క్రీస్తునందు రూపాంతరము

దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మునికి అజేయమైన ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై నున్నపుడు మానవులకు యేసు ఏమైతే ప్రత్యక్షపరచెనో పరలోకమునుండి అందరికి అవే ప్రత్యక్షపరచును. అది పరిశుద్ధాత్మలో చేయును. మానవులలో సమాధానము కలుగునట్లు ఆయన దేవుని స్వరూపమును, శక్తిని దయచేయును. దేవుని రూపమైన ఆయన ఆత్మద్వారా మానవులకు రక్షణ అనుగ్రహించును. నిత్యజీవము పరిశుద్ధతను కోరును మరియు ఆత్మను కలిగినవారు దానిని కలిగియుందురు. పరిశుద్ధత దేవుని స్వరూపము మరియు ఆత్మ దానిని కాపాడును. కాబట్టి, క్రీస్తునందు రూపాంతరము చెందిన విశ్వాసులు అంధకార సంబంధమైన అధికారములోనుండి ఆయన రాజ్యనివాసులుగా చేయబడిరని ఒకచోట చెప్పబడెను. వారు సమాధానమును పొందిరి. ఇందు నిమిత్తము ఆయన రాజ్యము ఎల్లప్పుడు నిలుచునట్లు దేవుడు ఆత్మను నమ్మువారికి దయచేసెను. మరియు ఆయన సేవకుడు ప్రేరేపింపబడి నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను” (మార్కు. 1:8).

నిస్సందేహముగా, బాప్తిస్మమిచ్చుటకు యేసుకు అధికారముండెను. భూమిపై నున్నపుడు తనను పూర్ణముగా నమ్మినవారికి ఆత్మను ఇచ్చినట్లుగానే ఇప్పుడు నమ్మువారికి ఇచ్చును. ఏ మానవుడైనను, దూతయైనను చేయని అనేకమైనవాటిని యేసు భూమిపై నున్నపుడు చేసెను. మరియు, మనకు మొదటిగా గుర్తుకువచ్చునది మన పాపములకై ఆయన సిలువపై పొందిన మరణము. తరువాత, నిత్యజీవముకు నిరీక్షణ కలుగజేయు మరణమునుండి ఆయన పునరుత్థానము. నిత్యజీవము కొరకైన పాపక్షమాపణ పరిశుద్ధతవలన సూచించబడును. కాని, ఇది ఈలాగు జరుగుటకు దేవునికి చెందిన ఒక కచ్చితమైన కార్యమును యేసు చేయవలసివచ్చెను. కావున, బోధతోను క్రియలతోను దేవుని రాజ్యమును ఆయన బయలుపరచెను. ఇది మనము ఎరిగియున్నాము. ఇది యేసు ద్వారా మానవులకు ఎంతగానో అవసరమైన దేవుని కరుణై యుండెను. మానవులలో పరిశుద్ధతకు ఆయన కరుణ మూలము. మరియు వారు విశ్వాసమును, జ్ఞానమును, దేవుని క్రియల వివరమును, ఆయన చిత్తమును తెలిసికొనిరి.

