నిశ్చయముగా, మన ప్రాధమిక అవసరముల కొరకు ఆయన దయచేయును గాని, యధార్ధమైన ప్రార్ధన వాటికి ముందుగా ఉండును.

ప్రభువు మన విన్నపములను నెరవేర్చునని ధైర్యముతో ఉండుటకు కారణమిదిగో: అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందవరకు రెండుగా చినిగెను”  (మార్కు. 15:38). దేవుని సింహాసనమును చేరుటకున్న అసాధ్యత తీసివేయబడెను. ముసుగు నిలిచియునపుడు తనను అడుగుమని మనుష్యులకు ఆయన చెప్పి, వారి విన్నపములను నెరవేర్చినపుడు, క్రీస్తునందు మన విన్నపములను మరిఎక్కువగా ఆయన నెరవేర్చును. ఆయనను అడుగరాదనిన యోచన దుర్మార్గమైనది. అడగనివాడు తన పూర్ణ శక్తిచేత సంపాదించుకొనినవాటిని సహితము పోగొట్టుకొనును; ఏలయనగా వాడు ఆయనను అడుగుటవలన కలుగు కాపుదలను నష్టపోవును. ఆయనతో మన సంబంధము యధార్ధమైనదైనపుడు, మన మనస్సులో ఉన్నవాటన్నిటిని అడుగవచ్చును. ఆయన తన సర్వశక్తిత్వమును కనుపరచు నిమిత్తము అవి మన మనస్సులో పుట్టుట ఆయన చిత్తమై యుండును. వాస్తవముగా, అవి ఆయన ఆలోచనలనుండి వచ్చునవి. కాబట్టి, కొన్నిమార్లు అవసరములు కలిగినపుడు, మనము అడిగి పొందవలెనని వాటిని ఆయనే కలుగజేసెను (లేక, అనుమతించెను). కడవరి వర్షముకు కాలము వచ్చినపుడు ఆయనే సమస్తముపై అధికారము చేయువాడని మనము గ్రహించునట్టు వర్షమును ఆలస్యము చేయును. గర్భమును మూసివేయువాడును, విన్నపమునుబట్టి దానిని తెరచువాడును ఆయనే. ఒక సంగతిని మరుగుచేసి, దానిని బయలుపరచుమని మనము అడుగువలెనని మనకై ఆయన వేచియుండును. కేవలము అడుగుట ద్వారా మానవుడు బోధించుదానికంటె ఎక్కువగా ప్రభువైన దేవుని గురించి తెలిసికొందుము.

యేసు ఈలాగు చెప్పెను – నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును” (యోహా. 10:9). ఈలోకములో అనేక ద్వారములు లేక అవకాశములు మనకు లభ్యమగును. చూచుటకు అవన్నియు యోగ్యముగానే అగుపడును. కాని, వాటి మధ్య యేసు అను ఒక ద్వారము ఉండెను. ఆయనను ఎన్నుకొనినయెడల, కేవలము ఎల్లకాలమునకు రక్షింపబడుటయే గాక, మనము తలంచినపుడు జీవితములో మంచివాటిని కూడ కనుగొందుము. చూడుము, మనము నానావిధములైనవాటిని ఆశించు విధానమును నిర్దేశించునది ద్వారమే. మన ప్రతి అగుడును దేవుడు సరిగా నడిపించి, తన స్వభావముకు మన మనస్సులు సరిపోవునట్లుగా చేయుటకు ఆ ద్వారము మనలను చక్కని చోట నిలువబెట్టును. కాబట్టి, మనము కనిపెట్టవలసినను, దూరముగా నున్న పచ్చికగల చోట్లను చేరుటకై పచ్చికగల చోట్లలోనే పోవుచు కనిపెట్టుదము. యేసు మాట షరతుతో కూడిన వాగ్దానమని గ్రహించవలెను. నిత్యము ఆయనపై ఆధారపడినపుడే గాని, వాగ్దానము మనకు అందనంత దూరముగా ఉండును.

మన విన్నపములను దేవుడు నెరవేర్చుననుటకు ఆధారమున్నది. పౌలులో నుండిన ఆత్మ ఈలాగు చెప్పెను. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు  (రోమా. 1:20). పరిశుద్ధగ్రంధము పుటలను పరిశీలించుట ద్వారా ఆత్మతో ఏకీభవింతుము. అంతేగాక, వాటిని మనమే మన జీవితములో అనుభవించినయెడల ఆయన సామర్ధ్యమును గూర్చి మరిఎక్కువ నిశ్చయతతో నుందుము.

దేవునికి అసాధ్యమైన దేదియు లేదు. ఒకవేళ అసాధ్యమైనది ఉన్నచో, అది ఆయనతో యధార్ధమైన సంబంధముకై నీ పట్టుదలలో ఉండును. అయినను, నీవాయనపై పూర్ణముగా ఆధారపడినయెడల ఆయన దానిని కూడ మార్చగలడు. ఇది రెండు చాల ముఖ్యమైనవాటిని కలిగియున్నది.

  • ఆయనతో నీ సంబంధమును అడ్డగించుచున్నవని నీవెరిగినవాటిని పరిత్యజించుట. అవి నీ అలవాట్లు, లక్షణములు, నీవు చాలాకాలముగా ఎరిగిన ఆచారములు, దేవసంధమైన రుజువును కోరుచున్న నమ్మకములు మరియు మరేదైనను కావచ్చును. పౌలును తన తోటివారును దీనిని చేసిరి గనుక వారిని తృప్తిపరచు పచ్చికగల చోట్లను కనుగొని దేవుని మహిమపరచిరి. అతడు ఈలాగు పలికెను – అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము” (2 కొరి. 4:2).
  • దేవభక్తితో నుండు ఉద్దేశమును గలిగి నీవు తనపై నమ్మికయుంచుచున్నాని ఆయనకు చెప్పుట. తరువాత, ఇది చేయుము: అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము (1 తిమో. 4:7). సారములేని విషయములనుండి దూరముగా ఉండుము. అప్పుడు, బహు త్వరగా దేవునితో నీవు చేసిన ఒడంబడికకు నిన్ను నీవు క్రమశిక్షణ చేసికొనుటకు సమయమును మార్గములను కనుగొందువు.

దేవునివలనైన పచ్చికగల చోట్లకంటె గొప్పదైన దేదియు లేదు. మరియు, దానికొరకు ఆయనను అడుగుట కంటె మిన్నయైన మార్గము లేదు. అప్పుడు, ఈ ఆశీర్వాదము నిరంతరము నీదగును. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్” (రోమా. 15:33).

Posted in Telugu Library.