(మనకు సహాయము చేయు ఒక్క కారణముబట్టే తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండెను)
లోతైన ఆసక్తితో యేసును వెదకుటకు బ్రహ్మాండమైన ఫలితములుండును. స్పష్టముగా, ఇది ఆయనతో అన్యోన్యతను కోరుచున్నది. నానావిధములైన అవసరములతో ఆవేదనలతో బాధపడుచున్న ప్రజలను నేను సహజముగా ఎదుర్కొందును. ప్రభువుతో అన్యోన్య సహవాసము వారికి ఫలితమిచ్చునని నేను వివరించినప్పుడు, వారు అదే చేయుచున్నామని వెంటనే చెప్పుదురు. అయినను అనారోగ్యమువలన కలుగు వారి నిత్యదుఃఖములను, లోటును వారు వివరించుట మానరు. ఆయనతో అన్యోన్యత కలిగియుండి నిరుత్సాహమును అసంతృప్తిని కలిగియుండుట ఆసంభవము, అవి జతగా ఉండనేరవు. ఎందుకనగా ఆయన మన బాగుకొరకు ప్రయాసపడుచు కార్యమును జరిగించువాడు. మనకు సహాయము చేయు ఒక్క కారణముబట్టే సమస్త అధికారమును, శక్తిని, ఏలు విధానమును దయచేయు తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండెను.
యేసు మనకు చాలును. ఆయనయందు సమస్తము నెరవేరును. భూమిపై జీవించిన యేసు, ప్రస్తుతము పరలోకమందున్న యేసు ఒకటేననియు, ఒకే పనిరీతి మరియు తత్వము కలిగియుండెననియు మనుష్యులు తరచు మరతురు. ఆయన ఇప్పుడు పరమందుండెను కాబట్టి భూమిపై ఉన్నప్పటికంటే ఆయన వేరుగా పనిచేయునని, వేరుగా ఉండునని అర్ధమియ్యదు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఒకేరీతిగా ఉండెనని హెబ్రీ గ్రంధకర్త నొక్కిచెప్పుట జ్ఞాపకమున్నదా? ఒక విశ్వాసియైనను, మరి ఎవరైనను శరీరములో ఉన్న ఆయనయొద్దకు వెళ్లినవారివలె ఆయనయొద్దకు వెళ్లవచ్చును. వారు ఆయనకు మొఱ్ఱపెట్టవచ్చును మరియు ఆయనను ముట్టి పొందినవారివలె విశ్వాసము ద్వారా వీరును ఆయననుండి పొందవచ్చును. ఇదీ ఆయన నిశ్చలత్వము. ఇది తెలియుట గొప్ప సంగతి. ఎందుకనగా ఇది జీవితమునకు నిత్యమైన ధైర్యమును బలమును దయచేయును. ఆయన ఏమైయుండునో, ఏమి కోరుచుండునో వాటినిబట్టి నీవు ఆయనను వెదకి, వెంబడించిన యెడల, ఆయన నీకు సమస్తమును చేయును. “బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను” (మత్త. 19:2).
రక్షించు సువార్తయందును, ఒకని క్రీస్తుతో అన్యోన్య సహవాసమునకును నడిపించు సువార్తయందు నిమగ్నమగుటకంటె అనేకులు స్వస్థతలు, మహత్కార్యములు చేయుటలో చొరవ చూపుచుండిరి. ఫలితముగా, అనేకులు మోసపరచబడుచుండిరి. దైవికమైన సహాయమునకై అపవిత్రమైన విశ్వాసమును వెంబడింపరాదని గ్రహించుటలో ప్రజలు విఫలమగుచున్నారు. వీరు వారిని వెంబడింపవచ్చును. ఎప్పుడనగా, వారు (చొరవ చూపువారు) వాస్తవముగా ఆయనతో అన్యోన్యత కలిగి, ఆయననుండి పొందినప్పుడు పొరపాటుపడవద్దు. నీవు క్రీస్తుతో అన్యోన్యముగా ఉంది, తమ క్రియల విషయమై పశ్చాత్తాపము పొంది క్రీస్తును అంగీకరించుచు సహాయము కోరిన వారికై ప్రార్ధించినప్పుడు, నిశ్చయముగా ఆయన వారికొరకు కార్యము చేయును. పై వచనమును ఆలోచించుడి. జనసమూహములు ఆయనను వెంబడించెను మరియు ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. ఆయన కోరినట్టుగానే వారు ఆయనను వెంబడించిరి, అంటే ఆయనను మాత్రమే నమ్మిరి. ఇది ఆయన ఎటువంటివాడో యెరిగి చేసిరి. స్వస్థత కొరకు ఆయనను వెంబడించినవారు ఆహారముకై ఆయనను వెంబడించినవారికి అతీతులై యుండిరి. వెనకటివారు దురాశపరులు కాగా మొదటివారు నిజమైన అవసరతలో ఉన్నవారు. నిజమైన అవసరతలో ఉన్నవాడు యేసుని వెంబడించుట యధార్ధమైనది, న్యాయమైనది. నీవు వానివలె చేయుచు పొందవచ్చును, స్వస్థపరచబడవచ్చును లేక రక్షింపబడవచ్చును. ఆయన ఖచ్చితముగా చేయును. అయితే కొన్ని సందర్భములో బాధించుదానిని భరించునట్లు ఆయన అధిక కృపను దయచేయును.
