పరిశుద్ధులు

దేవుని సువార్త ప్రకటించబడు అత్యంత అవసరమున్నది. ప్రభువును ఎరిగి దానిని ప్రకటించువారు ఎక్కువగా లేకపోయిరి. అయితే, తమ స్వంత నీతితో దానిని ప్రకటించువారు పెక్కుమంది ఉండిరి. మరియు సంఘములు అనీతితో ఉన్నవి. సువార్తలో పాలుపంచుకొనుచున్న స్త్రీ, పురుషుల క్రియలను దేవుడు చూచుచున్నాడు, మరియు బయలువచ్చుచున్న సమాచారము వారికి అనుకూలముగా లేదు. ఏలయనగా ఆయన ఈలాగు చెప్పెను. ” – నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి, వారు వెండి మష్టువంటివారైరి(యెహె. 22:18). ఈ ప్రత్యేక కారణమునుబట్టి రక్షింపబడనివారివలన నశించుచున్నవారికి తన సువార్తను తీసికొని వెళ్లుటకు ప్రభువైన దేవుడు నిన్ను, నన్ను పిలిచెను.

క్రీస్తుకు చెందియున్నామని చెప్పుకొనుచున్న సంఘములలో చాలా వ్యర్ధత్వముండెను; ఆ సంఘములు లెక్కకుమించి ఉన్నవి. వారి లజ్జాకరమైన బోధలు, క్రియలే వ్యర్ధత్వమునకు కారణము. ఈ సంగతి వారియందు దేవుని మహిమ, పరిశుద్ధత, క్రియలు, చిత్తము మరియు ఆశీర్వాదములు లేకపోవుటవలన విశదమగుచున్నది. ఆయన నామమున వారు క్రియలు చేసిన ప్రతిసారి లోకముతో సమముగా చేసికొనుచున్నారు. లోకము దాని బలమందు జీవించుచు శరీరసంబంధమైన పనిని నెరవేర్చును. అది ఆత్మ యొక్క నియమమును వ్యతిరేకించుటలో ప్రఖ్యాతి పొందినది. అయినను, సంఘములు దానినుండి వేరుగా నుండుటకు వారి దృష్టిని క్రమపరచుకొనుట లేదు. వారు సువార్తను బూటకముగా చేసి లోకముకు తగినట్లుగా జీవించుటకు దానిని వాడుకొనుచున్నారు. హా! సాతాను సంతోషించుచున్నాడు. దేవుడు ఆశించినట్లుగా వాడు ఆకాశమునుండి మెరుపువలె తరచుగా పడుటలేదు. అయితే, ఆయన సింహాసనమును నిత్యము పట్టుకొని జీవించుచున్న ఆ కొద్దిమంది స్త్రీ, పురుషులనుబట్టి మన దేవునికి కృతజ్ఞతలు. మనము వారితోపాటు ఉండినయెడల దేవుడు ఎట్టి మహిమను పొందునో ఆలోచన చేయుడి. వాస్తవముగా, దేవుడు అట్టి మహిమను కోరుకొనుచున్నాడు. తన ఆశను సంపూర్ణపరచువారికై ఆయన వెదకుచున్నాడు. తన శక్తితో ప్రతి భారమును జయించు ప్రజలు తన పొలములో ఉండవలెనని కోరుచున్నాడు. అపవాది ఏ పాపముతోనైతే వారిని తరచుగా చిక్కులబెట్టునో దానిని తన బలముచేత విడిచిపెట్టు స్త్రీ, పురుషుల కొరకు ఆయన వెదకుచున్నాడు. ఆయన పరిశుద్ధులను కోరుచున్నాడు.

తనకు కలుగవలసిన మహిమను దేవుడు నిజముగా పొందవలసినచో సంఘములలో నున్న మష్టు తీసివేయబడవలెను. ఆయన జనులు వెండివలె నిర్మలులుగా తేటపడునట్లు సంఘములు కొలిమిలో వేయబడవలెను. మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మానవులు ఆయన ఆశలో నిలువనప్పటికీ దానిని నెరవేర్చుకొనుటకై ఆయన మనుష్యులను పుట్టించుగల సమర్ధుడు. ఆయన సువార్తను ప్రకటించుచు మనుష్యులలో ఆయన నీతిని పుట్టించలేనివారెవరు? వారు ఆయనకు అవమానము కలిగించు వేషధారులును హృదయమందు సున్నతి పొందనివారును కారా? కావున, ఆయన మౌనముగా ఉండక కార్యమును చేయును. తీర్పు ప్రకటించియుండనియెడల ఆయన మౌనము వహించును. మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును (మత్త. 7:19).

