ఆచారములు ప్రియమా?

మనుష్యులకు ఆచారములంటే ప్రియము. వాటితో జతపరచుకొని, అవి చూపించు ప్రాముఖ్యతనుబట్టి ఉత్సాహపడుదురు. ఆచారములు ఒక కచ్చితమైన గుర్తింపును దయచేయునని, అవి వారి జీవిత విధానములోనికి అత్యుత్సాహమును కుమ్మరించునని వారు తలంచెదరు. ఈ లోకములో ఎన్ని సంస్కృతులు ఉన్నవో ఆని ఆచారములు ఉన్నవి. అవి మనుష్యుల జీవిత విధానము పట్ల మనుష్యులకు ఆసక్తి కలిగించును. వాటిలో కొన్ని సహింపదగినవి ఎందుకనగా అవి కొంత ప్రాముఖ్యతను సూచించును. కాని మిగిలినవి అట్లుకాదు ఎందుకనగా వాటిలో అర్ధముండదు. అయినను, అవి ఉన్నవి మరియు ఒక ప్రత్యకమైన జీవిత విధానముకు మనుష్యులను బంధించును. పరిశుద్ధ గ్రంధములో మనము చూచెడి ఆచారములలో ఒకటి యూదులకు చెందినది. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను (యోహా. 2:6). యూదులు బహు సంప్రదాయకులై తమ పితరులనుండి వచ్చిన ప్రతి ఆచారమును పాటింతురు. వారిలో అనేకమంది వాటి అర్ధమును గ్రహింపకుండనే వాటిని పాటింతురు. ఆచారములు నిజమైన ఉద్దేశమును కలిగియున్నయెడల, అవి మేలును కలుగజేయును.

యూదులు శుద్ధీకరణయందు బహు శ్రద్ధ వహించువారు. అది వారికి మిగిలిన లోకమునుండి ప్రత్యేకపరచు కార్యము. వారు ఇంటిలోనికి వెళ్లేముందు ఉద్దేశపూర్వకముగా కాళ్లు చేతులను శుభ్రపరచుకొందురు. ఇది ప్రభువైన యేసు అందరి హృదయముల విషయములో దాని నిజమైన ఉద్దేశమునుబట్టి కోరిన పరిశుద్ధతకు సూచన. యూదుల ఆచారమైన శుద్ధీకరణ ప్రభువు ఆశించిన రాబోవు నిజమైన పవిత్రతకు ఛాయగా నిలిచెను. ధర్మశాస్త్ర ప్రకారముగా కూడ యూదులు అన్నివిధముల పవిత్రముగా ఉండవలసినవారు. అయితే, వారు దాని నిజమైన సారమును గైకొనక, అంతరంగ పవిత్రతను తెలియజేయు బాహ్య క్రియలను చేసిరి. కాలము గడిచిన కొలది శుద్ధీకరణ నిజమైన సారములేని ఆచారముగా మిగిలిపోయెను గాని, అది ఆవశ్యకమాయెను. ధర్మశాస్త్రము దాని యొక్క నిజమైన అర్ధమునకు వారిని నడిపించలేకపోయెను. ఎందుకనగా దానియెడల వారు ఆసక్తిని చూపలేదు.