యేసును వెదకుటకు చేయునవి, చేయరానివి ఉన్నవి. నీవు ధనపరముగా ఇచ్చువాటితో దానికి ఎంత మాత్రము సంబంధము లేదు. ద్రవ్యరూపములో ఇచ్చునవి ఎల్లప్పుడు ఆత్మయందు ఇచ్చువాటికి అసమానమై యుండును. ఆయన చెప్పునది చూడుము. “అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది” (లూకా 11:42). ప్రతి దానిలోను పదియవవంతు ఇచ్చుట ఆయనను వెండించుట అని అనుకొనకుడి. వాటిని లక్ష్యపెట్టు అవసరము ఆయనకు లేదు. ఆయనను వెంబడించుటనగా, న్యాయమును దేవుని ప్రేమను లక్ష్యపెట్టుట. ఆయనవలె ఒకడు అన్ని విషయములలోను న్యాయముగా ఉండవలెను. ఇది దేవుని నియమము గ్రహించి దానిని అనువర్తించుటను కోరును. దేవుని ప్రేమను ప్రతివాడు లక్ష్యపెట్టవలెను. ఎట్టి పరిస్థితిలోనైనను ప్రతివాడును దానిని ఆయనవలె వీక్షింపవలెను. ఒకడు కోపమును, శిక్షను అమలుపరచవచ్చును గాని అంతము ప్రేమగునట్లు వాటికి సాధనము దేవుని ప్రేమ కావలెను. అంటే, కోపము మరియు శిక్ష అనునని ప్రేమను కొట్టివేయరాదు.
యేసుని వెంబడించుటకుగాను రెండవ సూత్రము ఆయనను శ్రద్దగా ఆలకించుట, అనగా విధేయత కలిగియుండుట. “మోషే యిట్లనెను- ప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమిచెప్పినను అన్నివిషయములలో మీరాయన మాట వినవలెను” (అపొ.కా. 3:22). ఇప్పుడు మనము యేసు అను గొప్ప వ్యక్తితో మిగిలియున్నాము. ఎవడైనను పొందగోరినను, స్వస్థపరచబడగోరినను లేక ప్రమాదకరమైన పరిస్థితినుండి రక్షింపబడగోరినను, వాడు విధేయత అను క్రియలో నిలిచియుండవలెను. నీవు అవిధేయతలో ఉన్నయెడల, నీ తప్పిదములు ఒప్పుకొనుచు మొదటిగా విధేయతలోనికి రావలెను. అవిధేయతను విసర్జించువరకు యేసు నీ ప్రాణమును కాపాడవచ్చును గాని, దానిలో నుండగా ఆయన నిన్ను స్వస్థపరచడు. ఇంకను కొన్నిసార్లు ఆయన నీనుండి ప్రత్యేకముగా ఆశించిన ప్రకారము నీ భుజములపై భారమును మోయవలసి యుండును. ఇది కూడా ఆయన మాట వినుటయే. నీవాయనతో అన్యోన్యముగా ఉండదలచిన యెడల ఆయన తన తత్వము నుండి, వాక్యము మరియు కార్యములనుండి నిన్ను నడిపించు అనేకమైన వాటిని నీవంగీకరింపవలెను.
