ఏసు – “మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా” అనెను (యోహా. 8:17). ఈ జీవితమునకు సంబంధించిన విషయములలో ప్రతి విషయమునకు ముగింపు రెండు లేక మూడు సాక్ష్యములవలన (రుజువులు) ఉండునని గ్రహించెదము. కాని, పరలోక సంబంధమైన మన రక్షణ విషయమేమీ? దానికై మనకున్న సాక్ష్యములేవి? నిస్సందేహముగా ఒకటి మననుండి వచ్చును. అలాగైతే, రక్షణకు సాక్ష్యములు అవసరమా? యేసు తనను గూర్చి తానే సాక్ష్యమిచ్చువాడనని మరియు తన తండ్రి కూడ తనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని దృఢముగా చెప్పెను. దీనిని ఆలోచనలోనికి తీసికొని, విశ్వాసమును, నీతిని మరియు విధేయతను ఏకీకరించు (కలుపు) మన రక్షణకు సాక్ష్యమున్నదా? ఏసును గూర్చి సంబంధించి నంతవరకు తాను దేవుని కుమారుడనని చెప్పుటకు ఆయన మాట చాలును. అయినను, తండ్రిలో మరో సాక్ష్యమును ఆయన కలిగియుండుట అవసరమయ్యెను. ఇందువలననే అనేకులు ఆయనను క్రీస్తుగా నమ్మిరి.
పౌలు ఒక చోట ఏసు ప్రభువని నోటితో ఒప్పుకొని, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెనని నమ్ముట రక్షణ నిచ్చునని చెప్పెను. క్రైస్తవులుగా మనమందరము దీనిని చేసితిమి మరియు ఎవడైనను చేయనియెడల, వాడు వెంటనే దానిని చేయవలెను. ఈ దినమున క్రైస్తవులు పౌలు చెప్పిన వాక్యమును రక్షణ కలిగియుండుటకు కారణముగా చూపెదరు మరియు వారియొద్ద సాక్ష్యములు లేనియెడల, అది వాస్తవము కాదు. ఇందునుబట్టి ప్రతివాని రక్షణను అనుమానించుదమా? అట్లుకానేకాదు; అదికాదు ముఖ్యాంశము. రక్షింపబడితిమని నమ్మినయెడల తండ్రిని మరొక సాక్షిగా మనము కలిగియుండవలెను. రక్షణ పొందితిమని కేవలము మాటగా చెప్పుట చెల్లదు. చూడుము, ఆ దినములలో అనేకులు యేసును నమ్ముటకు ఆయన మాట మాత్రమే కారణము కాదుగాని, ప్రతి సమయమందు, స్థలము మరియు పరిస్థితులయందు ఆయన నిమిత్తము తండ్రి కూడ సాక్ష్యమిచ్చుటవలన వారు నమ్మిరి. మన రక్షణకు తండ్రిని సాక్షిగా కలిగియుండుట మనము రక్షింపబడితిమని మరియు ఆయన మనలను నడిపించుచున్నాడని పూర్ణ ధైర్యము నిచ్చును. అయితే, ఆయనను మనకు మరో సాక్షిగా ఎట్లు కనుగొందుము? ఇందుకు మార్గము ఆయన పిలుపును లేక వాగ్దానమును కలిగియుండుటయే. అబ్రాహాము, యాకోబు, దావీదు, మోషే మరియు సమస్త ప్రవక్తలు, ఇంకను యేసు శిష్యులు, పౌలు, ఆది క్రైస్తవులు అందరు దాని కలిగియుండిరి. ఇది విధానము. వారు ఆయన వాక్యమును వాగ్దానముతో కూడిన పిలుపుగా పొందిరి. తరువాత, ఆయన వారినిగూర్చి సాక్ష్యమియ్యసాగెను.
ఒకని రక్షణ విషయమై తండ్రి సాక్షి కానియెడల, వాడు లేక ఆమె రక్షణ పొందవలసి యున్నారు. రక్షణ పొందితిమని చెప్పుటకు వారు శరీరములో చేసిన కార్యములను చూపినయెడల, అది శరీరమువలనైన సాక్ష్యమే అగును; మరియు బాప్తిస్మము కూడ అట్టి క్రియే. తన రక్షణకు తండ్రియైన దేవుని సాక్ష్యముగా గలవాడు నిజముగా రూపాంతరము చెందినవాడు. రక్షింపబడితిమనుటకు రూపాంతరము సూచన; దేవుడు రూపాంతరము చెందినవారికి జీవితాంతము సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యమును కలిగియుండుట మన మేలుకే. మొదటిగా, అపవాదివలన మోసపోలేదని గ్రహింతుము. రెండు, నీతి మనలో పుట్టును. ఏలయనగా యేసును ఒకడు నమ్మినపుడు, అది నీతిని కలిగించును. నీతి ఆయనను ప్రభువుగా ఒప్పుకొనునట్లు బలవంతము చేయు నిజమైన రూపాంతరమునకు రుజువు. అయితే, నీతి వాక్యములోనుండి దేవుని విని, దానిని నమ్ముటవలన కలుగును; మనము వినునది వాగ్దానముతో కూడిన ఆయన పిలుపు అగును. ఈ కారణముబట్టియే అబ్రాహాము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెనని ఆత్మ చెప్పెను. మరియు అబ్రాహాము విశ్వసించు వారందరికి, అనగా సున్నతి పొందినవారికిని పొందనివారికిని తండ్రియని చెప్పబడెను. కావున, అబ్రాహామును నీతిమంతునిగా చేయుటకు దేవుడు ఎంచిన విధానము అందరికి వర్తించును.
ఒకడు నిజముగా రూపాంతరము చెందెనో లేదో తెలిసికొనుటకు పరిమాణము లుండెను.
