ఎన్నికచేయబడినవారమై

నీ విషయమై శ్రమనుండి గాని, ఒక సంగతినుండి గాని, విడుదల నిలిచిపోయెనని అనుకొనుచున్నావా? నీవు ఏలాగు ఆలోచన చేసినను, ఎంత వేదన నొందినను ముందుకు సాగలేకపోవుచున్నానని లేక జయింపలేకున్నానని అనుకొనుచున్నావా? విధేయతను, విశ్వాస్యతను, నీతిని కనుపరచుచుంటివి గాని, నీవు ఎదుర్కొనిన పరిస్థితిలో ముందుకు వెళ్లలేకయున్నావు. దేవుని నీ ఆలోచనకర్త గాను, ఆశ్రయముగాను చేసికొనియున్నావు మరియు విడుదల లేకపోవుటవలన నీ సమయమును ఆనందమును నష్టపోవుచున్నావు. నీవు ఈ విధముగా భావించుచున్నావా? కాని, దీనంతటిలో ఒకవేళ దేవుని హస్తమున్నదేమోనని ఆలోచన చేసితివా? కొన్నిసార్లు దేవునియందు కనిపెట్టు సమయము లుండును, అయినను పరిస్థితులకు ముగింపు ఆలస్యమగును; దేవుడు మన చెంత నుండుట చూచెదము గాని, సమస్యల పరిష్కారమై పురోగతి కనబడదు. యెరూషలేములో తననుగూర్చి సాక్ష్యమిచ్చినట్టుగానే రోమాలో కూడ ఇయ్యవలెనని పౌలుతో యేసు చెప్పెను. అయినను, కొన్ని సంవత్సరములు మరియు శ్రమలు తరువాత పౌలుకు అది సాధ్యపడెను. మనకు చెందిన సమస్త విషయములయందు దేవుని హస్తముండును. మరియు ఇందువలననే విడుదలయు ముందుకు కొనసాగుటయు నిలిచిపోయెనని భావించెదము. దీని అర్ధము ఈ వాక్యమునుబట్టి కనబడుచున్నది. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను (నిర్గ. 7:3).

జ్ఞాపకముంచుకొనుము, మనము కేవలము పిలువబడలేదు, ఎన్నిక చేయబడితిమి కూడ. ఎన్నికచేయబడుట మాత్రమే కాదు గాని, ఒక ఉద్దేశము నిమిత్తము ఎన్నికచేయబడితిమి. ఇదంతయు ఇశ్రాయేలు విషయమై సత్యము. దేవుడు వారియెడల ఉద్దేశము కలిగియుండెను. అది యేసు ఈ భూమిపై తన పరిచర్య మొదలుపెట్టిన దినమునుండి ఆయనను తమ స్వంత రక్షకునిగా అంగీకరించు వారందరి ద్వారా తెలియవచ్చుచున్నది. ఇశ్రాయేలు శ్రమలలో దేవుని హస్తముండెను. ఫరో హృదయమును కఠినపరచుటలో ఆయన హస్తముండెను మరియు అది స్వల్ప పరిణామముకై కాకపోయెను. ఆయన తనను ఇశ్రాయేలీయులకును ఐగుప్తీయులకును కనుపరచుకొనెను. ఆయన తప్ప వేరే దేవుడు లేడని లోకము తెలిసికొనునట్లు తన కార్యముల ద్వారా గొప్ప తీర్పులను దయచేసెను. మరియు దీనంతటిలో విడుదల, పురోగతి, ఆనందము ఇశ్రాయేలుకు నిలిచిపోయెను. కొన్నిసార్లు పరిస్థితులను గాని, మనుష్యులను గాని, మనము అనుకున్న వ్యవధికన్న ఎక్కువ కాలము మనకు విరోధముగా నిలుచునట్లు దేవుడు చేయును. ఆయన మనకొరకు ఒక ఆలోచన కలిగి ఆలాగు చేయును. అది కచ్చితముగా మనకొరకును మనద్వారాను ఆయన ఎంచిన పరిణామముకై యుండును; ఆ పరిణామము ఏవిధముగానైనను స్వల్పమైనది కాదు. వాస్తవముగా, మనము దానిని అర్ధముచేసికొనుట మొదలుపెట్టినపుడు ఊహించిన దానికంటెను ఆలోచించిన దానికంటెను మరిఎక్కువగా మన కన్నులతో వీక్షించెదము.

