మనలను సృజించుటలో దేవుని ఉద్దేశమేమై యుండును? నీవు దానిని ఆలోచించితివా? అనేకులు ఆలోచించుటకు సమయమును ఏర్పరచుకొనరు. వారిలో అనేకమంది దేవుని ఎరుగనివారును లేక ఆయనను ఎరుగుట ఆవశ్యకమని ఎంచనివారునై యున్నారు. మిగిలినవారు ఆయనలో ఏదోక విశ్వాసమును కనుపరచుదురు. అయితే, దానిని గూర్చి ఆలోచించుట దేవుని జ్ఞానమును ఆయన చిత్తమందు పొందుటకు ఆసక్తి కలిగియుండుటై యున్నది. అప్పుడు, మనలను సృజించుటలో ఆయన వివేకమును గ్రహించెదము. ఘనతను కోరు ధనవంతుడు తన ఇల్లును దానిలో ఉన్నదంతయు హీనముగా ఉండునట్లు ఒప్పుకొనడు. తన ఇంటిని తాను కలిగియున్న వాటన్నిటినిబట్టి తన మహిమను ప్రత్యక్షపరచునట్లు కట్టును. ఆలాగుననే దేవుడు తన ఇంటిలో నివాసముండుటకును ఆయన క్రింద ఉండుటకును మనలను సృజించినపుడు ఒక ఉద్దేశముతో చేసెను. ఆ ఉద్దేశమును వాక్యము ప్రతిబింబించుట చూచెదము. “దేవునికంటె వానిని కొంచెము తక్కువనానిగా చేసియున్నావు. మహిమాప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు” (కీర్త. 8:5).
మహిమాప్రభావములతో సత్కరించుటకు దేవుడు మానవుని సృజించెను. ఇది సత్యము. మానవులు దానిలో నున్న వివరములను పరిశీలన చేయనప్పుడే అది అసంపూర్ణమగును. వాటితో దేవుడు మనలను సత్కరించనిదే వాటిని పొందము మరియు వాటికి అతీతముగా పొందినవన్నియు వ్యర్ధమగును. ఈ సూత్రమును అనేకులు అలక్ష్యము చేతురు మరియు ఇంకను అనేకమంది గ్రహించరు. మానవులు మహిమాప్రభావముల వెంట పరుగెత్తినపుడు వారిని సృజించుటలో నున్న దేవుని ఉద్దేశమును వారు నష్టపోయిరి. తమ సొంత మహిమను ప్రభావమును వెదకుట మానవుల తత్వము. మరియు అట్టివారు సంఘములకు వెళ్లువారైనపుడు వారు నామకార్ధ విశ్వాసులు. కాని, విశ్వసించువారి మహిమాప్రభావములు దేవునినుండి కలుగును. ఎందుకనగా, వారు మొదటిగా పాపము నుండియు, దాని రూపముల నుండియు వేరు చేయబడిరి. తన తత్వమును ప్రతిబింబించనిదే దేవుడు ఎవరిని మహిమాప్రభావములతో సత్కరించడు. ఇట్టి, అవసరతకు పాపము కారణమయ్యెను. ఇందుమూలముగానే దేవుని రాజ్యము వెలుపల నున్నవారి మహిమాప్రభావములు తుదకు వాడిపోవుటయు, అవమానముగా మిగిలిపోవుటయు లేక వ్యర్ధమైపోవుటను చూచెదము.
