స్వచ్ఛమైన విధేయత

దేవుని పిల్లలు మహిమను వెదకువారై ఉండవలెను. ఇందు నిమిత్తము వారు మహిమను ఆశించవలెను. వారు మనుష్యులనుండి దానిని కోరినయెడల ఆయన పిల్లలు కాకపోవుదురు. వారు దానిని దేవునినుండి కోరవలెను. దేవునినుండి మహిమను పొందుట పరీక్ష వంటిది. అది వారి పిలుపును నిర్ణయించును. దేవునినుండి కలుగు మహిమను వెదకినపుడు వారు విశ్వాస సంబంధులని గ్రహించెదరు. ఆయన ఉద్దేశమును, ఆశను, తత్వమును అర్ధము చేసికొనుటకు పూర్ణ నమ్మికను కలిగియుందురు. తన మహిమతో స్త్రీ, పురుషులను బంధించుటకు దేవుడు వారిని పిలుచుననునది సత్యము. వారిలో నుండు ఆయన మహిమ పాపము యొక్కయు, లోకము యొక్క మహిమనుండి వారిని దూరముగా ఉంచును. అది మనుష్యులకు భూమ్యాకాశముల దేవుడను, ఆయన తీర్పులను మరియు కార్యములను బయలుపరచును. అది ఆడంబరమైనది లేక అతిశయపడునది కాదుగాని, శక్తి, సత్యము, నీతి సంబంధమైనది. దానిని వెదకుటయే ఆయన చిత్తములో నమ్మిక యుంచుటకు మార్గము. మరియు యేసు ఈలాగు చెప్పెను. అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?” (యోహా. 5:44).

అనేకులు ఈ జ్ఞానమునుండి తొలగిపోయిరి. జనులతో నిండియున్న విశాలమైన స్థలములు దేవుని మహిమను (మెప్పును) వెదకుటను సూచించదు; వారు పోగుచేయు దశమభాగము కూడ ఆయన మహిమను వెదకుటను సూచించదు. ఇంకను, యేసు నామములో అద్భుతములు లేక కార్యములు చేయుచున్నామని చెప్పుట వారు దేవునినుండి మహిమను కోరుచున్నారని కాదు. అయితే, దేవునినుండి మహిమను వెదకుటనగా అర్ధమేమి? అది ఆయన చిత్తమును కోరుట. ఆయన చిత్తమును ఎడతెగక కోరు సంఘములు ఎల్లప్పుడు వృద్ధి చెందును. ఏలయనగా కార్యములు చేయువారు వారు కాక, దేవుని మహిమయే వాటిని చేయును; ఆయన వారిని ఎన్నడును తన మార్గములను విడువనీయడు. జ్ఞాపకము చేసికొనుడి, అన్ని సమయములలో యేసు దేవునినుండి మహిమను కోరెను. కావున, దేవుడు తనకిచ్చిన వాటన్నిటిని నెరవేర్చి మహిమ పొందెను. దేవునినుండి మహిమను ఆశించుట నిత్యఫలితము నిచ్చును. అది విశ్వాసము. మనమాయన చిత్తమును పొందెదము. ఇది నిత్యజీవమునకు చాలును. ఏలయనగా దేవునితో అన్యోన్యతకై అవసరమైన సమస్తము దానియందు ఉండును.

తమ్మునుతాము తెలియపరచుకొనుటకై క్రైస్తవులు దేవుని సమీపింపరాదు; ఇందు నిమిత్తము వారు పిలువబడలేదు. బదులుగా, దేవుడే వారిని మహిమపరచవలెనని వారాయనను సమీపించవలెను. ఇది వారి పిలుపు స్వచ్ఛమైన విధేయతను కలిగియున్నదని సూచించును. వారాయననుండి మహిమను కోరుచునపుడు వాస్తవముగా ఆయన చిత్తమును అనుగ్రహించుమని వేడుకొనుచున్నారు. కావున, సంఘము చేయు క్రియలు అనేకముగా ఉన్నవి. ఏలయనగా అందరు ఒకే కృపావరమును కలిగియుండరు. మరో విధముగా చెప్పినచో, అందరు ఒకే కొలతను పొందరు. ఏమిట లాభము? దేవుడు తన శక్తిని, బలమును ప్రత్యక్షపరచుటకు అవకాశము ఉండును. ఏ మనుష్యుడు మనకు దయచేయని మహిమను పొందెదము. కావున, ఆత్మలో ఒక వ్యక్తి ఒకచోట “యెహోవా తన క్రియలను చూచి ఆనందినచును గాక” అని పలికెను.