కచ్చితముగా ఇది జరుగును. దీనిని ఎవరు తప్పించుకోగలరు? అది జరుగకుండ ఎవరు అడ్డుకొనగలరు? క్రీస్తు నామములో చెడు ఫలములు ఫలించుచున్నవారు రాబోవుచున్న అగ్నినుండి తప్పించుకోలేరు. వారి మాటలు వారిని కాపాడునా? వారి తత్వజ్ఞానము, గొప్ప విద్య వారిని కాపాడునా? వీటిని దేవుని ముందుకు తీసికువచ్చి తమ ప్రాణము కొరకు విచారణ చేయుట వారికి సాధ్యమగునా? దేవుని సహనము సమాప్తమైనపుడు వారి అంతముకు సమయము వచ్చెను. ఎంత కాలము వారు ఆయన జనులను ఆహారమును మ్రింగునట్లు మ్రింగుదురు? ఎంతో కాలము కాదు, ఎందుకనగా నీవును నేను తన నామమును మహిమపరచుటకు ఆయనచేత పిలువబడితిమి. తన నామము మహిమ పొందుచుండగా వారు తీసివేయబడుదురు. మనము విశ్వాసము ద్వారా కృపవలననే రక్షింపబడితిమి గాని, మరి దేనివలనైనను కాదు. మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడితిమి గాని, మన క్రియవలన కాదు. ఏలయనగా, మనము దేవుని చిత్తప్రకారముగానే గాని ఈ కాలపు స్త్రీ, పురుషులవలె పనిచేయలేము; మన క్రియలు ఆయన ఆలోచనలబట్టి ఉండును. తాను ఘనత పొందుటకై వాటిని మనము కనుగొనునట్లు ఆయన అనుమతించును. కాబట్టి, దేవుడు తన కుమారుని ద్వారా తన నామమును ప్రకటించుటకు మన కనుగ్రహించిన ప్రతి మార్గమును గట్టిగా పట్టుకొందుము. అది ఆయన వాక్యమును పలుకుటైనను, ఆయన నామములో పరిచారము చేయుటైనను, ఇతరులను మనతో చేరుమని పిలుచుటైనను లేక మరేదైనను ఆలస్యము చేయకుందుము. మన సువార్త పరిచర్యతో వేషధారణ, స్వనీతి మరియు వ్యర్ధమైన దర్శనములతో నున్న మనుష్యుల దినములను అంతము చేయవలెనని దేవుడు ఉద్దేశించుచున్నాడు. కాబట్టి, దేవుడు నియమించినవారితోపాటు జతపనివారిగా ఉండుటకు ముందుకు పోవుదము.

మన పనికి మూలము ఇదే – కావున యేసు ఇట్లనెను – మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు (యోహా. 6:53). కాబట్టి, క్రీస్తు వాక్యమును తిని ఆయన కొరకు శ్రమ పడుదము. ఇది దేవునికి మహిమ నిచ్చును. ఆయన మనలను ఘనపరచును. నీవు ఆయన వాక్యమును తినినయెడల లేక ధ్యానించినయెడల కొనసాగవలసిన మార్గమును ఆయన నీకు చూపించును. నీవు దానియందు నడుచుట మొదలుపెట్టినప్పుడు కొంత శ్రమ ఉండును; గ్రహించినయెడల హఠాత్తుగా కలుగు దానివలన ఆశ్చర్యము పొందవు. ఏదేమైనను మన రక్షకుడైన దేవునికి ప్రార్ధించి, ఆయన వాక్యమును ధ్యానించుము; తప్పించుకొనుటకు మార్గమును ఆయన దయచేయును. నిన్ను సమస్త హానినుండి, ప్రమాదములనుండి, శత్రువులు, శ్రమపెట్టువారినుండి, మరిముఖ్యముగా అపవాదినుండి ఆయన కాపాడును. తన వస్త్రముతో నిన్ను కప్పును. మరియు నీవు జీవమును కలిగియుంటివి గనుక ఇతరులకు దానిని అందించెదవు. నీవు దేవుని మార్గములనుండి పొందినట్లుగానే వారికి బోధించెదవు. దీనంతటిలో నీకు అవసరమైనవాటినిగూర్చి చింతపడకుము. ఆయన వాటిని సమకూర్చును. నన్ను నమ్ముము! దీని విషయమై దేవుడు నన్ను జీవించుచున్న దృష్టాంతముగా చేసెను.