దేవుని చేత ఎన్నికచేయబడినవారమై యుండగా, మనలను వాడుకొనవలెనని ఆయన ఉద్దేశించును. ఇందు నిమిత్తము కూడ విడుదల, పురోగతి, సంతోషము కొంతకాలము నిలిచిపోవుట కనుగొందుము. ఇట్టి సమయములలో ఆయన మనలను విడిచిపెట్టెనని తలంచుట సాధారణమైనప్పటికీ, అట్లు తలంచరాదు. అట్టి భావముకు కారణము మనలో కట్టబడుచున్న కలవరము, బాధవలనై యుండును. ఆయనయందు నిరీక్షించుచుండగా, మనమాయనను ఎరిగిన దానికంటె శ్రేష్టము గాను లోతుగాను ఎరునట్లు ఆయన సూచక క్రియలను, అద్భుతములు చేయును. ఏలయనగా ఆయన ఎన్నికచేసిన వారిపట్ల ఆయన ఉద్దేశమును చూడుము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును (ద్వితీ. 7:13). ఇందునిమిత్తమే ఆయన ముందుగా ఫరో హృదయమును కఠినపరచెను. ఇశ్రాయేలు నిత్యము తన పిల్లలుగా నిలిచిపోవుటకై ఆయన దానిని ఆలోచన చేసెను. ఇశ్రాయేలు తన దేవుని, వారియెడల ఆయన కున్న ఆసక్తిని, ప్రేమను, మంచితనమును తెలిసికొనిరి.

తమ జీవితములో ముందుకు కొనసాగకపోవుటచేత మనుష్యలు అనేకమార్లు కృంగిపోవుదురు. విడుదల ఆలస్యమైనపుడు అంతయు నష్టపోయితిమని బెంగపడుదురు. కాని, దేవునియందు నమ్మిక యుంచువాడును ఆయన వాగ్దానమందు నిరీక్షించువాడును ఆలస్యమువలన కలుగు ఫలితముకై ఎదురుచూడును. వాస్తవముగా, సమయము నష్టపోవుట అనునది దేవుని హస్తమువలన సమయము పెట్టుబడి చేయుటగును. ఒక కచ్చితమైన కాలమున ఆయన సమస్తమును మనకు అనుకూలముగా చేయును. దీనిని గ్రహించుట మనకు ధైర్యమును సంతోషమును ఇచ్చినను, ఆయన మననుండి కోరువాటిని కూడ ఆలోచన చేయవలసి యున్నాము. జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును కెమోషు అను మోయాబీయుల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రియైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక (1 రాజు. 11:33). దేవుని హస్తమువలన సంతోషముగా ఉండు ఆలోచనను ఎన్నడును విడిచిపెట్టవద్దు. అప్పుడు, ఇశ్రాయేలు దేవునికి కోపము పుట్టించునట్లు చేసినవాటిని చేయకుందుము. మన నీతి, విధేయత, విశ్వాస్యత ఆయనవలన నిరూపింపబడుచున్నయెడల, విడుదల ఆలస్యమైనపుడు లేక జీవితములో ముందుకు సాగనపుడు, మనము కలవరపడ నవసరము లేదు; ఏలయనగా అది మన అవిధేయత యొక్క ఫలితము కాదుగాని, దేవుడు మనయెడలను మనద్వారాను కలిగియున్న ఉద్దేశము వలననే.

మనము దేవుని ఎన్నికై యున్నామని రుజువుపరచుటకై, విడుదల, పురోగతి మరియు విశ్రాంతి అవకాశములు కాదని, అవి ఆవశ్యకమని చెప్పు కొన్నిటిని ఆలోచన చేయుదము.