ఆయన కార్యములు అనేకమైనవని ఆయన శక్తి, బలమువలన తెలియజేయబడును. కాబట్టి, క్రైస్తవులు ఎడతెగక ఆయననుండి వచ్చు మహిమను వెదకవలెను. తన చిత్తమును మన కనుగ్రహించుటకు ఆయన ఇష్టుడై యున్నాడని ఎరుగుట తప్ప ఆయన దానిని ఏలాగున జరిగించునో మనము ఎరుగ నవసరములేదు. ఏదైనా మనపట్ల ఆయన చిత్తమైనపుడు మరియు మనము దానిని పొందినపుడు అది మనకు చాలును. దానిని నెరవేర్చు బాధ్యతను ఆయన వహించును. ఇదే ఆయననుండి మహిమను కోరుటలో నున్న ధైర్యము. అయితే, ఇది మన క్రైస్తవ్యము కానియెడల మనకొరకు తీర్పు సిద్ధపరచబడి యున్నది. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు (రోమా. 1:20).

ఎంతమందికి ఈ సంగతి తెలియును? అయితే, క్రైస్తవులు ఈ సంగతి ఆయనగూర్చియని పూర్ణముగా అంగీకరించుచున్నారా? ఆయన ఎన్నడును తన చిత్తమును కారణము లేకుండ జరిగించలేదు. కాలము ప్రారంభమునుండి ఇప్పటివరకు తన ప్రజల పట్ల ఆయన కార్యములు అనేకమైనవి. అవన్నియు ఒకే ప్రకారముగా నుండలేదు మరియు ఎవడును వాటిని ముందుగా ఎరిగియున్నానని చెప్పలేడు. ఈ కారణమునుబట్టి, క్రైస్తవులైన మనము ఆయనవలన కలుగు మహిమను వెదకవలెను; మన సంకల్పము కన్న ఆయన సంకల్పమును వెదకవలెను; అప్పుడు, తన కుమారునియందు ఆయన వాగ్దానము చేసిన వాటన్నిటిని పొందుటకు నమ్మికను కచ్చితముగా కలిగియుందుము. బుద్ధిబలమువలన కలుగు విశ్వాసమందు అనేకులు ఇంకను ఎందుకు జీవించుచున్నారు? ఎందుకనగా, వారిలో నిజమైన విశ్వాసమును పుట్టించు మహిమను వారింకను వెదకియుండలేదు. ఆయన అదృశ్యలక్షణములను, నిత్యశక్తిని, దేవత్వమును వారి హృదయమందు చేర్చుకోనపుడు వారియందు పనిచేయుటకు ఆయన మహిమను కలిగియుండలేదు; వారింకను రక్షణ పొందవలసియున్నారు. వాటిని వారు బుద్ధిబలముతో అంగీకరించిరి గాని, ఆయనతో అన్యోన్యతకై కాకపోయెను. ఇది నిజముకానిచో, వారు తమ ఇష్టమును గాక ఆయన ఇష్టమునే వెదకుచుందురు.

