యోగ్యతకై ప్రయాసపడుడి

పరిస్థితులలో ఎంతటి అస్థిరత్వము ఉన్నప్పటికీ, దేవుడు మనలను ఆదుకొనును. ఇందుకై ఆయన పేరొందినవాడు. మనయెడల తన విపరీతమైన ప్రేమే ఆయనాలాగు చేయుటకు కారణము. మనయెడల ఆయన ప్రేమకనికరములను బట్టి ఆశ్చర్యపడి, ఆయనను స్తుతించుట తప్ప వాటిని కొలువలేము. నానావిధములైన భారములు మనపైపడునట్లుగా చేయు నానావిధములైన పరిస్థితులను మనము ఎదుర్కొందుము. అవి  మనలను బాధలోను నొప్పిలోను అవమానములోను ముంచివేయును. ఇట్టి సమయములలో మనకు సహాయము చేయవలెనని ప్రభువు అమితముగా ఆశించును. మరియు, మన గురించి ఆలోచన చేయుమని మనము కూడ ఆశతో ఆయన ఎదుట ప్రాదేయపడుదుము. అయితే, ఆయనను అడుగుట ఒక ప్రమాణమును కోరుచున్నది. అనేకులు దానిని మరచిపోవుదురు లేక నిర్లక్ష్యము చేయుదురు; కొందరైతే దానిని కనీసము పరిగణించరు. దానిని ఎరిగినవారు నిస్సందేహముగా ఆయన బలమైన హస్తమును ఆనందింతురు. ఆ ప్రమాణమును ఈ వాక్యములో చూచెదము.  వారు యేసు నొద్దకు వచ్చి – నీవలన   మేలు  పొందుటకు అతడు యోగ్యుడు(లూకా. 7:4).

ప్రభువైన దేవుని ఎదుట మనమందరము కలిగియుండవలసిన ఒక అపూర్వమైన ప్రమాణము యోగ్యత. అడుగకుండనే దేవుడు తన దయ చొప్పున మనకు సహాయము చేయు సమయము లుండును. ఇది ఆయన మనతోను మనకొరకును ఉన్నాడని తెలియజేయుటకు ఆయన విధానము. మనుష్యులు ఆయనను ఎరుగవలసినపుడు మరియు ఆయనతో వారు ఆసక్తితో నడచునపుడు ఆయన ఆలాగు చేయును. కాని, ఒకడు ఆయన దయను తేలికగా ఎంచినయెడల వాడు దానిని నష్టపోవును. విపర్యయముగా, దానిని వాడు గట్టిగా పట్టుకొని, దాని ప్రకారముగా నడుచుకొనినయెడల, ఆయన చేయగల వాటన్నిటికి యోగ్యునిగా ఉండుటకు వాడు ప్రయాసపడుచుండెను. యోగ్యత అను లక్షణమును విశ్వసించువారిలో దేవుడు వెదకును. నిరాటంకముగా మనకు సహాయము చేయుటకై దానిని మనలో ఒక సూచనగా ఆయన కోరును. అది తన పరిశుద్ధతను మనలో ప్రతిధ్వనించును. అది నానావిధములైన క్రియలు చేయుటతో ముడిపడియుండదు గాని, ఆయనకు ఇష్టమైనవాటిని మరియు ఆయన చిత్తప్రకారముగా నున్నవాటిని చేయుటతో ముడిపడియుండును. మనము చేయునవి ఆయన ఆలోచనలతో ఏకీభవించవలెను; అవి నిజమైన విశ్వాసమును నీతిని ప్రతిబింబించును. అప్పుడు, మన మనస్సు శరీరముతోపాటు కలిసి యోగ్యతకై సవరించుకొనును.