  1. దేవుడు కార్యము చేయును. “బాధపడువారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులనుబట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను (విడుదలను) కోరుకొనువారికి నేను రక్షణ (విడుదల) కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు (కీర్త. 12:5). అవసరతలలో ఉన్నప్పుడు ప్రవర్తించవలసిన రీతిలో మనము ప్రవర్తించము. దీనిని దేవుడు అర్ధముచేసికొనును. ఆలస్యములవలన మనమెదుర్కొను శ్రమను ఆయన చూచును. ఆయన మన మొర ఆలకించుటలేదని కాదు. మనకొరకును తన కొరకును ఆయన సమయమును నిర్దేశించియున్నాడు. మనము ఆశించిన పరిస్థితికి చేరునట్లు అవసరమైన కార్యములన్నిటిని ఆయన చేయును. నేనూ ఒక ఆలోచన కలిగియున్నవానిగా చెప్పెదను – ఆయన ముందర మొరపెట్టుట మానకుము. అదే ఆయన లేచి, మనకు సహాయము చేయుటకు కారణము. ఆయన ముందర ఏడ్చువాడు ఆలస్యమువలన కలుగు బాధను ఇముడ్చుకొనియున్నాడు. దేవుడు వాని జీవితములో ఆశ్చర్యముగా పనిచేయును. ఆయన ఈలాగు చెప్పెను – … నేను తప్ప రక్షకుడును లేడు (హోషే. 13:4).
  2. విశ్వాసములో ఉండవలెను. అప్పుడాయన – మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి – ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి (లూకా 8:25). ఇశ్రాయేలుకు అద్భుతములు, సూచక క్రియలు చేసిన దేవుడే తన శిష్యులకు కూడ వాటిని చేసెను. నీవు, నేను మనతో మాటలాడిన వాక్యము ద్వారా ఎన్నిక చేయబడిన ఆయన శిష్యులము. మన కష్ట పరిస్థితులను లేక మనకు విరోధముగా నిలిచినవారిని ఆయన ఏలాగు తప్పించునో తెలియనప్పటికీ, ఆయన మన పక్షముగా పనిచేయుననిన విశ్వాసమును కోల్పోరాదు. ఆయన సృష్టిలో నుండు శక్తులపై సహితము అధికారము చేయు దేవుడు. గాలి, నీటిపొంగు శిష్యులపై భయంకరముగా పడినపుడు, వారికి ఏమి చేయవలెనో తోచలేదు. యేసు ఏమి చేయగలడో వారికి తెలియలేదు. కాని, వారాయనకు మొరపెట్టగా తెలిసికొనిరి. మరియు వారివలన ఆయన ఏమి చేయగలడో మనము ముందుగానే ఎరిగియుంటిమి. కాబట్టి, విశ్వాసముతో నుండుము. ఆయన విడుదల నిచ్చును. మనము ముందుకు సాగిపోవుదుము.
  3. దేవుడు మనయెడల దయచూపించును. ఎవరును మన పక్షముగా ఉండని సమయములలో ఆయన మనయెడల దయ చూపించును. ఈ సంగతిని పౌలు ఆయన చేసిన అద్భుతములు సూచక క్రియలతోపాటు సత్యమని కనుగొనెను. లూకా ఈలాగు చెప్పెను – అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి – ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి (అపొ. 23:9). మృతుల పునరుత్థానముకు చెందిన నిరీక్షణ గూర్చి పౌలు చెప్పిన మాట ప్రకారము పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య వాదము తటస్థించినపుడు, పౌలు విషయమై సహస్రాధిపతి భయపడి, అతనిని సురక్షిత ప్రదేశమునకు తీసికొనిపోయెను. పౌలు సత్యము మాటలాడెను, దేవుడు కాపాడు క్రియను చేసెను. పౌలు యందున్న దేవుని జ్ఞానము మనుష్యుల తెలివితేటలు కంటె ఉత్తమమని రుజువయ్యెను. ఒక్క గుంపుగా పౌలును చంపుటకు వచ్చినవారు రెండు గుంపులుగా చీలి తిరిగి వెళ్లిరి. తుదకు వారందరిని దాటుకొని పౌలు రోమా పట్టణమును చేరెను.
Posted in Telugu Library.