జ్ఞానాత్మ

దైవసంబంధులు దేవుడు వారికిచ్చిన తలాంతును ఉపయోగింతురు. నీవు వారిలో ఒకరివా? దేవుడు తన చిత్తమునుబట్టి ప్రతివానికి తలాంతును లేక తలాంతులను దయచేయు ననుటలో సందేహములేదు. అయినను, అందరు ఆయన కోరినట్టుగా వాటిని వినియోగించరు. కారణము అందరు ఆయనను విశ్వసించరు. మరియు, విశ్వాసమున్నదని కొందరు చెప్పుచు, వారి కార్యములలో విఫలమౌచున్నప్పుడు, వారి విశ్వాసము పరిపూర్ణము కాదు; వారు వరమును కలిగియుండకపోయిరి. దేవుడు మనకిచ్చిన తలాంతును ఉపయోగించుట మనకు లాభమును మాత్రమే చేకూర్చును. అందుకే విశ్వాసులు తమ పనులలో విఫలమగుట బాధకలిగించును. దేవుడు కోరినట్టుగా తమ తలాంతును ఉపయోగించువారు మేలును ఆశీర్వాదములను పొందుదురు. నిష్కల్మషమైన విశ్వాసము గలవారు దేవుడు వారికిచ్చిన తలాంతును ఉపయోగించునట్లు సన్నాహము చేయబడుదురు; వారు నానావిధములుగా దేవునికి సేవ చేయునట్లు ఆయనే వారిని సిద్ధపరచును. తనను పూర్తిగా నమ్మువారికి ఆయన ప్రత్యేకమైన వరమును ఏర్పరచెను. ఆయన సృజించిన లేక అనుగ్రహించిన ప్రతి తలాంతును ఆ ప్రత్యేకమైన వరమునుబట్టి సాగుచేయును. అది ఆయనకు సంపూర్ణ మహిమను దయచేయును మరియు అది ఈ వాక్యములో కనబడుచున్నది. “…అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము (నిర్గ. 28:3). 

జ్ఞానాత్మ దేవునికి చెందినది. విశ్వసించువారిని తన సాటిలేని జ్ఞానముతో నింపుటుకు ఆయన పిలిచెను. నీవు ఒక విషయములో వివేకము కలిగియుండి కూడ అందులో అభివృద్ధి చెందకపోవుట లేక నీవు నిజముగా కలిగియున్న తలాంతును ఎరుగకపోవుట సాధారణమే. ఒక్కసారి దేవుడు తన జ్ఞానాత్మను నీపై కుమ్మరించినయెడల నీవు ఎరుగుదువు. మనలను తన పనికై ఆయన పిలిచినపుడు మనలో ఆయన అమర్చిన తలాంతును కనుగొనునట్లు మనలను వెలిగించును. మరియు మన విధేయతనుబట్టి దానిని జ్ఞానాత్మతో శక్తివంతముగా చేయును. ఈలోకములో అనేకమంది వివేకము గలవారు ఉన్నారు. వారందరు తమ వివేకమును నానాకారణములకు ఉపయోగించెదరు. కాని, పిలువబడినవారు మాత్రమే ఆయనను మహిమపరచు నిమిత్తము తమ తలాంతును ఉపయోగింతురు. దీనియందు వారి జీవితము స్థిరపరచబడును. ఆయన వారిపై కుమ్మరించు జ్ఞానాత్మ ఆయనతో వారికి అసమానమైన సంబంధమును ఏర్పరచును. అది ఈ భూమిపై వారి దినములకు జీవాహారమగును. అట్టి జీవాహారమును బట్టి భూమిపై వారి ఉద్దేశము నెరవేరును. వారి ఉద్దేశము నెరవేరుచున్నయెడల, దేవుడు వారికై దాచియుంచిన వాటన్నిటిని వారు పొందుచుండిరి.