నేను ఐశ్వర్యములో పెరిగితిని మరియు నా జీవితములో ఎక్కువ భాగము దాని కలిగియుంటిని. నేను ఇతర ప్రదేశములకు వెళ్ళి, అక్కడ జీవించి, నా చింత లేకయే జ్ఞానమును సంపాదించితిని; దేవుడు నా కొరకు ఏర్పాటు చేసెను. నాకు బహు మంచి ఉద్యోగము, జీవించుటకు అన్ని ఏర్పాట్లు, బలమైన ఘనత ఉండెను. అయితే, దేవుడు తన మహిమకై నన్ను పిలిచినపుడు ఆయన కొరకు సమస్తమును విడిచిపెట్టుట కాదనలేకపోతిని. అయినను, నాకు లేమిలేదు. ఎందుకనగా, నాకు అవసరమైన వాటన్నిటిని ఆయన సమకూర్చుచుండెను. అప్పుడైతే నాకు అన్నియు ఉండెను కాని, ఇప్పుడైతే నేను లాభమందున్నాను. అనగా, నన్ను చుట్టుకొనియున్న దేవుని కృపవలన నేను ఎక్కువ తృప్తి కలిగి జీవించుచున్నాను. ఈ కృపయే గడిచిన సంవత్సరము లన్నిటిలో నన్ను పరిశుద్ధముగా ఉంచెను. ఎలాగనగా, అది నా ఆత్మను క్షమాపణ ద్వారా తెప్పరిల్లజేయుచు ప్రభువు నామమున ప్రార్ధించినపుడెల్లా నన్ను ఆయన చిత్తముకు నడిపించెను. నేను ఒకప్పుడు కలిగియున్న జీవితమును ఇకమీదట కలిగియుండకపోవచ్చును గాని, ఒక్క సంగతి నాకు తెలియును – నేనెల్లప్పుడు దేవుని ఆశీర్వాదములను, వాగ్దానములను మరియు వాటి యొక్క నెరవేర్పును నా జీవితములో కలిగియుందును. అవి నన్ను ఎత్తైన స్థలములలో నిలువబెట్టును; ఇందుకు ఆయన కృప సమర్ధవంతమైనది. ఏలయనగా నా జీవితము నాకు దృష్టాంతముగా ఉండునట్లు ఆయన తన కార్యములతో దానిని నింపెను. నేను ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగితిని గనుక ఈలాగు చేసెను. ఆయన ఇంకను ఈలాగు చేయును, ఎందుకనగా ఆయన కృప తన చిత్తమును సంపూర్ణపరచుమని నన్ను బలవంతము చేయుచుండెను; మరియు నేను ఆ పనియందు ఉంటిని. నీవు దేవుని పిలుపును వినుచుండగా ఈలాగుననే నిన్ను నడిపించి, సమర్ధునిగా చేయును. నీవు ఆయన కొరకు సృజింపబడియున్నావు.

దేవుడు తన మహిమకై నిన్ను ఏలాగు నడిపించునని నీవు ఆలోచించుచున్నయెడల, ఆలోచించకుము. ఆయన చిత్తమును అడుగుటయందు దృష్టి పెట్టుము. నీవు కృపవలన రక్షింపబడితివి గనుక ఆయన సింహాసనము యొద్దకు ఏ సమయమందైనను వెళ్లునట్లు నీకు స్వేఛ్చ అనుగ్రహింపబడెను. నీ ఆలోచనలు సరైన ఫలితములను దయచేయవని నీవెరుగుదువు. నీవింకను కలవరపడుచున్నయెడల ప్రభువు కార్యమును చూడుము. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు (అపొ. 16:6,7). నీవాయన చిత్తముకు లోనైనచో నిన్ను తప్పిపోనీయడు. నిన్ను కాపాడుట ఆయనకు తెలియును. నీ ఆలోచనలు నిన్ను బలవంతము చేయునప్పటికీ నీ ప్రభువు యొక్క ఆత్మ వాటిని జయించును; ఈ సంగతిని నీవు గ్రహించెదవు. ఇదే ఆయన శరీరమును తిని, ఆయన రక్తమును త్రాగుట ద్వారా కలుగు జీవమునుగూర్చిన లోతైన ఫలితము. నీవింకను ఆయనతో అన్యోన్యముగా జీవించెదవు. ఆయన నీ స్నేహితుడగును. ఆయనకు సామాన్యమైన అన్ని విధానములలో ఆయన ఆత్మ నీలో పనిచేయును. నీ సువార్త వినువారికి మేలుగా నుందువు. క్రీస్తులేని సంఘములలోనుండి దేవుడు గొర్రెలను మేకలను వేరుచేయుట నీవు చూచెదవు. ఏలయనగా పూర్వమందే తన మహిమ కొరకు ఏర్పరచుకొనిన అనేకులు ఇంకను పాపము యొక్క అధికారమందు ఉన్నారు. వారు సువార్త పక్షము నున్నవారు. వారు నిన్ను వినినపుడు నీవైపు తిరుగుదురు. అది ఆత్మ యొక్క పనియై యుండును. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును (2 కొరి. 3:17).

