క్రైస్తవునిగా జీవించుట అన్నిమార్లు ప్రస్తుత క్షణముకే కాదుగాని మరిఎక్కువగా రాబోవు కాలముకు చెందిన నిరీక్షణకై ఉన్నది. దీనియందు జీవితము సంపూర్ణమగును. లోకము ఈ సంగతిని గ్రహించదు. మనమైతే పందెమును మనకియ్యబడిన నిరీక్షణబట్టి పరుగెత్తుదుము. మరియు మూడు సంగతులను గూర్చి నిశ్చయతగలిగి యుండగలము.
1. దేవుడు మనవైపు మంచి వార్తను పంపించును. మన మహిమకొరకు కాక, తన మహిమకై ఆయన సమస్తమును జరిగించునట్లు ఆయన కొరకు కనిపెట్టుదము. “దూత – నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని“(లూకా. 1:19). జెకర్యా, ఎలీసెబెతులు కనిపెట్టవలసివచ్చెను, గాని దేవుని ఆశీర్వాదమును నష్టపోలేదు. క్రీస్తు ద్వారా మరణమును తప్పించుకొనవలెనని ఆయన మనలను ఎన్నుకొనినందునే ఆయన ద్వారా ఈ జీవితములో ఆయన మనకు మంచి వార్త ననుగ్రహించును.
2. దేవుని ఆశలోనుండి పుట్టిన వాగ్దానము విఫలముకాదు. ఆయన దానిని కొట్టివేయడు మరియు ఏదోవిధముగా విఫలమగునట్లు దానికి మార్గములు కూడ ఉండవు. మనము కేవలము నిరంతరము జీవించునట్లు ఆయన ఇదివరకే తన మాటను ఇచ్చియున్నాడు. “ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతివారి కొరకును, యెరూషలేము నివాసులకొరకును ఊట యొకటి తియ్యబడెను“ (జెక. 13:1).
3. దేవుడు మనలను విడిచిపెట్టును. పైనున్న రెండు నియమములనుబట్టి అపాయమునుండి విడిచిపెట్టబడుదుము. “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవు మాత్రము బొత్తిగా శిక్షనొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు“ (యిర్మి. 49:12). అల్లెలూయా!