జ్ఞానాత్మ లేకుండ విశ్వసించువారు దేవుని మహిమపరచలేరు; ఎవరును సమాధనముతోను, సంతోషము, నెమ్మదితోను ముందుకు కొనసాగలేరు. జ్ఞానాత్మ మన జీవిత విధానములో, ఆలోచన విధానములో మరియు పనిచేయుటకు చేయు నిర్ణయములలో మార్పు కలిగించును. అనగా, మనము జ్ఞానులమగునట్లు దేవుడు మనలను జ్ఞానయుక్తముగా నడిపించును. మనవలె తలాంతు గలవాడు లేక వేరే తలాంతులు గలవాడు కలిగియుండని ఆలోచనలలోను మార్గములలోను ఆయన మనలను నిలుపును. ఇంకను మనము విఫలమౌకుండను, నష్టపోకుండను సమస్తము మనకొరకు సమకూడి జరుగునట్లుగా ఆయన చేయును. జ్ఞానాత్మ లేకుండనే అనేకమార్లు విశ్వాసులు దేవుని ఘనపరచుటకు ప్రయాసపడుదురు. ఇందువలననే వారి క్రియలు, ఆయనను స్తుతించుట మరియు వారి ఆరాధన నిర్జీవమై యుండును. వారు దానిని కలిగియుండకపోవుటకు కారణము దేవుడు దానిని వారిపై కుమ్మరించలేదు; దీని అర్ధము వారి విశ్వాసము ఇంకను అపవిత్రములతో ఉండెను. కాని, దాని కలిగియున్నవారు సఫలమౌదురు. వారి క్రియలు జీవముగలిగి యుండును గనుక, అవి నిలిచిపోవును. జ్ఞానాత్మ లేనపుడు మన క్రియలకు హఠాత్పరిణామము లుండును; హఠాత్పరిణామములు ఆలస్యములకు కారణములు కావు, అవి నాశనముకు కారణములు. మన క్రియలను ఒక నిర్దిష్టమైన ఆశతో సంపూర్ణము చేయు ఉద్దేశముతో దీర్ఘకాలము ప్రయాసపడవచ్చును గాని, వాటిని తుదకు విడిచిపెట్టవలసివచ్చును. అట్టి సమయములలో బాధ, అవమానము కలుగును; సమయమును, శ్రమను, ధనమును నష్టపోవుదుము.

జ్ఞానాత్మ గలవానికి ప్రత్యేకమైన మనస్సుండును.

  • వాడు ఆశ్రయించును. నానాకారణములకు తన తలాంతును ఉపయోగించడు గనుక, వాడు ప్రభువును ఆశ్రయించును. వాడు ప్రమాదములను, శ్రమలను, శోధనలను, ఆలస్యములను ఎదుర్కొనును గాని, ప్రభువు మంచితనమును నమ్మి, దానిని ఎరిగినవాడు. దేవుని మహిమపరచుటకు మన తలాంతును ఉపయోగించుట ఆయనను ఆశ్రయించుటను కోరును. లేనియెడల, దానికి న్యాయమును చేకూర్చలేము. మరియు దావీదు ఈలాగనెను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు (2 సమూ. 22:2). దేవుడు బహూకరించిన జ్ఞానాత్మతో దావీదు నిత్యము పనిచేసెను. అది శత్రువునితో యుద్ధము చేసినను, వానినుండి పరుగెత్తినను, నీతిన్యాయములను జరిగించినను, తనకంటె తక్కువవారి ఎదుట తగ్గించుకొనుటైనను లేక పరుల దేశమందు జీవించుటైనను, అన్నియు దేవుడిచ్చిన జ్ఞానముతో చేసెను. కాబట్టి, అతడు తన హృదయానుసారుడని దేవుడు అతిశయించి చెప్పెను.
  • వాడు దేవుని కుమారుడగును. కుమారుడు తన తండ్రి మాట వినునట్లు వాడు దేవుడు తనకు ఉపదేశించు వాటన్నిటిని ఆలకించును. దేవుడు నిత్యము తన వాక్యము ద్వారా వానికి ఉపదేశించును. ఒకడు జ్ఞానాత్మను కలిగియునపుడు వాడు బోధింపదగిన ఆత్మ గలవాడని అర్ధము. వానియెడల తన తండ్రి చిత్తమునకు వాడు లోబడును. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము. నా ఆజ్ఞలను నీ యొద్ద దానిపెట్టుకొనుము (సామె. 7:1).

