సఫలతకు మూలము

ప్రభుకు కొరకైన ఆసక్తి ఎన్నడును నశించిపోరాదు. జీవితములో సఫలతకు అది మూలము. విశ్వసించువారు తమ కోరికలు నెరవేరవలెనని తరచుగా ఆశపడుదురు గాని, అవి దేవుని చిత్తప్రకారముగా లేనిచో నెరవేరవు. మనము కలిగియుండవలసిన కోరికలు తెలిసికొనునట్లు ప్రభువు కొరకైన ఆసక్తి సహాయము చేయును. మనము ఆనందభరితమైన, సఫలమైన జీవితమును కలిగియుండు నిమిత్తము మనకొరకు ప్రభువు మనలో కోరికలను పుట్టించును. ఆయన పట్ల మన ఆసక్తి మనము ఆశపడు విధానముకు ఆయన ఏర్పాట్లు చేయవలెనని ఆయనకు బహుగా విన్నపించుకొనును. ఆ ఏర్పాట్లు ఆయన నిరుపద్రవముగాను, చిక్కులు లేనివిగాను చేయును. మనకున్న అవసరములను ఆయన ముందుగానే చూచి ఆ ప్రకారముగా మనము ఆశించునట్లు సహాయము చేయును. కొన్నిమార్లు మన ఊహకు మించి ఆశీర్వదించు ఉద్దేశముతో మనలను ఆశపడునట్లు నడిపించును.

ప్రభువు కొరకు ఆసక్తివలన మనకు కలుగు కోరికలు చెదరిపోవు. అంటే, అవి నెరవేర్చబడును. వాటి నెరవేర్పుకు ఏ పరిస్థితియైనను, శక్తియైనను ఆటంకము కాలేవు. ఏలయనగా తన నామము ఆశ్చర్యముగా మహిమపరచబడు నిమిత్తము ప్రభువైన దేవుడు వాటిని తన శక్తియందు మనకిచ్చెను. వాటిని నెరవేర్చుట ద్వారా మనుష్యులలో ఆయన కోరినదానిని జరిగించునని లోకమునకు తెలియజేయును. అంతేగాక, తన ప్రజలకొరకైన అన్ని ఆలోచనలు ఆయననుండి పుట్టుననియు, వాటికై ఆయన మార్గములు ఏర్పరచువాడనియు బయలుపరచును. వాటిని ఒప్పుకొనువారు ఆయననుబట్టి ఆశ్చర్యపోవుదురు మరియు ఒప్పుకొననివారు సిగ్గుపరచబడుదురు. ప్రభువుకొరకు ఆసక్తిని దీనినిబట్టి గ్రహించుటకు యత్నించుదము. బలిపీఠముమీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దానిమీద కట్టెలు వేసి, దానిమీద దహనబలిద్రవ్యము ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను” (లేవీ. 6:12).

ఒక్కసారి ప్రభువు కొరకైన ఆసక్తి మనలో నిలిచియునపుడు ఆయనను తన ఆజ్ఞలతోను చిత్తముతోను తృప్తిపరచుదుము. ఒక ఉద్దేశముతో పిలువబడిన విశ్వాసులుగా ఆయన కోరు సమస్తమును సంకోచించకుండ చేయుదుము. చీకటిలో నుండు దీపమువలె మనలను మనము వ్రయము చేయుదుము. మన శరీరములు ఆసక్తిని ఉత్పత్తి చేయు పాత్రలగును. దీపమువలె మనము వెలిగినపుడు, సరైన కోరికలతో ఆయన మనలను నింపును. అట్టి కోరికలను పొందుటకు మనము చేయదగిన ఒక కార్యమేమనగా, ప్రతి ఉదయమున ఆయన పట్ల మన ఆసక్తిని నూతనపరచుకొనుట. ఆయన చిత్తప్రకారము సమస్తము చేయుటకు ఆయనకు అభయమిచ్చిన క్షణమున దానిని నూతనపరచుకొందుము. ఇదే ఆయనకు అప్పగించుకొనుట; ఇది ఆయనకు అతీతముగా జీవించుట కాదుగాని, ఆయనను మాత్రమే వెంబడించుటకు ఆయనకు సమర్పించుకొనుట.

ప్రభువు కొరకుకాని ఆసక్తి ప్రభువుకు సంబంధించని కోరికలను పుట్టించును. అట్టి కోరికలు ఒక వ్యక్తిని పాపక్రియలకు నడిపించును. అవి తీవ్ర పరిణామములకు కారణమగును. మరియు యెజెబెలునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా – యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును (1 రాజు. 21:23). యెజెబెలులో నున్న దుష్టత్వము తనలోనుండి పాపసంబంధమైన కోరికలను పుట్టించెను. కాబట్టి, ఒకనిలో దుష్టత్వమున్నంత కాలము వాడు యుక్తమైన కోరికలను కలిగియుండడు. వాడు కోరినవన్నియు శరీరప్రకారమగును మరియు సమస్త శరీరాశలు నాశనమునకు కారణమగును. దేవుని పిల్లలు యెజెబెలు మనస్సును కలిగియుండలేరను మాట నమ్మదగినది. సమస్త కోరికలు హృదయములో నుండి వచ్చును మరియు దేవుని ప్రజల యొక్క హృదయములు ఆయనకు కట్టుబడియుండును.