యోగ్యత అను లక్షణమును దేవుని కొరకు ఆశ కలిగియుండుటవలన పొందుదుము. మనుష్యులు తమ జీవితములో నానావిధములైన వాటికొరకు ఆశపడుదురు గాని, విశ్వసించువారు దేవుని ఆపేక్షించవలెను. కాబట్టి, వారు దేవునినుండి పొందుదురు మరియు సమస్త మంచివాటిని పొందుదురు. అయితే, ఆ ఆపేక్షను వారు విడిచిపెట్టు అవకాశమున్నది. అది శరీరసంబంధమైన ఆటంకములవలన సంభవించును. అవి అనేకమైనవి మరియు సాతాను యొక్క శక్తిని కలిగినవై దేవునినుండి వారిని తప్పించును. కాబట్టి, దేవుని ఎదుట యోగ్యునిగా నిలుచుట అనునది ఆర్జించు లక్షణము. దేవుని నమ్మినవాడు మరియు ఆయన కొరకు ఆసక్తియందు కొనసాగువాడు ఆయన ఎదుట యోగ్యుడు. యేసు ఈలాగు పలికెను. నీతిస్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపింతివని వీరెరిగియున్నారు” (యోహా. 17:25). ఆసక్తిలో కొనసాగుట దేవుడు క్రీస్తును పంపెననిన జ్ఞానమునకు కొలతగా నిలుచును. దానినుండి దూరమైన సమయమున మనము ఎరిగినదానిలో నుండిన పదార్ధమును కోల్పోవునట్లు నడుచుకొందుము. ఇది దేవుని ఎదుట మనలను అయోగ్యులుగా చేయును. ఆసక్తితో నుండుట పరలోకసంబంధమైన క్రియ. ఇది మనస్సునందు గలవారమై, క్రీస్తు ఎదుట యోగ్యులుగా నుంచు సాధ్యతలను కనుగొందము.

1. నిర్దోషత్వమందు జీవించుట. దేవుని ఎదుట యోగ్యులుగా ఉండుటను ఆశించువారందరికి అపొస్తలుడైన పౌలు యొక్క జీవితము మార్గముగా ఉన్నది. ఫేస్తు మాటలను లూకా అపొస్తలుల కార్యములు 25:25లో ఈలాగు వ్రాసెను. ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తి యెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించి యున్నాను. నిర్దోషమైన జీవితము జీవించుట ఎంత కష్టము! అయితే, అది అసాధ్యము కాదు. ఏలయనగా దేవుని పట్ల అపేక్షగలవారమైతే, నిర్దోషమైన మార్గమందు మనలను నడిపించువాడు క్రీస్తునందున్న దేవుడే. పౌలు దేవుని, ఆయన ఉద్దేశమును మరియు ఆయన క్రీస్తు యొక్క పనిని అర్ధము చేసికొనినవాడు. క్రీస్తు వచ్చియుండకపోతే ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము కొరకైన అతని ఆసక్తి మచ్చలేనిది. కాని, క్రీస్తు ఆసక్తివలన అతడు రూపాంతరము చెంది, క్రీస్తు దేవునికి చెందినవాడని ఎరిగినపుడు, అతడు క్రీస్తునందున్న దేవుని అపేక్షించెను. మరణము నిచ్చు క్రియలను చేయుట దేవుని సహాయమును మనకు దూరము చేయును. అవి పాపమును మనలోనికి తెచ్చి, దేవునితో కలిగియున్న సంబంధమునకు అంతము కలిగించును. అవి క్రమశిక్షణవలనైన శిక్షను తెచ్చిపెట్టును.