ఆయన చిత్తమును వెదకుటకు భయపడకుము. ఏలయనగా దానియందు నష్టము కలిగించునది ఏదియు ఉండదు. ఆయన సంకల్పమును వెదకుట మనలను వ్యర్ధపరచుకొనుటని మరియు మనకున్నవి నష్టపోవుట అని ఊహించుచున్నయెడల, మరల ఆలోచించుము. మనకు తెలియజేయబడిన ఆయన అదృశ్యలక్షణములను, నిత్యశక్తిని, దేవత్వమును చూడుము. ఆయన చిత్తమును వెదకుట జీవితములో వ్యర్ధమైనవాటిని నష్టపోవుటకేనని గ్రహించెదవు. ఇట్టి గ్రహింపు ఆయననుండి వచ్చు మహిమకై అర్పించుకొనుటకు మనలను అనుమతించును. దానియందు ఆయన సమస్తమును దయచేయును – అనగా, సమస్త మంచివాటని, కుటుంబమును, స్నేహితులను, ఆస్తిని మొదలగునవి. శరీరమందు ఉన్న ప్రజలగా మనము చాలా వ్యర్ధమైనవాటిని కలిగియుందుమని దేవుడు ఎరిగియున్నాడు. మనమందరము వాటిని శరీరసంబంధమైన క్రియలవలన పొందితిమి. అవి ఆయనతో మనము నడువకుండునట్లు చేయును. కావున, మనము మొదటిగా ఆయన చిత్తమును ఎరిగి, ఆయన మార్గమును కనుగొనవలెనని ఆయన ఆశించుచుండెను. శరీరములో ప్రయాశపడి దేనినైనను లేక అన్నిటిని పొందుటకంటె దేవుని చిత్తమువలన వాటిని పొందుట మేలైనది కాదా? ఏలయనగా శరీరముతో సంపాదించునవి పాపమువలనై యుండును; కాని, దేవునినుండి పొందినవి ఆయన చిత్తమై యుండును. ఇందువలన మనము మహిమను వెదకువారము. కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా…ఆయనయందుండి నడుచుకొనుడి (కొలొ. 2:6).

దేవుని చిత్తప్రకారమైన నమ్మిక ద్వారా మనము క్రీస్తును పొందియున్నాము గనుక దానివలననే ఆయనలో ఉండి నడిచెదము. మరియు, దేవునినుండి మహిమను వెదకినపుడు మాత్రమే దీనిని చేయగలము. మన ఆలోచనలకు, ప్రయాశలకు తన సంకల్పమును దయచేయుమని ఆయనను వేడుకొను ప్రతిసారి ఆయన మహిమను మనకిచ్చుటకు సంతోషించును. ఆయన శక్తిని కోరు మన నమ్మికనుబట్టి ఆయన సంతోషించును. మనము నడుచునట్లు ఆయన సరైన మార్గమును, అనగా సత్యము నిచ్చును; ఎటువంటి ఆటంకమునైనను జయించుటకు తన శక్తిని మనకు దయచేయుచు, అధర్మ మార్గమునందు పోకుండునట్లు ఆయన నీతిని మనకనుగ్రహించును. దేవుని సంకల్పమునుబట్టి యేసును పొందుట ఒక స్త్రీని గాని, పురుషుని గాని, ఆయన మహిమను వెదకు మార్గమున అనివార్యముగా నిలువబెట్టును. ఇదే దేవునిచేత పిలువబడుటలో నున్న సారము. కాబట్టి, అపొస్తలుడు ఈలాగు చెప్పెను – వారు అన్యజనులవలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి (3 యోహా. 1:7).

దేవుని పిలుపులో నున్న శక్తిని చూడుము. దేవుని చిత్తప్రకారముగా యేసును పొందినవారిలో దానిని చూడుము. వారాయన చిత్తమును కలిగియుండిరి గనుక అన్నిటిని ఆయన కొరకు అల్పముగా ఎంచిరి. ఈ సంగతి వారు అన్యజనులనుండి లేక అవిశ్వాసులనుండి ఏమియు తీసికొనలేదను సత్యమునుబట్టి అర్ధమగుచున్నది. దేవుని మహిమ వారిలో పనిచేయుచుండెను. వారికేమైనను కొదువు ఉండెనా? లేదు! దేవుడు వారికి సమస్తము దయచేసెను. ఆయన మహిమపరచబడెనా? నిస్సందేహముగా! లేనియెడల, ఆయన వారినిగూర్చి మనకు తెలియపరచకపోవును. వారు ఎటువంటి అద్భుత కార్యములను చేసిరి? వారు కేవలము ఆయననుండి వచ్చు మహిమనే గాని, తమ మహిమను లేక ఒకరినుండి ఒకరు పొందు మహిమను వెదకలేదు. మనమాయన చిత్తమును వెదకినచో ఆయన శక్తి, లక్షణములు మరియు దేవత్వములో మనకు దొరుకునవి విస్తారముగా ఉండును. మనమాయనను అత్యంత శక్తిగా నమ్మియున్నాము. ఇప్పుడు, ఆయననుండి మహిమను పొందవలసినవారమై యున్నాము. మనము ఊహించుదానికంటె ఆయన మనలను ఎంతో గొప్పగా తీర్చిదిద్దును. మనము అనుకొనినదానికంటె ఆయనను గొప్పగా ప్రేమించెదము. ఇది దేవుడు తన పిల్లలయందు పనిచేయు విధానము.