దేవుని రాజ్యమును బయలుపరచి తాను వెళ్లిపోవు సమయము వచ్చినపుడు తాను చెప్పిన వాటన్నిటిని జ్ఞాపకము చేయుటకు, బోధించుటకు తండ్రి పంపు ఆత్మనుగూర్చి చెప్పెను; ఆయన ఆత్మ యొక్క ప్రాముఖ్యతను దయచేసెను. కాబట్టి, మానవులు దేవుని కొరకు పరిశుద్ధులుగా జీవించుట జరుగుచుండెను. మానవులలో ఆత్మ ఉనికి దేవుని మహిమపరచును. శిష్యులు యేసుచేత బోధింపబడి, మనయొద్ద వాక్యమున్నయెడల దేవునినుండి మరియొక ఆధరణకర్త అవసరమేమీ? అది సమస్త పాపమునుండి, అవిశ్వాసులనుండి మనలను వేరుచేయు యేసును దయచేయుటకై యుండెను. ఆయనే శిష్యులను నడిపించెను. వారిద్వారా మనకు వాక్యము నిచ్చెను. మరియు, ఆయన ఆత్మలో ఉండును గనుక, వారాయనను తెలిసికొనినట్లుగానే మనము కూడ తెలిసికొందుము. యేసును దయచేయుట ద్వారా నమ్మువారందరికి దేవుడు నిత్యజీవమును సాధ్యము చేసెను. ఆయన శరీరములో లేకపోవుట నమ్మువారికి నష్టము కాదుగాని, సంతోషము. ఎందుకనగా, ఆత్మయందు పరిశుద్ధపరచుట, సహాయము చేయుట మరియు పోషించుట ఆయన కొనసాగించుచుండెను. కాబట్టి, దేవుని వాక్యము శిష్యులను, విశ్వాసులను మరియు సంఘము యొక్క సమస్త ప్రభుత్వమును కలిగించుచుండెను. ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను – నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను (అపొ. 2:25).

దేవుని పనిరీతి ఎంత అద్భుతమైనది! శరీరమందు జీవించిన యేసుతో మనము ఉండదలచినయెడల, ఆయనతో మాటలాడదలచినయెడల, ఆయననుండి పొంది, ఆయనకు ప్రార్ధించదలచినయెడల, మనకు ప్రత్యక్షమగుటకు, మన ప్రక్కన ఉండుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇది ఆత్మద్వారా జరుగును. విశ్వాసము ద్వారా మనలోనికి ప్రవహించు ఆయన శక్తి సమాధానము నిచ్చును గనుక మనమాయనను చూచెదము. ఇదే కారణమునుబట్టి ప్రభువును చూడకపోయినను ఆయన తనయెదుట నిత్యము ఉండుట దావీదు ఎరిగెను; ఇంకను అనేకులు ఇది ఏలాగు జరుగును అని యోచింతురు. నమ్మువారికి తన ప్రత్యక్షత అగత్యమని ఎరిగిన యేసు ముందుగానే తన ప్రత్యక్షతను తెలియజేయు ఆత్మనుగూర్చి చెప్పెను. ఇది సత్యమని మనము ఎంచెదము. ఎందుకనగా, వాగ్దాన పూర్వకముగా “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని చెప్పెను.” ఆయన ప్రత్యక్షత భయమును, నిరుత్సాహమును, తృనీకరణను జయించుటకు బలమును తెచ్చిపెట్టును. మనము (తల్లి) తండ్రియైనను, సేవకులమైనను లేక కేవలము విశ్వాసులమైనను మన విధులను నీతిగా జరిగించుటకు మొదటిగా క్రీస్తునందు భయము లేనివారమగువలెను. అనగా, ఆయన సమాధానమును పొందవలెను. అప్పుడు, మనము ఆయనయందు భక్తులము. కాబట్టి, మనము ఈలాగున జ్ఞాపకము చేయబడితిమి – ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసినయెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు (1 కొరి. 3:17).