అనుదినము యూదులు శుద్ధీకరణాచారము పాటించినట్టుగా యేసును వెంబడించువారు నీళ్ల సంబంధమైన ఆచారము గాక, పరిశుద్ధాత్మ సంబంధమైన శుద్ధీకరణాచారమును పాటించవలెను. గలలియలోని కానాలో వివాహ వేడుక సందర్భముగా రెండేసి మూడేసి తూములు పట్టు రాతిబానలు ఉంచబడెను. శుద్ధీకరణ వారికి ఎంత ప్రాముఖ్యమో ఇది తెలియజేయుచున్నది. అయినను, ఇది కేవలము శరీర పవిత్రతనే నిరూపించెను. దీని అర్ధము దాని ప్రాముఖ్యత శరీరము కొరకని, మరియు శరీరము కొరకును, శరీరమునకు చెందినది ఏదైనను గతించిపోవును. కాని, ఆత్మవలనైన శుద్ధీకరణ అంతరంగ సంబంధమైనదై, నిత్యము నిలిచిపోవును. ఆత్మ యొక్క శుద్ధీకరణను మనము కోరిన వెంటనే మన అంతరంగ పురుషుడు సమస్త అపవిత్రతనుండి పవిత్రపరచబడును గనుక, దేవుని చిత్తమును జరిగించుటకై సాగిపోవుదుము. శరీరము లోకసంబధమైన వాటిని ఆకర్షించు యంత్రము గనుక, శరీరములో జీవించున్నంత కాలము ప్రభువునుండి ఆత్మద్వారా శుద్ధీకరణ కోరు క్రియ ఆవశ్యకము. మన ఆత్మసంబంధమైన స్వేచ్ఛను ఆక్రమించునట్లు శరీరము పాపమునకు ఎల్లప్పుడు అవకాశమిచ్చును. మరియు, అది నానావిధములుగా చొచ్చుకొనినచో, ఆత్మలో బలహీనులమౌదుము. ఇది నిజము, ఎందుకనగా అనుదినము ఆత్మవలన శుద్ధీకరణ పొందనపుడు, అది ఆత్మలో బలహీనమగుటకుకారణమగును. మన దిశ దేవుని ఆశకు విరుద్ధమై యుండును. ఎడతెగక మన హృదయములను పవిత్రపరచుకొనుట మరల జన్మించిన దానిలోనుండు నూతనత్వమును నిలుపుకొనుటకు సహాయపడును. ప్రభువును ఎరుగుటవలన కలిగిన ఆనందము మనలో నిలిచిపోవును.

హృదయ శుద్ధి నిలిచిపోవునట్లు ఆచారము లున్నవి. అవి మనతో అనుదినము ఉన్నయెడల మరిఎక్కువగా మన అధిపతియైన ప్రభువుకు ప్రియముగా నుందుము.