కాబట్టి, ఆయనయందు నమ్మిక యుంచుదుము. మరల యేసు – నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను (యోహా. 8:12). తననుండి మహిమను ఆశించువారికి దేవుడు ఏర్పరచిన సహాయమునుగూర్చి ఎవరైనను ఇంకేమి చెప్పగలరు? ఆయన వారిని పిలిచి, తన చిత్తమును మాత్రమే దయచేయక వారు విఫలము కాకుండునట్లు వెలుగును కూడ వాగ్దానము చేయుచున్నాడు. దేవుడు కొంతకాలమే లోకముకు వెలుగైయున్నయెడల మనకు నమ్మకము ఉండకపోవును; వెంబడించుటకు మనకు ఎవరును ఉండకపోవును. కాని, ఆయననుండి మహిమను ఆశించు వారందరికి తానే నిరంతర వెలుగునని స్థిరపరచుటకు వచ్చెను. ఆయన వాగ్దానము చెరిగిపోనేరదు. అప్పుడు, చీకటిలో నడుచుటకు భయమెందుకు? మనమెక్కడికి వెళ్లినను, ఏమి చేసి, మాటలాడినను, మనమాయన వెలుగును వెంట తెచ్చి, దానిని ప్రకాశింతుము. మనుష్యుల మధ్య మన ఉనికి దేవునికి మహిమ కలుగజేయును. దేవుని చిత్తమును వెదకుటతో చాలా విషయము ముడిపడియుండెను మరియు దానిని నిర్లక్ష్యము చేయువారు అనేకులుండిరి. వారు వెలుగును చూడకపోవుచున్నారు. ఇందువలన కలుగు పరిణామము బహు స్పష్టముగా అగపడుచుండెను.

క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవము కలిగియున్నది (రోమా. 8:10). ఇదే దేవుని చిత్తమును కలిగియుండుటవలన లాభము. మనము ఇకమీదట శరీరముతో పనిచేయక ఆత్మతో నీతి ద్వారా పనిచేయుదుము. ఆయనతో అన్యోన్యత కలిగియుండుటకు కారణమిదే. దేవుని మహిమపరచుటకు శరీరములో క్రియలను ఆలోచన చేయక ఆత్మలో ఆలోచన చేసెదము. మనము కలిగియున్న శరీరము పాపమువలన దేవునికి పనికిరానిదాయెను. క్రీస్తు క్షయమైనదానికొరకు శ్రమపడి, మరణించలేదు. మరియు, దేవుడు సహితము రక్తమాంసములు తన రాజ్యములోనికి ప్రవేశించుట వీలుకాదని నిర్ణయించెను. మన ఆత్మలను నీతితో నూతనపరచుటకు క్రీస్తు శరీరములో వచ్చెను.

మన ఆత్మలు నీతితో నుండగా పాపము మనపై రాజ్యము చేయదు. మనము మహిమను వెదకువారగుదుము. మనలోనున్న నీతి శరీరమునుండి మహిమను కోరక దేవునినుండి మాత్రమే దానిని కోరును. ఏలయనగా అది దేవుని వ్యతిరేకించదు. దేవుని సంబంధమైనది దేవునినుండి కలుగు దానిని వెదకును. మరియు మన ఆత్మలు నీతిలో జీవించుచున్నవి గనుక దేవునినుండి వచ్చు మహిమను వెదకెదము. ఆయన మనతో మాటలాడు వాటన్నిటిని నమ్ముదము. ఆయన మాటచేత ఆయన చిత్తమును పొందెదము. కాబట్టి, వారు ఆత్మలో ఈలాగు చెప్పిరి – అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీయందు మన ప్రభువైన యేసు నామమును, ఆయనయందు మీరును మహిమనొందునట్లు, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్ధించుచున్నాము (2 థెస్స. 1:11-12).

Posted in Telugu Library.