మీరు పొందిన విశ్వాసమును నిర్లక్ష్యము చేయకుండ చూచుకొనుడి. ఏలయనగా దేవుని సంబంధమైన విశ్వాసము మీరు యేసుక్రీస్తు సన్నిధిని పొందుటకు ఆత్మను దయచేయును; మీరు ఆయన బలమును చూచెదరు. దేవుడు మీకొరకు ఆశించిన వన్నిటిని యేసు మీకు తెలియజేయును. ఈ కారణమునుబట్టే బాప్తిస్మమిచ్చు యోహాను యేసు బాప్తిస్మమును తన బాప్తిస్మముకంటె ఎక్కువగా హెచ్చించెను. ఆత్మలోనుండు యేసు పరిచర్య ఎల్లప్పుడు జయింప శక్యముగాని మహిమతో ఉండును; ఏదియు దాని యెదుట నిలువలేదు. శక్తిలో మనయెడల ఆయన దేవునికి చేయు పరిచర్యను జరిగించును గనుక, ఆయనను నమ్మిన మనము ఆయన కొరకు మన పరిచర్యను చేయుదుము. మన పరిచర్య ఏమనగా దేవునికి పరిశుద్ధులుగా ఉండి, ఆయన విశ్రాంతి నిలయముగా ఉండుటయే. ఇది మనకు సంతోషము కలుగునట్లు ఆయన ఉద్దేశమును, ఆశీర్వాదములను అనుగ్రహించును. నిశ్చయముగా, మనకు విరోధముగా ఆయుధములు ఉండును గాని, దేవుని విశ్రాంతి నిలయము యెదుట అవి వర్ధిల్లవు. అయితే, వాటికి నడిపించునట్లు మనము అనుమతిచ్చిన యెడల మనము కనుగొనినదానిని పోగొట్టుకొందుము. ఏలయనగా, దేవుని మహిమకై యేసుచేత సిద్ధపరచబడిన మనలను పడగొట్టుటకు వాటికి శక్తి యుండెను. అప్పుడు, ఫలితము ఇంతకుముందు పౌలు చెప్పినట్లుగా అనివార్యమగును. ఎవడైనను చక్కటి మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను (కొలొ. 2:4).

దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే మరియు ఆత్మ ఒక్కడే. వారు ఏకమైయున్నారు. ఇందువలన దేవుడు జగత్ పునాది వేయకమునుపే నిశ్చయించిన పనులను వారు చేయుదురు. ఇశ్రాయేలుకు దేవుడు ప్రభువుగా కనపరచుకొనెను, యేసు మానవులకు ఇమ్మానుయేలుగా (అనగా దేవుడు మనకు తోడని) కనపరచుకొని, మనకు ప్రభువు అయ్యెను. దేవుడు ఆత్మ అని యేసు తెలియజేసెను. ఇంకను, ఆత్మను దూషించుట క్షమాపణలేని పాపమని ఆయన చెప్పెను. పరిశుద్ధాత్ముడు దేవుని వర్ణించును, ఎందుకనగా దేవుడు సమస్తమును ఆయనలో చేయును. అయితే, అనేకులు వారి విషయమై అల్లరి చేయుచు, బుద్ధిహీనతతో వారిని వినువారిని భ్రమపరచుచున్నారు. అట్టివారినిబట్టి మీరు జాగ్రత్తపడవలెను. ఏలయనగా వారు చెడిపోయిన జ్ఞానముచేత చక్కటి మాటలను వినిపింతురు. అట్టి జ్ఞానముకు మిమ్మును మోసపరచు శక్తి ఉండును. కాని, మీరు క్రీస్తుచేత బాప్తిస్మము పొందినయెడల మీరు పరిశుద్ధాత్ముడను కలిగియుండిరి; మీయొద్ద దేవుడు ఉండును. అప్పుడు, ఏ ఆయుధమైనను మిమ్మును జయించదు. ఆయన మీకు బోధించి, దయచేసి మరియు ఓడింప శక్యముగాని శక్తితో మిమ్మును కాపాడును. ఏ సమయమందైనను మీరు నిరాయుధులుగా ఉండుట కనుగొనరు.