అనేకులు మరచిపోవునది, లక్ష్యపెట్టనిది లేక నిరాకరించునదేమనగా యేసుకు విన్నవించుట. ఆయన కేవలము మనుష్యుడని చెప్పుచు దేవుని కుమారునిగా ఆయనను నిరాకరించువారు కొందరు కలరు. ఆయన దేవుని కుమారుడని చెప్పుచు ఆయనను ఆరాధింపరాదని చెప్పువారు కూడా ఉందురు. ఇట్టి వ్యాఖ్యలకు ఫలితమగు తీవ్ర పరిణామములను వారికి చూపించు నిమిత్తము దేవుడు వారిని కొంతకాలము భరించును. అయితే, పరిశుద్ధపరచబడినవారివలె తప్ప నీవట్టివారివలె ఉండరాదు. ” కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించు వారికందరికిని (మూ.భా. యేసుక్రీస్తునకు మొఱ్ఱపెట్టువారందరికి) శుభమని చెప్పి వ్రాయునది” (1 కొరి. 1:2). దేవుని పిలుపునుబట్టి ఒకడు పరిశుద్దుడైన యెడల, వాడు నిశ్చయముగా ప్రభువుకు మొఱ్ఱపెట్టును. ఇది ఆయనను వెంబడించుటకు సూచన మరియు ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయనను వెంబడించి పొందినవారివలె పొందుటకు మూలము. పౌలు “వారికిని మనకును ప్రభువు” అని చెప్పినప్పుడు, తాను తన తోటివారు దాని చేసిరని స్పష్టమగుచున్నది. క్రీస్తు మాటను ఆలకించుట నడుమ దానియందు సఫలమగుట ఉన్నది. అప్పుడే విధేయత సాధనము చేయబడుచున్నదని అర్ధము. ఒకడు వాక్యములోని వివరములపట్ల శ్రద్ద చూపవచ్చును దానిని సరిగా జరిగించకుండును. ఆత్మయందు పౌలు సరిగా ఎలాగు జరిగింపబడునో చూపించెను. “మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు పర్యంతము, నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను” (1 తిమో . 6:14). ఆజ్ఞ పరిశుద్ధముగా గైకొనబడనిచో ప్రభువును సంతోషపరచుట అసాధ్యము. సంఘమునకు వెళ్లు చాలామంది దానిని చేయరు. ఆజ్ఞ ఒకడు ఎప్పుడు అపవిత్రపరచుననగా, యేసుకన్నా వాని ఆశలు పెద్దవిగాను ముఖ్యముగాను ఉన్నప్పుడే. అప్పుడు వాడు తన మనసు మాటను, తన ఆలోచనలకు అనుసంధానముగా ఉండు మనుష్యులను ఆలకించును. ఇందుచేతనే అనేకులు యేసునుండి స్వస్థత పొందలేకున్నారు. అపవిత్రమైన విధేయతతో ఎవడును ఆయనతో అన్యోన్యత కలిగియుండలేడు. ఇందువలన, వారు సహాయమునకై ఆయనను వెదకినను, దాని కనుగొనరు; విశ్వాసలోపము మరియు ఆయనయందు బహుతక్కువైన ధైర్యము ప్రాధాన్యత కలిగియుండును. దీనివలన మిక్కిలి చేటైన ఫలితమేమనగా, ఆయన ఇదివరకటివలె స్వస్థతలు చేయడని నిర్ధారించుట. అప్పటినుంచి దేవుని ఉగ్రతకు తెరతీయు యేసుకు విరోధమైన మాటలను, ఆయన సహజత్వమునకు విరోధమైన మాటలను పలుకసాగెదరు. దేవుడు వారిపై సమస్త శ్రమలను కురిపించును.
కానీ, నీవు ఆయనతో అన్యోన్యముగా ఉన్నయెడల, నీకాయన నిత్యదయ ఉండును. నిన్ను బాధించు సమస్తము నుండి బయటకు వచ్చెదవు. ఇంకను, తన పని నిమిత్తమై ఆయన ఆలాగు జరిగించును. “దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమఅంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు” (2 కొరి. 1:4). క్రీస్తునందున్న మన దేవుడు తనయందు పూర్ణనమ్మిక యుంచువారందరికి సహాయము చేయుటకై బహుశక్తిమంతుడని నీవు, నేను ప్రచురించగలము.