ప్రభువైన యేసు నీ ద్వారా వారి హృదయములకు దయచేయు స్వాతంత్ర్యమునుబట్టి వారు నిన్ను అంగీకరించునట్లు చేయును. ఆయన చెప్పినట్లుగా తాను పంపిన నిన్ను వారు అంగీకరించినచో ఆయనను పంపిన వానిని వారు అంగీరించిరి. దీనియందు దేవుని ఆశ సంపూర్ణమగును, ఎందుకనగా వారు కూడ విశ్వాసమునుబట్టి నీతిమంతులైరి. నీవు తెలిసికొనినదానిని వారు కూడ తెలిసికొనునట్లు దేవుడు వారికి మార్గము నిచ్చును. ఏలయనగా లోకముతో సమముగా ఉండదలచినవారు తప్ప మహోన్నతుడైన దేవుడు వాగ్దానము చేసిన స్వేచ్ఛను ఎవరు ప్రేమించకుందురు? దానిని ప్రేమించువారు పాపముచేత బంధింపబడి యుండినందున ప్రేమించెదరు. వారు శ్రమలో, బాధలో, అవివేకములో, అసంతృప్తితో ఉన్నవారు. సంఘములకు వెళ్లుచున్నప్పటికీ వారు విడుదల పొందలేదు. నీతిలో వచ్చు సువార్తను వారు ఎదుర్కొనలేదు. అట్టి సువార్త వారికి ప్రభువు యొక్క ఆత్మను అనుగ్రహించును మరియు ప్రభువు యెక్కడ ఉండునో అక్కడ కృప కలుగును. నిర్భయమును తెలియజేయు స్వాతంత్ర్యముకు కృప కారణము. దానిని కనుగొంటివి గనుక దేవుడు తన మహిమకై ఆశించిన ప్రజలను నీవు ముట్టుదువు.

అయితే, స్వాతంత్ర్యమును హత్తుకొనని మనుష్యులను నీ ప్రయాశలో ఎదుర్కొందువని మరువకుము. వారు గృడ్డివారిగా ఉండుటకే ఇష్టపడుదురు. వారు తమ గతమును చూచి, తమ కొరకు నిర్మించుకొనిన ప్రసిద్ధి విషయమై కలవరము నొంది నీకు శ్రమ కలిగింతురు. కాని, మన ప్రభువు యొక్క ఆత్మ నిన్ను కాపాడును. దేవుడు వారిని ముందుగానే ఎరిగియున్నాడు. మష్టును ఎంచినట్లుగా ఆయన వారిని ఎంచును. ఆయన వెండిని బయటకు తెచ్చినపుడు వారిపై తీర్పును జరిగించెనని నీవు కనుగొందువు. వారినిగూర్చి ఆయన ఉద్దేశమును ఇప్పటికే చెప్పియున్నాడు. అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి (యూదా. 1:11).

ఇట్టివారిని నీవు పెక్కుమందినే చూచెదవు. వారు సంఘములంతట ఉండిరి మరియు మనచుట్టు అనేక సంఘములున్నవి. నీవు కలిసిన ప్రతివానిని నమ్మకుము గాని, దేవుని ఆత్మ వారినిగూర్చి నిన్ను ఒప్పింపజేయనిమ్ము. ఫలితములకై తొందరపడకుము. దేవుడు నిన్ను తన మార్గముకు నడిపించినయెడల నీకు సంతోషము కలుగునట్లు ఫలితము లుండును. అన్ని సమయములలో ప్రార్ధించుటను వాక్యమును ధ్యానించుటను మరువకుము. దేవుడు నీకు నియమించిన చిత్తమును సంపూర్ణపరచెదవు. అప్పుడు, జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈలోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా? (1 కొరి. 1:20).

Posted in Telugu Library.