ప్రభువు మీ ప్రక్కన ఉండుట మీకు లాభము. మీకొరకైన దేవుని ఆలోచనలను తెలిసికొందురు. అప్పుడు, చెడు మాటలాడుటను, మోసమును లేక చెడు జ్ఞానమును మీరు నిరాకరింతురు. మంచి దినములను చూచెదరు. ఏలయనగా దేవుని ఆజ్ఞను మీరు నెరవేర్చిరి – అతడు కీడునుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను (1 పేతు. 3:11). ఇది జీవమును ప్రేమించుట. మిమ్మును మోసము చేయుటకు యత్నించువారికి అది ఆటంకమై యున్నది. అది యేసును మీచెంత నుంచును. మోసముచేత మిమ్మును ఒప్పించుటకు యత్నించువారు మీయెదుట సమస్త శక్తిని కోల్పోవుదురు. ఏలయనగా దేవుని ఆజ్ఞ వారు ఊహించిన దానికంటె మరిఎక్కువ ఫలితమును మీయందు కలిగించెనని వారికి తెలియకుండెను. అది మిమ్మును ఆయన కొరకు పరిశుద్ధులుగా చేసెను. ప్రభువు మీచెంత నుండుట మీరు చూడునట్లు చేయును. అది మీ విశ్వాసమునకు అద్భుతమైన పరిణామమును, అనగా దేవునితో అన్యోన్యతను దయచేసెను. మీరు జ్ఞానమును, క్రియలను, బుద్ధిని, ఆలోచనను, ఆశీర్వాదములను పొందెదరు. మేలు చేయుట మీకు నేర్పింపబడును. తనకు ఉపయోగకరముగా ఉండునట్లు దేవుడు మిమ్మును నడిపించును.

అనేకులు పరిశుద్ధాత్ముని ప్రాముఖ్యతను గ్రహించరు. ఆయననుగూర్చి వివరించుటకు వారు నానామార్గములలో పోయిరి. కాని, యేసు మానవులను పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చుటకు ప్రధమమైన, ముఖ్యమైన కారణము దేవుని వరమును వారిలో స్థిరపరచుటకై యుండెను. అది సమాధానము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది – పరిశుద్ధాత్మను పొందుడి అనెను (యోహా. 20:22). ఇందు నిమిత్తము ఆయన వచ్చెను మరియు ఆయనను దేవుని కుమారునిగా నమ్మిన వారందరు సమాధానమును పొందెదరు. సిలువపై ఆయన మరణము మానవులకు, దేవునికి మధ్య సమాధానముకై యుండెను. దానిని పరిశుద్ధాత్ముడను దయచేయుట ద్వారా మనకు ఇచ్చును. అది మనలను లోకములో నున్న సమస్త కలవరములనుండి, పాపము మరియు దాని క్రియలనుండి, శ్రమలు, నష్టములు మరియు శోధనలనుండి బయటకు రప్పించును. ఈ సంగతిని మనము తెలిసికొందుము, ఎందుకనగా విశ్వాసము ద్వారా ఆయన శక్తి మనలోనికి ప్రవహించును. పెక్కు సంఘములు క్రీస్తు తమను పరిశుద్ధాత్మతో బాప్తిస్మమిచ్చు యొక్క ప్రాముఖ్యతను మార్చివేయుటవలన ఆయన సమాధానమును పొందుటలో విఫలమైరి.

క్రీస్తు తన శిష్యులకు సమాధానమును ఇచ్చినపుడు వారిని దేవుని విశ్రాంతి నిలయముగా చేసెను. క్రీస్తు మానవులకు వరములను, ఆశీర్వాదములను మరియు వాగ్దానములను పరిశుద్ధాత్ముని ద్వారా ఇచ్చును గాని, దేవునితో అన్యోన్యతను తెచ్చిపెట్టు సమాధానమును వారియందు నాటకుండ వాటిని దయచేయడు. దానిలో ప్రతి శ్రమ, నష్టము, కలవరము, శోధన మొదలగునవి తీర్పు పొందును. కాబట్టి, సమాధానము కొరకు సంఘములు క్రీస్తువైపు తిరుగవలెను. అప్పుడు మాత్రమే వారియెడల ఆత్మ యొక్క సామర్ధ్యమును వారు పూర్ణముగా ఎరుగుదురు. అంతవరకు వారు రూపాంతరము చెందలేదు. కాని మనమైతే సహోదరులారా, ప్రభువును మన సమక్షమున నిలుపుకొని, నిరంతరము నిలిచియుండు సంతోషమును పోగొట్టుకొనకుండునట్లు విశ్వాసములో కొనసాగుదము. మనము కొనసాగనిచో ఈ మాట మనపట్ల సత్యమగుటకు నిలిచియుండును – అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లుగల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును (నహూ. 3:12).

Posted in Telugu Library.