దేవుడు మహిమాప్రభావములను కుమ్మరించువరకు ఆయనకై కనిపెట్టుట విశ్వాసి యొక్క నిజమైన గుణము. అంటే, అతడు ఆయన మార్గములలో నడిచి, ఆయననుండి నేర్చుకొనుటకు ఇష్టపడుచున్నాడు. తనను ఆశీర్వదించవలెననిన ఆయన ఉద్దేశమును వాడాయనకు జ్ఞాపకము చేయును, గాని ఆయనను విడిచి వెళ్లడు. ఆయన జ్ఞానమును వెదకుచు, ఆయనతో అన్యోన్యముగా ఉండుటకు వాడు ఆసక్తిని చూపును. ఆయన వానికిచ్చిన మార్గముల కొరకు నిత్యము పనిచేయును. వాడు శ్రమ పొందును, గాని ఆయనను దూషించడు. ఇట్టి తత్వము నీదైనయెడల నీ భవిష్యత్తును గూర్చి నీవు చింతించ నవసరములేదు; నీవు లోకమువలెను నామకార్ధ క్రైస్తవులవలెను పరుగెత్తవు. దేవుడు నిన్ను మహిమాప్రభావములతో సత్కరించుటకు సమయమును సిద్ధము చేసెనని ఎరుగుదువు. ఈ నీవింకను అనుమానించుచున్నచో దావీదును ఆలోచన చేయును. ఒక కాపరిగా నున్నవాడు రాజు ఎట్లైయ్యెనో ఆలోచించుము. మనలో ప్రతివానికి దేవుడు మహిమాప్రభావములను సిద్ధపరచును. అది ఆయన పిలుపును ఉద్దేశము ప్రకారమునై యుండును. అది ఒకరితో ఒకరికి వ్యత్యాసము కలిగియుండును, గాని అది నిశ్చయము.
అయితే, మనము జాగ్రత్తపడవలసిన దొకటి ఉండెను. అనగా, దేవుడు మనపై కుమ్మరించ దలచిన మహిమాప్రభావములను నష్టపోవునట్లు ఓటమిని దయచేయు స్థితిని గూర్చి జాగ్రత్తపడవలెను. అది తిరుగుబాటుతనము. గతకాలమందున్న జనులు దానిని స్వతంత్రించుకొని దేవుని ఈలాగు ప్రేరేపించిరి. “– తిరుగుబాటు చేయు వీరితో ఇట్లనుము – ఈ మాటల భావము మీకు తెలియదా? యిదిగో బబులోను రాజు యెరూషలేమునకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని, తన యొద్ద నుండుటకై బబులోనుపురమునకు వారిని తీసికొనిపోయెను“ (యెహె. 17:12). దావీదు పొందినదానిని వారు నష్టపోయిరి. దేవునిపై ఏవిధముగానైనను తిరుగుబాటు చేయుట నాశనమును కొనితెచ్చుకొనుటయే. మనవైపు వచ్చు ప్రతి మంచిదానిని హతమార్చుదము. తిరుగుబాటుతనము పాపము చేయ నాశ కలిగియున్న అవిధేయత ఫలము. దానిని స్వతంత్రించుకొనువాడు దేవుని, ఆయన మార్గములను, సూత్రములను మరియు తీర్పులను అలక్ష్యము చేయునట్లు ఉద్దేశపూర్వకమైన దురదగలవాడు. విపర్యయముగా, ఆయనకు విధేయులై యుండుట మేలైనది. ఇది అన్నిమార్లు సులువు కానప్పటికీ, అది మేలైనది. మనకు అన్ని విషయములు అర్ధము కాకపోయినను మరియు అన్నిటికి సమాధానము లభించకపోయినను, ఆయనతో బ్రదుకుటకు సావధానముగా ఉండవలెను. ఏలయనగా దేవుని తత్వము యొక్క గొప్పతనము మనలను మహిమాప్రభావములతో సత్కరించు తన ఆశను నిర్వర్తించుటయే. అన్ని విషయములలో ఆయనకు విధేయత చూపునంతగా మనము నిలిచినపుడు, ఆయన అబద్ధమాడునని లేక మారునని నమ్మకుందుము.
విధేయతలో ఉన్నప్పుడు ఉండు ఏకైక కష్టము ఆయనకొరకు కనిపెట్టుట. ఎందుకనగా, దానిలో నున్నప్పుడే ఆయన మనలను మహిమాప్రభావములతో సత్కరించునని ఎరిగి కనిపెట్టుచున్నాము. అయితే, దానిలో ప్రత్యేకమైన ఉద్దేశముండెనా? అది ఆశ్చర్యమైనది.