2. క్రీస్తు పరిచర్యకు సహాయము చేయుట. విశ్వాసుల యెడల ఈ విషయమై అపొస్తలుడైన పౌలు బహు స్పష్టతతో నుండెను. వారు దేవునియెడల తమ నీతి సంబంధమైన బాధ్యతనుండి తొలగిపోకుండునట్లు అతడు దాని విషయమై వారికి బోధించి, వారిని బలపరచెను. అన్యుడైనప్పటికీ, శతాధిపతి సహితము మంచి క్రియలను ధర్మశాస్త్రము ప్రకారము గాను, దేవుని చిత్తప్రకారము గాను చేసెను. యూదుల కొరకు సమాజమందిరమును కట్టి క్రీస్తు సహాయమునకు యోగ్యుడయ్యెను. దేవుని ప్రజలను ప్రేమించెను గనుక, అతడు అలాగు చేసెను. క్రీస్తు మనకు సూచించిన ప్రకారముగా ఆయన సేవలో మనలను మనము కలుపుకొనుట ఆయన సహాయమును పొందుటకు ఒక ముఖ్యమైన కారణము. కాని, మొదటిగా మనమాయన ప్రజలను ప్రేమించువారమై యుండవలెను; అది దేవునికొరకు ఆశ కలిగియుండుటవలన సాధ్యమగును. మరియు అట్టి సేవ మనకున్నవాటిని బహుగా విస్తరించునని పౌలు వివరించెను; ఏలయనగా దేవుడు విస్తారముగా ఇచ్చిన వాటినుండి మన నీతి యొక్క ఫలమును వృద్ధి చేసికొందుము. క్రీస్తు సేవకు సహాయము చేయుటయే ఒక పరిచర్య. కాబట్టి, పౌలు ఈలాగు చెప్పెను. ఏలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు” (2 కొరి. 9:13).

3. జ్ఞానముగా ఉండుట. మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటనుబట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాను” (2 థెస్స. 2:2). ఆసక్తితో నున్నప్పుడు మోసపోవుటకు ఒప్పుకొనము. యూదునికి యూదుని గాను, అన్యునికి అన్యునిగాను, బలహీనునికి బలహీనునిగాను లేక నామకార్ధ విశ్వాసికి విశ్వాసి గాను ఉండి కూడ మోసపోవుటకు అంగీకరించము. జ్ఞానముగా ఉండుటనగా సువార్త సత్యమును పూర్తిగా ఎరిగియున్నాము. క్రీస్తును తెలిసికొనుటకు పలు చోట్లకు పరుగెత్తము. అబద్ధ బోధకుల యొక్క వర్తమానముకు కదలిపోము. దేవుని ఎరిగితిమని చెప్పినవారి అబద్ధ జ్ఞానమువలన భ్రమపడకుందుము. క్రీస్తు వారియందు ప్రత్యక్షమగువలెనని మనము పరిచర్య చేయువారినిబట్టి మోసపోకుందుము.

4. దేవుని పట్ల విధేయతలో ఉల్లసించుట. అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి (1 పేతు. 3:5). మన బాహ్య రూపము గాక, హృదయమందు విధేయతే క్రీస్తు ఎదుట మనలను యోగ్యులుగా చేయును. విధేయత దేవునికొరకు పరిశుద్ధతను సూచించును. పేతురు స్త్రీలను గూర్చి చెప్పినప్పటికీ, క్రీస్తును సంఘముకు శిరస్సుగా చూచినపుడు అది అందరికి వర్తించును. నీతియందు నిష్కాపట్యము విధేయతలో ఉల్లసించునట్లు చేయును.

5. మనలను వాడుకొనునట్లు దేవుని అనుమతించుట. దేవుని చిత్తమును జరిగించుట ఒక్కసారి చేయు క్రియగా ఎంచరాదు. మరియు ఒక్కసారి ప్రయాసపడుట మాత్రమే మనకు సాధ్యమని అనుకొనరాదు. ప్రభువుకు అప్పగించుకొనినపుడు ఆయన మనలను అనేకమార్లు వాడుకొనును. కాబట్టి, అపొస్తలుడైన యోహాను విషయమై ఈ మాటను చూచెదము. అప్పుడు వారు – నీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారిని గూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి (ప్రక. 10:11). తాను ఎంచిన మార్గమందు మనలను తన ఉద్దేశముకై వాడుకొనుటలో ప్రభువు ఉల్లసించును. మరియు, మనము బ్రతికినంతకాలము ఆయనచేత పిలువబడుట ఆశీర్వాదము.

పై సాధ్యతలను పరిగణించి వాటిని చేయుచుండగా, మనము జీవించు దినములన్నిటిలో క్రీస్తు యెదుట యోగ్యులుగా ఉందుము. దేవుని సహాయము విషయమై లోటు లేనివారిగా ఉండునట్లు ఆయన ఎదుట క్రీస్తే మనకు సాక్ష్యముగా ఉండును.

Posted in Telugu Library.