  1. పాపవిహీనముగా నుండు ఆచారము. పౌలు ఈలాగనెను. మంచిది; అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే” (రోమా. 4:10). పాపవిహీనముగా ఉండుట శరీరముతోను లేక దాని క్రియలతోను సంబంధము లేదు. అది ప్రభువు తనయందు మన విశ్వాసమును, తన పిలుపును మనకు నీతిగా ఎంచుటవలన కలుగును. నూతనముగా జన్మించిన వంశముగా కొనసాగదలచినయెడల, అది మనలో నిరంతర క్రమముగా ఉండవలెను. క్రియలకు అతీతముగా పాపవిహీనులగుట అద్భుతమైన పరిణామము నిచ్చును. అదేమనగా, నానావిధములుగా ప్రభువు మనపై ఆశీర్వాదములను కుమ్మరించును. అబ్రాహాము ప్రభువును నమ్మెను, అతడు పాపవిహీనునిగా చేయబడెను, అనగా నీతి అతనికి ఎంచబడెను. సాధారణముగాను బాధకరముగా మాటలాడినచో, సంఘమునకు పోవు అనేకులు క్రియలతోనే ప్రారంభించిరి మరియు ఇంకను అనేకులు వాటితోనే ప్రారంభించునట్లుగా నడిపించబడుచుండిరి. ఇది ఆత్మసంబంధమైన నాశనముకు కారణమగును.
  2. నిలకడగా నుండు ఆచారము. గతకాలమందున్న క్రైస్తవులు దీనిని యధార్ధముగా పాటించిరి. వానిరిగూర్చి పౌలు ఈలాగు పలికెను. నేను శరీరవిషయములో దూరముగా ఉన్నను ఆత్మవిషయములో మీతోకూడ ఉండి, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిరవిశ్వాసమును చూచి ఆనందించుచున్నాను (కొలొ. 2:5). ప్రభువు పట్ల విశ్వాస్యతతో నిలిచిపోవుటకు విశేషమైన క్రమశిక్షణ కావలెను. ఎవరి పర్యవేక్షణ లేకుండనే ఆయన యెడల బాధ్యతగా వ్యవహరించుచున్నయెడల మనము చక్కని ఆత్మసంబంధమైన క్రమశిక్షణను పాటించుచున్నాము. అంటే, ఆయనకు అనుకూలముగా ఉండునట్లు మన శరీరములను క్రమశిక్షణ చేయుచున్నాము. ఇట్టి క్రమశిక్షణ ఆయనయందు మరిఎక్కువ నిలకడైన విశ్వాసము కొరకు అవకాశమును పెంచును. మరియు మనకు బోధించిన వారికి ఆయనయందు మన యధార్ధతయెడల నమ్మికను పరిశుద్ధాత్ముడు దయచేయును.
  3. క్రమముగా నడుచుకొను ఆచారము. ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును” (యాకో. 3:16). మత్సరము నుండియు, వివాదము నుండియు దూరముగా ఉండునట్లుగా మన ఆత్మయందు గురిగా చేసికొనినయెడల, జీవితములో కొలువలేని ఆనందమును, సమాధానమును, నెమ్మదిని పొందుదుము. ఆ దుష్ట లక్షణములు మన అంతరంగమును నాశనము చేయును. మత్సరమును తప్పించుకొనుటకు ఒక ఉపాయము దేవుడు మనకిచ్చిన వాటియందు ఏలాగు ఆనందించవలెనో తెలిసికొనుట. అప్పుడు, ఇతరుల విషయమై మత్సరపడము. మత్సరము దేవుడు మనకొరకు ఆలోచన చేసిన ఆనందమును అడ్డుకొనును. వివాదము దేవుని మార్గములను తృణీకరించును. అది సహోదరుల మార్గములకు ఆటంకములను కలిగించుట ద్వారా వారితో మంచి సంబంధమును పాడుచేయును. ఈ రెండింటిని తప్పించుకొనుటతో దేవుడు మనకొరకు దాచియుంచిన వాటిని ఆనందింతుము; ఇవి మనలను ఉన్నత స్థలములయందు నిలువబెట్టును.
  4. ప్రధమఫలముగా నుండు ఆచారము. క్రీస్తునందు నూతనముగా సృష్టింపబడుటకు ఒక స్పష్టమైన ప్రత్యేకత ఉన్నది. దానిని అంతము వరకు కాపాడుకొనవలెను. అది దీనియందు చెప్పబడెను. వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రధమఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు (ప్రక. 14:4). ప్రధమఫలమనగా పరిపక్వత చెంది, సరైన రుచిని కలిగిన ఫలము. వ్యవసాయకుడు దాని రుచి చూచిన వెంటనే అది ఉత్తమమైనదని ఎరుగును.
  5. సరైనవాటిని చేయు ఆచారము. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి (ఫిలి. 4:8). నీతి మనలో నిలిచియునపుడు సరైనవాటిని అర్ధము చేసికొందుము. వాటిని ఊహించక, ఆత్మలో ఎరుగుదుము. ప్రభువు మననుండి కోరు సమస్తము ఆత్మ నుండి తెలియును. వాటి యొద్దకు నడిపించుమని ప్రభువును వేడుకొనుట మన ముఖ్యాంశము కావలెను. వాటిని చేయుటకు ప్రభువు మనలను శుద్ధి చేయును.
  6. న్యాయముగా నుండు ఆచారము. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇంట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి? (యోహా. 7:23). అన్యాయముగా ప్రవర్తించుచున్నామని ఎరిగిన క్షణమున ఆత్మలో బలహీనమగుచున్నామని మనకు తెలియును. ప్రతి విషయముకు చేయవలసిన నిర్ణీతమైన న్యాయము ఉండును. ఆత్మలో ఉద్దేశపూర్వకముగా న్యాయముగా ఉండునట్లు మన హృదయముకు శిక్షణ ఇచ్చుట మనము కలిగియుండవలసిన ఆచారము.
Posted in Telugu Library.