1. మనయెడల తన మంచితనమును తెలిసికొనవలెనని ఆయన ఆశించును. విధేయతవలన దానిని గ్రహింతుము. కనిపెట్టుట అనిన కష్టములో నుండగా మనకు నానావిధములైన అవసరతలుండును. మరియు, ఆయనను సంతోషపరచు విధానములో ఆయనను వెదకుట ప్రారంభింతుము; ఆయనను సంతోషపెట్టుట కున్న రహస్యమును అర్ధముచేసికొందుము. మనకొరకు ఆయన తన మనస్సును మార్చుకొనుటకు ఇష్టపడుచున్నాడని తెలిసికొందుము. మనము అడుగు వాటన్నిటికి ఆయన ఉత్తరమిచ్చును. “అందుకాయన – ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను” (మార్కు. 7:29). మహిమాప్రభావములతో మనలను సత్కరించు సమయమునకు ఆయన తన్నుతాను మనకు ప్రేమ, దయగల దేవునిగా కనుపరచుకొని యుండును.
2. క్లిష్ట సమయములను మనము ప్రతిఘటించవలెను. వాటిని ఆయన అనుమతించును. “అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను“ (యోహా. 6:18). ఆయన బలమును సన్నిధిని మనము నిత్యము ఎరిగియుండవలెనని క్లిష్ట సమయములలో తన శక్తిని కనుపరచును. ఆయనయందు మన నమ్మికను చూపుటకు అవి మంచి అవకాశములై యున్నవి. వెంటనే దానికై మనము సమర్ధులము కానప్పటికీ, ఆయన దయచేయుచున్న సహాయమునుబట్టి తుదకు సమర్ధులౌదుము. ఆయన తత్వమును ప్రతిబింబించు జనులుగా మారుదుము. శ్రమలు ఆయన మార్గములలో నడుచుటకు మనలను సిద్ధపరచి, మనకై ఆయన దాచియుంచిన మహిమాప్రభావములను పొందవలెనని ఆయన చిత్తమును నెరవేర్చువారిగా చేయును. మన జీవితమంతయు ఆయన మహత్తుకు అవి జ్ఞాపకముగా నిలుచును.
3. మనమెల్లప్పుడు ఆయనకు చెందవలెను. ఆయనకై కనిపెట్టుటకున్న ఒక ప్రాముఖ్యమైన కారణము మనము నిత్యము ఆత్మకు నివాసులై యుండుట. అంటే, దేవుని దుఃఖపరచము. నిత్యము ఆత్మలో జీవించుటకున్న ప్రయాసను నేర్చుకొందుము. కావున, ఈలాగు వ్రాయబడెను. “దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు” (రోమా. 8:9). దేవుని మహిమాప్రభావములు మనపై నిరంతరము నిలుచు నిమిత్తము ఆత్మ యొక్క నివాసముగా సిద్ధపరచబడితిమి.
4. క్రీస్తును విస్తారముగా పొందవలెను. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి” (కొలొ. 2:3). క్రీస్తును గూర్చిన లోతైన, ఆశ్చర్యమైన సంగతులను కూర్చుకొందుము. ఆయన ఉద్దేశప్రకారముగా ప్రతి విషయమును ఆలోచన చేసి, తీర్పుతీర్చు సామర్ధ్యమును, ఆశను స్వతంత్రించుకొందుము. ఆయనకు అతీతముగా నున్న జీవితజ్ఞానమును గ్రహించి, దానిని అడ్డుకొందుము. ఆయన సంపదలు ద్వారా ఆయననుండి పొందినవాటిని సరిగా జరిగించి, దేవుడు మనకై ఉంచిన మహిమాప్రభావములకు యోగ్యత పొందుదుము.
5. ఆలోచనయు, వివేకమును లేనివారి తత్వమును స్వతంత్రించుకొను మనస్సును కూర్చుకొనరాదు. వారినిగూర్చి ఆత్మ ఈలాగు చెప్పెను. “మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరకదు“ (యాకో. 4:2).