- పని యొక్క నాణ్యత. కొరింధీ క్రైస్తవులకు పౌలు ఈలాగు చెప్పెను. “వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును“ (1 కొరి. 3:13). మనము చేయు పనుల యొక్క సంఖ్య లేక వాటిలోని వైవిధ్యములు ముఖ్యము కాదుగాని, వాటి నాణ్యతే ముఖ్యము. నాణ్యతకు మూలము దేవునినుండి క్రియలను కలిగియుండుట. మనమేమి చేసినను, అవి అగ్నిచేత పరీక్షింపబడునని పూర్ణముగా ఎరిగినయెడల, మన క్రియలు ఆ దినమున జరుగు పరీక్షలో నిలువవలెనని జాగ్రత్తపడుదుము. మన విశ్వాసము నీతిగా ఎంచబడనియెడల లేక నీతి సారమును మనము నిర్లక్ష్యము చేసినయెడల, మన క్రియలు అపవిత్రములతో నుండును. మన క్రియలు నాణ్యతతో కూడినవని చెప్పుటకు కారణము వాటికొరకు తండ్రి వాక్యమునుండి, ఆయన క్రియలు ద్వారా, మార్గములతోను సాక్ష్యమిచ్చుటయే.
- దైవభక్తి. ద్రోహులైనవారిని గూర్చి మాటలాడుచు పౌలు ఇట్లనెను. “పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖడవై యుండుము” (2 తిమో. 3:5). దైవభక్తి శక్తిగలది. దాని కలిగియుండుటనగా, మన గురించి సాక్ష్యమిచ్చు నిమ్మితము తండ్రి మనతో ఎకమయ్యెను. జ్ఞానముగల తాత్పర్యమేమనగా, దాని శక్తిని నిరాకరించినయెడల, మనలో అది లేకపోయెను. దాని అంగీకరించినయెడల, మన గురించి తండ్రి సాక్ష్యమిచ్చుట చూచెదము. అంటే, మనము నిజమైన రూపాంతరము గలవారమని ఆయన తన శక్తిని మనకొరకు ప్రత్యక్షపరచును. అప్పుడు, మన దైవభక్తి ఉండవలసిన రీతిలోనే ఉన్నది, అనగా దేవుని శక్తితో ఉన్నది.
- దేవుని ప్రేమ. “ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను“ (1 యోహా. 2:5). దేవుని ప్రేమను కలిగియుండుట నిజమైన రూపాంతరమునకు ఒక సూచన. ఒకరిని ఎంతవరకు ప్రేమించగలము లేక ఒకని ఎప్పుడు, ఏలాగున క్షమించగలము అనునది ప్రభువు వాక్యమును గైకొనుటవలన కలుగు లక్షణము. అలవాటుగా వాక్యములోనుండి ఆయన వినుచుండగా, ఇతరలను ప్రేమించుటకు లేక నిరాటంకముగా వారిని క్షమించుటకు ఆయన మనను నడిపించును. ఏలయనగా ఆయన పిలుపు మరియు వాగ్దానములు ఆయనవలె ఉండునట్లు మనలను రూపించును.
- పరిపక్వత. “మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికిని కర్తయైయున్నను బాలుడై యున్నంతకాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు“ (గల. 4:1). లోకము యొక్క బిడ్డగా ఉండుటనుండి క్రీస్తునందు పరిపక్వత చెందినవారమైతిమని మన రూపాంతరము తెలియజేయవలెను. లోకము యొక్క ప్రాధమిక అంశములను జయించితిమని దేవుని ఆశీర్వాదములు, వాగ్దానములు, ఆత్మవరములు, సూత్రములు సూచనగా ఉండును. ఒకని విశ్వాసము వానికి నీతిగా ఎంచబడనిదే వాడు దేవుని ఐశ్వర్యములను కలిగియుండలేడు.
- క్రీస్తును కలిసికొనుటకు ఆశ కలిగియుండుట. యేసు తన రాకడ ముందు ఇవి జరుగునని చెప్పెను. “మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును“ (లూకా. 21:25). ఆయనను కలిసికొనుట పై చెప్పబడినవి జరుగుననియు మరియు జరుగవలసి యున్నవనియు నమ్ముటవలన సాధ్యమగును. నామకార్ధ క్రైస్తవులు వాటిని నమ్మరు; బదులుగా, వాటిని అనుమానించెదరు. కాని, రూపాంతరము చెందినవారు ఆయన చెప్పినవాటిని బట్టి ఆయనను కలిసికొనుటకు ఎదురుచూచెదరు.
- స్వచ్ఛత. “అందుకాయన వారితో ఈలాగు చెప్పెను – ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది“ (మార్కు. 7:6). ప్రతివాడును తననుతాను విచారించుకొనగలడు. దేవుడు మన హృదయములను ఎరిగియున్నప్పటికీ, ఆయనయెడల మన ప్రవర్తన గూర్చి మన మనస్సాక్షి కూడ మనకు చెప్పును. ఒకని హృదయము ఆయనకు దూరముగా ఉన్నయెడల, ఆమె లేక వాడి విశ్వాసము కపటమైనది. వారి దృష్టి దేవుని మీద కంటెను మనుష్యుల ఉద్దేశములపైనను వారిపైనను ఉండును. వీరే అందరు రూపాంతరము చెందవలెనని దేవుడు నియమించిన విధానమును నిరాకరించువారు. అది వారి జీవిత శైలికి లేక వారు చేసిన నిర్ణయములకు సరిపడదు గనుక, దాని నిరాకరించెదరు. సాధారణముగా, ఇట్టివారే జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు, నిరర్ధకమైన తత్వ జ్ఞానముకు మరియు మనుష్యుల సిద్ధాంతములకు ఆతిధ్యమిచ్చెదరు.