విపర్యయముగా, జ్ఞానాత్మ లేనివాడు తనపై నాశనమును తెచ్చుకొనును.

  • వాడు తన ఫలించు జీవితమును మృతము చేయును. వాడు చేసినవి మరియు చేయుటకు ఆశించిన వన్నియు తుదకు వానికి విరోధముగా పనిచేయును. బాధ, భయము మరియు అవసరమును కలిగియున్న సమయమున వానిని ఆదుకొను దేదియు ఉండదు. వాని అంతము ప్రారంభము కన్న ఘోరముగా ఉండును. కల్దీయుల సేనాసంబంధులందరు యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటిని పడగొట్టిరి (యిర్మి. 52:14). యూదా ఫలించు జీవితమును మృతము చేసికొనెను. కారణము స్పష్టము – పాపము నుండియు అవిధేయత నుండియు ఒకని దూరపరచు జ్ఞానాత్మ వారిపై లేకపోయెను. దేవుడిచ్చిన తలాంతును వినియోగించుట ద్వారా జ్ఞానాత్మ పాపమును తిరుగుబాటుతనమును అణచివేయును. ఒకడు గొప్ప తలాంతును కలిగియుండవచ్చును గాని, జ్ఞానాత్మ లేనపుడు దేవునికి అయిష్టమైనవాటిని చేయసాగును. ఇది వానికి పతనము నిచ్చును.

పరిపూర్ణమైన జీవితముకు ఉత్తమమైనది దేవుడు మనకు అనుగ్రహించు జ్ఞానాత్మ. దానికై ఆయనను సంతోషపెట్టుటకు మార్గములున్నవి. ప్రతివాడును అందుకై జాగ్రత్తపడవలెను.

  • పాపరహితమైన జ్ఞానమును ఆచరించుట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి (మత్త. 10:16). అపరిచుతల నుండి వెంటనే తప్పించుకొనుటయు మరియు వారి కంటపడినపుడు తన ఉద్దేశమును దృఢముగా కనుపరచుటయు పాముకున్న రెండు లక్షణములు. అట్టి లక్షణములలో దోషములేనప్పటికీ, పావురముల లక్షణము వాటికి తోడైనపుడు తెలివియందు పాపము చేయు ఉద్దేశము ఉండకపోవును. ఈ లక్షణములను అవలంబించుటవలన ఒకడు నెమ్మదిగల జీవితమునుకలిగియుండును.
  • నీతియెడల ఆసక్తి. వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పును తీర్చుడని (యోహా. 7:24) యేసు పలికెను. నీతినిబట్టి తీర్పు తీర్చుటకు ఆశపడవలెనని ఆయన కోరుచున్నాడు. అది జరిగినపుడు జ్ఞానాత్మతో దేవుడు మనలను సిద్ధపరచును. అప్పుడు, మన తలాంతును సరిగా వినియోగింతుము.
  • దేవుని నోరగుటకు ఆసక్తిదేవుడు మనకియ్య దలచిన వాక్యమును పలుకుటకు మన హృదయములను మనసులను సిద్ధపరచుకొనవలెను. నిష్కపటమైన మన విశ్వాసము, హృదయ శుద్ధి తన వాక్యముతో మనలను నింపుటకు ఆయనను అనుమతించును. ఆయన మనపై తన జ్ఞానాత్మను కుమ్మరించును గనుక, పలుకుటకు తన వాక్యము నిచ్చును. అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని – యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను (అపొ. 21:11).
Posted in Telugu Library.