అయితే, నీ హృదయము దేవునికి పూర్ణముగా కట్టుబడి యుండనియెడల, ఈ సూత్రములను పాటించుట ఆయనకు అప్పగించుకొనుటకు సహాయము చేయును.

  1. అన్యమైనవాటిని కోరరాదు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము (సామె. 5:15). దేవుడు నీకిచ్చినవాటియందు జీవించుట మొదలుపెట్టుము. ఆయన నీకిచ్చిన దేదైనను, అది నీవు ఆయనలో క్రమముగా ఎదుగు నిమిత్తము నీకు అత్యుత్తమముగా ఇచ్చెను. ఈ సత్యమును నిర్లక్ష్యము చేయుట ఆయన ఇచ్చినవాటి కంటె మించి వెళ్లునట్లు నిన్ను శోధించును గనుక, అవి నిన్ను పాపముకు నడిపించును. ప్రతివానికి దేవుడు ఒక కుండను బావిని నియమించును. రాబోవు కాలములో మన ఆసక్తి ద్వారా వాటిని విస్తారముగాను, లోతుగాను చేయును.
  2. దేవునియందు నమ్మికయుంచుట. రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునియందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు” (దాని. 6:23). నీ చుట్టునున్న వాటినిబట్టి, అవి పరిస్థితులైనను మనుష్యులైనను, భయపడకుము. దేవునియందు నమ్మికయుంచుటను అవలంభించుము మరియు నీయెడల ఆయన దయను చూచెదవు. నీవెదుర్కొను ప్రతి విషయములోను జయము పొందుట చూచెదవు. దేవునికి నీ హృదయమును అప్పగించుట్లుగా చేయు ఒక ప్రాముఖ్యమైన పని ప్రతికూల సమయములలో ఆయనయందు నీ నమ్మిక. సమస్తము నీకు విరోధముగా పనిచేయునపుడు, ఆయనయందున్న నీ నమ్మిక యొక్క బలమును ఆయన చూడగోరును. నీవు దానిని బయలుపరచినపుడు నీకొరకు ఆయన చెప్పనశక్యమైన కార్యములు చేయును.
  3. ప్రభువు శక్తిని ఒప్పుకొనుట. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను (మార్కు. 12:36). నీ హృదయమును దేవునికి ఎంత గొప్పగా కట్టుబడియుండునట్లు చేయుదవనునది ఈ సత్యమును నీవెంత తరచుగా హత్తుకొందువో నిర్దేశించును. సత్యమేమనగా, నీవాయన శిష్యుడవైనపుడు నీ శత్రువులు ఆయన శత్రువులగుదురు. నీ కోరికలను వ్యతిరేకించువారు లేక నిన్ను బెధిరించు పరిస్థితులు నిశ్చయముగా ఓటమిని చూడును. నీవు సాధించు జయములలో ఆయన శక్తిని రుచిచూచుచుండగా, గొప్పవైన వాటికై ఆయన శక్తిని పొందునట్లు ఇంకను విశ్వాసమును పొందెదవు.
  4. భక్తులను అనుసరించుట. పౌలు – ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను (అపొ. 21:13). పౌలు ఎట్టి పరిమాణమును చేరుటకు ఇష్టపడెనో నీవు చూచి, దాని లోతును గ్రహించుటకు ఇష్టపడుచునపుడు, అతనివలె జీవించుటకు నిన్నునీవే బలవంతము చేసికొందుము. ఈ ప్రయాసలో నిశ్చయముగా నీ హృదయము దేవునికి కట్టుబడియుండునట్లు చేసెదవు. క్రైస్తవునిగా ఉండుట, ప్రభువును వెంబడించుట లేక భయభక్తులతో జీవించుట ఎన్నడును నిర్జీవముగా ఉండరాదు. బదులుగా, అవి అర్పణగా ఉండవలెను. భక్తులను అనుసరించు కొలది క్రీస్తు కొరకు జీవించునట్లు నీ హృదయము మరిఎక్కువగా మార్చబడును. అప్పుడు, నీ హృదయమును నీవు ఆయనకు అప్పగించుకొను సామర్ధ్యమును పొందు నిమిత్తము దేవుడు త్యాగములు చేయుమని నిన్ను పిలుచును.
  5. నీతిని సాధన చేయుట. పౌలులో నుండిన ఆత్మ విశ్వాసులను ఈ విధముగా బలవంతము చేసెను. మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పోరుగువానితో సత్యమే మాటలాడవలెను (ఎఫె. 4:25). నీవు దీనిని నీ సహోదరులతో జరిగించినయెడల ప్రతివాని యెదుట, ప్రతిచోటను కూడ చేయగలవు. ఈ సూత్రమును ఆచరించుటవలన దేవుని నీ హృదయములో ధైర్యముగా నివాసము చేయుటకు ఆహ్వానము పలికెదవు.
Posted in Telugu Library.