నిత్యము అభివృద్ధి చెందుతు దాని ఫలితమును దయచేయుచున్న విశ్వాసమును కలిగియుండుట గొప్ప సంగతులకు కారణమగునని నమ్మవచ్చును.

1. క్రీస్తు కొరకైన దేవుని చిత్తము మనద్వారా నెరవేర్చబడును. సుమెయోను వారిని దీవించి – ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు (లూకా. 2:34). ప్రతిదినము తీర్పులు, ఆశీర్వాదములు దయచేయబడును.

2. అవసరమైనపుడు సంపూర్ణత, జయము మనకుండును. ఏలయనగా దేవుడు ఈలాగు చెప్పెను. కన్నులారా దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహు ఘనుడుగా ఉన్నాడని మీరందురు (మలా. 1:5).

3. దేవునినుండి కలుగు దానంతటికి అభ్యంతరము తెలుపము. వ్రాయబడిన సమస్తమును మరియు ఆయన మాటలాడు వన్నిటిని చిన్న బిడ్డవలె నమ్ముదుము. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (లూకా. 18:17).

4. దేవుని మహిమకై విశేషమైన మాటలు మన పెదవులనుండి బయలుపడును. పౌలు – ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను (అపొ. 21:13).

Posted in Uncategorized.